OnePlus 9RT : అక్టోబర్‌లో మార్కెట్‌లోకి వన్‌ప్లస్ 9ఆర్‌టీ స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు, ధర వివరాలివే..

OnePlus 9RT : పోటీ ప్రపంచంలో రాణించాలంటే నిత్యం వినియోగదారుల అభిరుచికి తగ్గట్లుగా కంపెనీలు ప్రోడక్ట్స్‌‌ను విడుదల చేయాల్సిందే. ఈ పోటీ మొబైల్ కంపెనీల మధ్య ఎక్కువగా

OnePlus 9RT : అక్టోబర్‌లో మార్కెట్‌లోకి వన్‌ప్లస్ 9ఆర్‌టీ స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు, ధర వివరాలివే..
One Plus
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 15, 2021 | 7:34 AM

OnePlus 9RT : పోటీ ప్రపంచంలో రాణించాలంటే నిత్యం వినియోగదారుల అభిరుచికి తగ్గట్లుగా కంపెనీలు ప్రోడక్ట్స్‌‌ను విడుదల చేయాల్సిందే. ఈ పోటీ మొబైల్ కంపెనీల మధ్య ఎక్కువగా ఉంటుందనే చెప్పాలి. అందుకే.. మొబైల్ తయారీ కంపెనీలు నిత్యం అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకుని, సరికొత్త ఫీచర్లతో.. వినియోగదారులకు మొబైల్ ఫోన్లను అందిస్తున్నాయి. తాజాగా వన్‌ప్లస్ నుంచి 9ఆర్‌టీ మోడల్ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు 9ఆర్‌టీ మోడల్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ ఫోన్‌ను అక్టోబర్‌లో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించిన కంపెనీ.. తాజాగా డేట్‌ని కన్ఫామ్ చేసింది. అక్టోబర్ 15వ తేదీన ఈ ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌ను మందుగా చైనా, భారత్‌లో చేయనున్నారు. వన్‌ప్లస్ 9ఆర్‌టీ రెండు వేరియంట్లలో విడుదల కానుంది. 8జీబీ ప్లస్ 128 జీబీ, 8 జీబీ ప్లస్ 256 జీబీ వేరియంట్లలో ఈ ఫోన్‌ను విడుదల చేయనున్నారు. 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.34,300 వరకు ఉండగా, 256 జీబీ వేరియంట్ ధర రూ. 37,700 గా ఉండనుంది.

వన్‌ప్లస్ 9ఆర్‌టీ ఫీచర్లు.. 6.55 ఇంచ్ సామ్‌సంగ్ ఈ3 ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూప‌ర్ ఏఎమ్‌వోఎల్ఈడీ డిస్‌ప్లే, 120 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్‌, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌, స్నాప్‌డ్రాగ‌న్ 870 ఎస్‌వోసీ ప్రాసెస‌ర్‌, 8జీబీ ప్లస్ 128 జీబీ, 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంట‌ర్నల్ స్టోరేజ్‌, ట్రిపుల్ రేర్ కెమెరా సెట‌ప్, 50 ఎంపీ సోనీ సెన్సార్, 16 ఎంపీ సోనీ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్‌, 4500 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 65 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ లాంటి అత్యాధునిక‌మైన ఫీచ‌ర్లు ఈ సిరీస్‌ ఫోన్లలో ఉన్నాయి.

Also read:

Tollywood Drug Case: ముమైత్ ఖాన్ వంతు వచ్చింది.. నేడు ఈడీ అధికారుల ముందుకు ..

Kanika Niti: లోకంలో ధనాశాపరులు, అధికార దాహంతో అలమటించేవాళ్లు పాటించే దుర్మార్గపు నీతి.. మహాభారతంలోని కణిక నీతి

Regina Cassandra: లేడీ ఓరియెంటెడ్ మూవీతో రానున్న రెజీనా.. ఆకట్టుకుంటున్న ‘నేనేనా’ ట్రైలర్..