Oppo Reno 6 5G: ఒప్పో రెనో సిరీస్‌లో రెండు వేరియంట్లలో స్మార్ట్‌ఫోన్లు.. ఫీచర్స్‌ ఇవే..!

Oppo Reno 6 5G: ప్రస్తుతం కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి మొబైల్‌ తయారీ కంపెనీలు. ఇక తాజాగా ఒప్పో కంపెనీ రెనో సిరీస్‌లో రెండు కొత్త ఫోన్లను భారత మార్కెట్లోకి..

Oppo Reno 6 5G: ఒప్పో రెనో సిరీస్‌లో రెండు వేరియంట్లలో స్మార్ట్‌ఫోన్లు.. ఫీచర్స్‌ ఇవే..!
Follow us

| Edited By: Subhash Goud

Updated on: Jul 15, 2021 | 6:41 PM

Oppo Reno 6 5G: ప్రస్తుతం కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి మొబైల్‌ తయారీ కంపెనీలు. ఇక తాజాగా ఒప్పో కంపెనీ రెనో సిరీస్‌లో రెండు కొత్త ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఒప్పో రెనో 6 5జీ, రెనో 6 ప్రో 5జీ పేరుతో వీటిని అందుబాటులోకి తీసుకువచ్చింది. రెనో 6 ప్రీమియం మిడ్ రేంజ్‌లో రెనో 6 మోడల్‌, ఫ్లాగ్‌షిప్ కేటగిరిలో రెనో 6 ప్రోను తీసుకువచ్చారు. గతంలో విడుదల చేసిన రెనో 5 సిరీస్‌కు కొనసాగింపుగా కొత్త ఫోన్లను విడుదల చేశారు. వీటిలో ర్యామ్ ఎక్స్‌పాన్షన్‌ టెక్నాలజీ ఇస్తున్నారు. ఈ రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 11 ఆధారిత కలర్ ఓఎస్‌ 11.3 ఓఎస్‌తో పనిచేస్తాయి. రెండు మోడల్స్‌ అరోరా, స్టెల్లార్ బ్లాక్ రంగుల్లో లభిస్తాయి.

రెనో 6 5జీ

ఈ ఫోన్‌లో 90Hz రిఫ్రెష్‌ రేట్‌తో 6.43-అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ ఫ్లాట్ అమోలెడ్ డిస్‌ప్లే అందిస్తోంది. అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్ ఉపయోగించారు. బ్యాక్‌ 64ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు 8ఎంపీ, 2ఎంపీ కెమెరాలు పొందుపర్చారు. వీడియో కాల్స్‌, సెల్ఫీల కోసం ముందు భాగంలో 32ఎంపీ కెమెరా అమర్చారు. ఇందులో 4,300 ఎంఏహెచ్ సామర్థ్యం బ్యాటరీ ఉంది. ఇది 65వాట్ సూపర్‌వీఓఓసీ 2.0 ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 8జీబీ ర్యామ్‌ + 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 29,990 ఉంది. ఇది మొబైల్‌ స్టోర్‌లలో, ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు.

రెనో 6 ప్రో 5జీ

ఈ వేరియంట్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.55-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ కర్వ్‌డ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే ఉండగా, మొత్తం ఐదు కెమెరాలున్నాయి. వెనక నాలుగు, ముందు ఒక కెమెరా అమర్చారు. వెనకవైపున 64ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు, 8ఎంపీ కెమెరా, రెండు 2ఎంపీ కెమెరాలు ఇస్తున్నారు. ముందు 32ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. 4,500 ఎంఏహెచ్‌ సామర్థ్యం బ్యాటరీ, 65 వాట్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 12జీబీ ర్యామ్‌ + 256జీబీ ఇంటర్నల్‌ మెమొరీ వేరియంట్లో ఈ ఫోన్‌ లభిస్తుంది. దీని ధర రూ. 39,990.

ఇవీ కూడా చదవండి

POCO F3 GT: పోకో ఎఫ్3 జీటీ స్మార్ట్‌ఫోన్‌.. ముందే లీకైన స్పెసిఫికేషన్స్ వివరాలు.. విడుదల ఎప్పుడంటే

Samsung Galaxy A22: సాంసంగ్‌ నుంచి గెలక్సీ ఏ22 మొబైల్‌.. అదిరిపోయే ఫీచర్స్‌.. విడుదల ఎప్పుడంటే..!