Nokia C12 Pro: నోకియా నుంచి మరో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌.. రూ. 7వేల లోపు అదిరిపోయే ఫీచర్లు.

|

Mar 23, 2023 | 6:44 AM

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం నోకియా ఇటీవల మార్కెట్లోకి వరుసగా స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్‌ చేస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్‌ చేస్తూ ఫోన్‌లను విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా...

Nokia C12 Pro: నోకియా నుంచి మరో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌.. రూ. 7వేల లోపు అదిరిపోయే ఫీచర్లు.
Nokia C12 Pro
Follow us on

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం నోకియా ఇటీవల మార్కెట్లోకి వరుసగా స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్‌ చేస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్‌ చేస్తూ ఫోన్‌లను విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా నోకియా సీ12 ప్రో పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. తక్కువ బడ్జెట్‌లో ఆకర్షణీమైన ఫీచర్లను ఇందులో అందించారు. నోకియా సీ12 లాంచ్‌ చేసిన వారం రోజుల్లోనే ప్రో వెర్షన్‌ను తీసుకొచ్చింది. ఇంతకీ ఈ ఫోన్‌ ధర ఎంత.? ఫీచర్లు ఎలా ఉన్నాయి.? లాంటి పూర్తి వివరాలపై ఓ లుకకేయండి..

ఈ స్మార్ట్‌ ఫోన్‌లో అక్టాకోర్‌ ప్రాసెస‌ర్‌, 2జీబీ వ‌ర్చువ‌ల్ రామ్ స‌పోర్ట్‌తో క్లీన్ ఆప‌రేటింగ్ సిస్టమ్‌ లాంటి ఫీచర్లను అందించారు. ఇక ఈ ఫోన్‌ ధర విషయానికొస్తే 2జీబీ ర్యామ్‌/64 జీబీ స్టోరేజ్‌ మోడల్ కోసం రూ.6,999 గా ఉంది. అదనంగా, 3జీబీ ర్యామ్‌/64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 7,499గా ఉంది. చార్‌కోల్‌, డార్క్‌ క్యాన్‌ కలర్స్‌లో ఈ ఫోన్‌ లభిస్తోంది. ఎక్సైంజ్‌పై పలు ఆన్‌లైన్‌ స్టోర్స్‌ ఆఫర్లు సైతం అందిస్తున్నాయి.

ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.3 ఇంచెస్‌ ఫుల్‌హెచ్‌డీ+ఎల్‌సీడీ ప్యానెల్‌ను అందించారు. ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 8 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతోపాటు, సెల్ఫీల కోసం 5 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 4000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..