Oneplus 10R Lite: 17 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్‌.. ప్రపంచంలోనే అత్యంత వేగమైన ఛార్జింగ్ టెక్నాలజీ..

Oneplus 10R Lite: కంపెనీల మధ్య పెరుగుతోన్న పోటీ కారణంగా రోజురోజుకీ సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది. ముఖ్యంగా స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్లో వినియోగదారులను ఆకర్షించేందు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నాయి సంస్థలు. తాజాగా చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం వన్‌ప్లస్‌ ఇలాంటి...

Oneplus 10R Lite: 17 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్‌.. ప్రపంచంలోనే అత్యంత వేగమైన ఛార్జింగ్ టెక్నాలజీ..

Updated on: Jun 02, 2022 | 4:09 PM

Oneplus 10R Lite: కంపెనీల మధ్య పెరుగుతోన్న పోటీ కారణంగా రోజురోజుకీ సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది. ముఖ్యంగా స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్లో వినియోగదారులను ఆకర్షించేందు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నాయి సంస్థలు. తాజాగా చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం వన్‌ప్లస్‌ ఇలాంటి ఓ కొత్త టెక్నాలజీనే అందుబాటులోకి తీసుకొస్తోంది. వన్‌ప్లస్‌ తాజాగా 10 ఆర్‌ లైట్‌ పేరుతో కొత్త స్మార్ట్‌ వాచ్‌ను లాంచ్‌ చేస్తోంది. ఈ ఫోన్‌లో అమర్చిన ఛార్జింట్‌ టెక్నాలజీ ప్రపంచంలోనే అత్యంత వేగమైన ఛార్జింగ్ టెక్నాలజీగా పేరు తెచ్చుకుంది.

ఇందులో 150 వాట్స్‌ సూపర్‌వూక్‌ ఛార్జింగ్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. 4500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీతో వస్తోన్న ఈ ఫోన్‌లో కేవలం 17 నిమిషాల్లోనే 100 శాతం పూర్తి అవుతుంది. ఇక ఈ ఫోన్‌కు సంబంధించిన మిగతా ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.59 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించనున్నారు. మీడియా టెక్‌ డైమెన్సిటీ 8100 మ్యాక్స్‌ ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో నడిచే ఈ ఫక్షన్‌లో గరిష్టంగా 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ అందించనున్నారు.

కెమెరా విషయానికొస్తే ఈ 5జీ స్మార్ట్‌ ఫోన్‌లో 64 మెగాపిక్సెల్ రెయిర్‌ కెమెరాతో పాటు, 16 మెగా పిక్సెల్‌ సెల్ఫీ కెమెరాను అందించారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను భారత్‌లో త్వరలోనే లాంచ్‌ చేయనున్నారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో 5జీ, డ్యూయల్‌ 4జీ వోల్ట్‌, వైఫై 6 802.11, బ్లూటూత్‌ 5.2, యూఎస్‌బీ టైప్‌ సీ పోర్ట్‌ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్‌ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..