AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

36 గంటల బ్యాటరీతో కొత్త ఇయర్‌బడ్స్! ఫీచర్లతోనే ఫిదా చేస్తున్న OnePlus Buds Clip

సాధారణ ఇయర్‌బడ్స్‌కు భిన్నంగా ఓపెన్ ఇయర్ డిజైన్‌తో కొత్త ఆడియో ఉత్పత్తిని తీసుకొచ్చేందుకు OnePlus సిద్ధమవుతోంది. OnePlus Buds Clip పేరుతో వస్తున్న ఈ ఇయర్‌బడ్స్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో లిస్ట్ చేసినట్లు సమాచారం. చెవిలోపలికి పెట్టుకునే బదులు, చెవికి క్లిప్‌లా అమర్చుకునేలా వీటిని రూపొందించారు. ఆడియో కంపెనీ Dynaudio సహకారంతో అభివృద్ధి చేసిన ఈ మోడల్‌లో డ్యూయల్ డైనమిక్ డ్రైవర్లు, AI ఆధారిత కాలింగ్ ఫీచర్లు, Bluetooth 6.1 వంటి సదుపాయాలు ఉన్నాయి.

36 గంటల బ్యాటరీతో కొత్త ఇయర్‌బడ్స్! ఫీచర్లతోనే ఫిదా చేస్తున్న OnePlus Buds Clip
Oneplus Buds Clip Open Ear Earbuds.jpg
Nikhil
|

Updated on: Oct 26, 2026 | 8:30 PM

Share

ఓపెన్ ఇయర్ ఇయర్‌బడ్స్‌ ప్రత్యేకత ఏమిటంటే, చెవులను పూర్తిగా మూసివేయకుండా ఆడియో వినే అవకాశం కల్పించడం. సంగీతం వింటూనే పరిసరాల్లోని శబ్దాలను కొంతవరకు వినగలిగేలా ఈ డిజైన్ ఉపయోగపడుతుంది. OnePlus Buds Clipలో 10-బ్యాండ్ ఈక్వలైజర్‌, బాస్‌ సర్దుబాటు ఫీచర్‌, రెండు పరికరాలకు ఒకేసారి కనెక్ట్ అయ్యే సదుపాయం వంటి అంశాలు ఉన్నాయి. అయితే, ఈ ఇయర్‌బడ్స్‌ ధర, అధికారిక లాంచ్ తేదీ, భారత మార్కెట్‌లో లభ్యతను కంపెనీ ఇంకా ప్రకటించలేదు.

డ్యూయల్ డ్రైవర్లు

OnePlus Buds Clipలో చెవిలోపలికి వెళ్లే సాంప్రదాయ డిజైన్‌కు బదులుగా క్లిప్ తరహా నిర్మాణాన్ని అందించారు. ఇందులో 11mm, 9mm పరిమాణాల రెండు డైనమిక్ డ్రైవర్లు ఉన్నట్లు వివరించారు. LHDC 5.0, AAC, SBC ఆడియో కోడెక్‌లకు సపోర్ట్‌ ఉంది. సంగీతంలోని బాస్‌, ఇతర ఆడియో వివరాలను వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా మార్చుకునేందుకు 10-బ్యాండ్ ఈక్వలైజర్‌, Basewave ఫీచర్లు అందించారు.

సౌండ్ బయటివారికి ఎక్కువగా వినిపించకుండా నియంత్రించేందుకు Private Soundstage ఫీచర్‌ను కూడా చేర్చారు. అయితే, ఓపెన్ ఇయర్ డిజైన్ కారణంగా పరిసరాల శబ్దాలు వినిపించవచ్చు. అందువల్ల రద్దీగా ఉండే రోడ్లపై ఉపయోగించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి.

బ్యాటరీ వివరాలు

కాల్స్‌ కోసం ప్రతి ఇయర్‌బడ్‌లో రెండు MEMS మైక్రోఫోన్లు, ఒక VPU మైక్రోఫోన్‌ ఉన్నట్లు సమాచారం. AI Bone Call ఫీచర్ పరిసరాల శబ్దాల ప్రభావాన్ని తగ్గించి, వాయిస్ స్పష్టతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇందులో 6nm AI ఆడియో చిప్‌, Bluetooth 6.1 సపోర్ట్‌ ఉన్నాయి. ఒకేసారి రెండు పరికరాలకు కనెక్ట్ కావడంతో పాటు Google Fast Pair, Microsoft Swift Pair, AI Translate, టచ్ జెస్చర్లు, Drop Monitor వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.

బ్యాటరీ విషయానికి వస్తే, ఒక్కసారి ఛార్జ్‌తో ఇయర్‌బడ్స్‌ 8 గంటల వరకు, ఛార్జింగ్ కేసుతో కలిపి మొత్తం 36 గంటల వరకు పనిచేస్తాయని కంపెనీ వివరాలు సూచిస్తున్నాయి. ప్రతి ఇయర్‌బడ్‌లో 58mAh, కేసులో 530mAh బ్యాటరీలు ఉన్నాయి. USB Type-C ఛార్జింగ్‌ సదుపాయం ఇచ్చారు. ఒక్కో ఇయర్‌బడ్‌ బరువు 3.9 గ్రాములు కాగా, కేసు బరువు 35.9 గ్రాములు. IP55 రేటింగ్‌ దుమ్ము, నీటి తుంపర్ల నుంచి రక్షణ కల్పిస్తుంది. Pearl White, Pebble Grey, Twilight Rose రంగుల్లో రానున్న OnePlus Buds Clip ధర, భారత లాంచ్ వివరాలు అధికారికంగా వెల్లడైన తర్వాతే పూర్తి స్పష్టత రానుంది.

Follow Us