Oneplus Nord 4: రిలీజ్‌కు ముందే దుమ్మురేపుతున్న వన్‌ప్లస్ నయా ఫోన్ లీక్స్.. ఆకట్టుకునేలా నార్డ్-4 ఫీచర్స్

|

Jul 07, 2024 | 5:45 PM

భారత మార్కెట్‌లో మధ్య శ్రేణి ధరలతో ఫోన్లు అందుబాటులోకి తీసుకొస్తే సేల్స్‌లో దుమ్మురేపవచ్చని భావించిన వన్‌ప్లస్ నార్డ్ సిరీస్‌తో నయా స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేస్తుంది. ఇప్పటికే హిట్ అయిన నార్డ్ సిరీస్‌లో అప్‌గేడెడ్ వెర్షన్‌గా వన్‌ప్లస్ నార్డ్ 4 ఫోన్ లాంచ్ చేస్తోంది. మెరుగైన సాఫ్ట్‌వేర్ అనుభవాన్ని అందించడానికి ఫోన్ తగినంత శక్తి, పనితీరుతో ప్యాక్ చేసిన నార్డ్-4 జూలై 16న జరగనున్న వన్ ప్లస్ గ్లోబల్ ఈవెంట్‌లో ప్రకటిస్తారని టెక్ నిపుణులు చెబుతున్నారు.

Oneplus Nord 4: రిలీజ్‌కు ముందే దుమ్మురేపుతున్న వన్‌ప్లస్ నయా ఫోన్ లీక్స్.. ఆకట్టుకునేలా నార్డ్-4 ఫీచర్స్
Oneplus Nord 4
Follow us on

భారతదేశంలో ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం తారాస్థాయికు చేరింది. ఈ నేపథ్యంలో అన్ని కంపెనీలు సరికొత్త ఫీచర్స్‌తో నయా స్మార్ట్ ఫోన్స్‌ను ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తున్నాయి. ప్రస్తుతం వన్‌ప్లస్ ఫోన్లు కెమెరా ప్రియులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ధరలు భారీగా ఉండడంతో కొద్దిపాటి మంది మాత్రమే వన్‌ప్లస్ ఫోన్లను కొనుగోలు చేసే వారు. కానీ భారత మార్కెట్‌లో మధ్య శ్రేణి ధరలతో ఫోన్లు అందుబాటులోకి తీసుకొస్తే సేల్స్‌లో దుమ్మురేపవచ్చని భావించిన వన్‌ప్లస్ నార్డ్ సిరీస్‌తో నయా స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేస్తుంది. ఇప్పటికే హిట్ అయిన నార్డ్ సిరీస్‌లో అప్‌గేడెడ్ వెర్షన్‌గా వన్‌ప్లస్ నార్డ్ 4 ఫోన్ లాంచ్ చేస్తోంది. మెరుగైన సాఫ్ట్‌వేర్ అనుభవాన్ని అందించడానికి ఫోన్ తగినంత శక్తి, పనితీరుతో ప్యాక్ చేసిన నార్డ్-4 జూలై 16న జరగనున్న వన్ ప్లస్ గ్లోబల్ ఈవెంట్‌లో ప్రకటిస్తారని టెక్ నిపుణులు చెబుతున్నారు. అయితే రిలీజ్‌కు ముందే ఈ ఫోన్ ఫీచర్స్‌పై పలు లీక్స్ మొబైల్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వన్‌ప్లస్ రిలీజ్ చేసే నయా ఫోన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

ఆన్‌లైన్‌లో కనిపించిన అనేక డిజైన్ లీక్‌లలో ముఖ్యంగా ఈ ఫోన్ కలర్స్ ఆకట్టకునేలా రూపొందించారని పేర్కొంటున్నారు. డబుల్ టోన్ మింట్ గ్రీన్ ఫినిషింగ్‌తో పాటు డబుల్ సిల్వర్ ఫినిషింగ్‌తో వస్తుందని చెబుతున్నారు. సిల్వర్ ఫినిషింగ్‌తో పాటు గ్రీన్, బ్లాక్ వేరియంట్‌లు వెనుక వస్తాయని చెబుతున్నారు. ఇవి ఫ్లాట్ సైడ్‌ల ముందు బెవెల్డ్ కార్నర్‌లతో సంపూర్ణంగా ఫ్లాట్‌గా ఉంటాయి. మూడు ఫినిషింగ్‌లు కొత్త కెమెరా లేఅవుట్‌తో ఆకట్టుకునేలా రూపొందించారు. ముఖ్యంగా ఎల్ఈడీ ఫ్లాష్ మాడ్యూల్స్‌తో డబుల్ కెమెరా సెటప్‌తో ఈ ఫోన్ అందరినీ ఆకర్షిస్తుంది. అధునాత ప్రీమియం లుక్‌తో వచ్చే ఈ ఫోన్ పిక్సెల్ సిరీస్‌ను గుర్తుకు తెచ్చేలా ఉన్నాయి. 

వన్‌ప్లస్ నార్డ్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 7+ జెన్3 ప్రాసెసర్‌తో రిలీజ్ చేస్తారని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 120 హెచ్‌జెడ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌తో 6.74 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాతో పాటు 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుందని పేర్కొంటున్నారు. ఈ ఫోన్ 5,500 ఎంఏహెచ్ బ్యాటరీతో 100 వాట్స్ ఫాస్ట్ వైర్డు ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..