AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp New feature: వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్లు.. ఫొటోలు పంపే వారికి గుడ్ న్యూస్.. సూపర్‌గా స్టేటస్ రిప్లై ఆప్షన్

వినియోగదారులను ఆకట్టుకోడానికి వాట్సాప్ కూడా కొత్త అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇస్తుంది. అయితే ఇటీవల వాట్సాప్ ఓ కొత్త అప్‌డేట్‌ను ఇచ్చింది. ముఖ్యంగా తమ మూడ్‌ను తెలియజేసేందుకు యూజర్లు స్టేటస్‌లు పెడుతూ ఉంటారు. ఆ స్టేటస్‌లకు వివిధ రిప్లైస్ ఇచ్చేలా కొత్త అప్‌డేట్‌ను వాట్సాప్ పరిచయం చేసింది.

WhatsApp New feature: వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్లు.. ఫొటోలు పంపే వారికి గుడ్ న్యూస్.. సూపర్‌గా స్టేటస్ రిప్లై ఆప్షన్
Whatsapp
Nikhil
|

Updated on: Feb 17, 2023 | 1:18 PM

Share

ఇటీవల వాట్సాప్‌ యువతను ఎక్కువగా ఆకట్టుకుంటుంది. ఈ ఇన్‌స్టంట్ మేసేజ్ యాప్ ద్వారా మెజేజ్‌లతో పాటు మెసేజ్‌లు, వీడియోలు, ఫొటోలు, ఆడియో ఫైల్స్, ఇతర ఫైల్స్ కూడా పంపే అవకాశం ఉండడంతో ఎక్కువ మంది ఈ యాప్‌ను ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారులను ఆకట్టుకోడానికి వాట్సాప్ కూడా కొత్త అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇస్తుంది. అయితే ఇటీవల వాట్సాప్ ఓ కొత్త అప్‌డేట్‌ను ఇచ్చింది. ముఖ్యంగా తమ మూడ్‌ను తెలియజేసేందుకు యూజర్లు స్టేటస్‌లు పెడుతూ ఉంటారు. ఆ స్టేటస్‌లకు వివిధ రిప్లైస్ ఇచ్చేలా కొత్త అప్‌డేట్‌ను వాట్సాప్ పరిచయం చేసింది. ఎమోజీలతో పాటు, వాయిస్ మేసేజ్‌స్ ద్వారా కూడా రిప్లై పంపేలా సరికొత్త ఫీచర్‌ను జోడించింది. ఈ అప్‌డేట్‌తో పాటు మరో కొత్త ఫీచర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ ఫీచర్ గురించి ఓ సారి తెలుసుకుందాం.

గరిష్టంగా 100 ఫొటోలు పంపేలా

ప్రస్తుతం వాట్సాప్ ద్వారా గరిష్టంగా 30 ఫొటోలను పంపే అవకాశం ఉంది. ఇప్పుడు దాన్ని వంద ఫొటోలు పంపేలా అప్‌డేట్ చేశారు. అలాగే వీడియోలను అదే స్థాయిలో పంపే అవకాశం ఉంది. ఈ అప్‌డేట్ ఫొటోలు షేర్ చేసే వారికి కచ్చితంగా ఉపయోగపడుతుంది.

డాక్యుమెంట్ క్యాప్షన్

గ్రూప్ లేదా చాట్‌లో డాక్యుమెంట్ షేర్ చేసే సమయంలో ఎలాంటి క్యాప్షన్‌ను జత చేసే అవకాశం గతంలో ఉండేది కాదు. ఇప్పుడు డాక్యుమెంట్స్‌కు కూడా కాప్షన్ జోడిండే అవకాశం కల్పించింది. 

ఇవి కూడా చదవండి

క్యారెక్టర్ లిమిట్‌ పెంపు

వాట్సాప్ గ్రూప్ సబ్జెక్ట్‌కు క్యారెక్టర్ లిమిట్‌ను భారీగా పెంచింది. ఇంతకు ముందు 25 అక్షరాల లిమిట్‌తో ఉండేవి. 100 అక్షరాల వరకూ టైప్ చేసుకునే అవకాశం ఉంది. గ్రూప్ ఉద్దేశాన్ని అర్థం చేసుకోడానికి మారిన ఫీచర్ ఉపయోగపడుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

పెర్సస్నలైజ్డ్ అవతార్స్

ఈ కొత్త అపడేట్‌తో యూజర్లు హోమ్ స్క్రీన్‌లో ఉన్న సెట్టింగ్స్‌కు వెళ్లి వ్యక్తీకరించిన పాత్రను సృష్టించే అవకాశం ఉంది. అలాగే అదనపు స్టిక్కర్లను జోడించే అవకాశం ఉంది. ఈ ఫీచర్ చాలా రోజుల క్రితమే ప్రకటించినా ఇప్పుడే అందుబాటులోకి వచ్చింది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..

Follow Us
వేకువజామున అమ్మాయిని కూర్చోబెట్టి ఏకాంతంగా.. ఆ తర్వాత.!
వేకువజామున అమ్మాయిని కూర్చోబెట్టి ఏకాంతంగా.. ఆ తర్వాత.!
మీరు SBI క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా? మీకో షాకింగ్‌ న్యూస్‌..
మీరు SBI క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా? మీకో షాకింగ్‌ న్యూస్‌..
ఏపీ వాసులకు గుడ్‌న్యూస్.. రైల్వే జోన్ వచ్చేసిందోచ్..!
ఏపీ వాసులకు గుడ్‌న్యూస్.. రైల్వే జోన్ వచ్చేసిందోచ్..!
ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి వస్తున్న టీచర్..
ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి వస్తున్న టీచర్..
వినియోగదారులకు భారీ షాకింగ్‌ న్యూస్‌.. రూ.993 పెరిగిన సిలిండర్‌
వినియోగదారులకు భారీ షాకింగ్‌ న్యూస్‌.. రూ.993 పెరిగిన సిలిండర్‌
జూన్‌ 15 నాటికే విద్యార్ధులందరికీ కిట్స్ సరఫరా.. సీఎం రేవంత్‌
జూన్‌ 15 నాటికే విద్యార్ధులందరికీ కిట్స్ సరఫరా.. సీఎం రేవంత్‌
రోహిత్, విరాట్‌లకు అంత సీన్ లేదుగా.. అగ్రస్థానంలో ఐదుగురు..!
రోహిత్, విరాట్‌లకు అంత సీన్ లేదుగా.. అగ్రస్థానంలో ఐదుగురు..!
మగువలకు తీపి కబురు.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
మగువలకు తీపి కబురు.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
ఓటీటీలోకి వచ్చిన బైకర్, రాకాస సినిమాలు.. స్ట్రీమింగ్ వివరాలివే
ఓటీటీలోకి వచ్చిన బైకర్, రాకాస సినిమాలు.. స్ట్రీమింగ్ వివరాలివే
మరో 2 రోజుల్లో తెలంగాణ RJC CET 2026 పరీక్ష.. హాల్‌ టికెట్ల లింక్
మరో 2 రోజుల్లో తెలంగాణ RJC CET 2026 పరీక్ష.. హాల్‌ టికెట్ల లింక్