Flipkart Big Saving Days Sale: ఫ్లిప్‌కార్ట్‌లో నయా సేల్ షురూ.. ఆ ఫోన్లపై భారీ తగ్గింపులు
తాజాగా ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్స్‌తో మన ముందుకు వచ్చింది. ముఖ్యంగా ఈ సేల్‌లో యువతను ఆకట్టుకోవడానికి స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు ఆఫర్లను ప్రకటించింది. ప్రత్యేకంగా కొన్ని మోడల్స్ ఫోన్లపై మాత్రం భారీగా తగ్గింపులను అందిస్తుంది.
భారతదేశంలో ఆన్‌లైన్ షాపింగ్ రోజురోజుకూ పెరుగుతుంది. ఆఫ్‌లైన్ సంస్థల కంటే ఆన్‌లైన్ షాపింగ్ సైట్లు అధిక ఆఫర్లు పెడుతుండడంతో వినియోగదారులు ఆన్‌లైన్ షాపింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. అలాగే కొనుగోలు చేయాలనుకునే ఉత్పత్తుల వాడిన వారి రివ్యూలు చూసే అవకాశం ఉండడంతో ఉత్పత్తులకు సంబంధించి లోటుపాట్లు తెలుసుకుని కొనుగోలు చేసుకోవడానికి వీలుగా ఉండడంతో యువత ఎక్కువ ఆన్‌లైన్ షాపింగ్‌ను ఇష్టపడుతున్నారు. అయితే ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేస్తే కేవలం సేల్స్ రిప్రంజేటేటివ్ చెప్పిన మాటలను బట్టే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. టార్గెట్ రీచ్ అవ్వడానికి వారు లేనిపోనివి చెప్పి ఉత్పత్తులను అంటగట్టేస్తారనే అనుమానం మనను వెంటాడుతూ ఉంటుంది. ఆన్‌లైన్ సంస్థలు కూడా ఎప్పటికప్పుడు ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటాయి. తాజాగా ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్స్‌తో మన ముందుకు వచ్చింది. ముఖ్యంగా ఈ సేల్‌లో యువతను ఆకట్టుకోవడానికి స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు ఆఫర్లను ప్రకటించింది. ప్రత్యేకంగా కొన్ని మోడల్స్ ఫోన్లపై మాత్రం భారీగా తగ్గింపులను అందిస్తుంది. ఆ మోడల్స్‌పై ఎలాంటి ఆఫర్లను ప్రకటించిందో ఓ సారి తెలుసుకుందాం.
గూగుల్ పిక్సెల్ 6ఏ
6 జీబీ + 128 జీబీ వేరియంట్‌లో ధర ఈ సేల్‌లో రూ.27,999 నుంచి ప్రారంభం అవుతుంది. చార్కోల్, చాక్ అనే రెండు రంగుల్లో అందుబాటులో ఉండే ఈ ఫోన్ 6.14 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. 12.2 ఎంపీ+12 ఎంపీ బ్యాక్ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరాతో వచ్చే ఈ ఫోన్ 4410 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.
సామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్ 13
సామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్ 13 ఫోన్ బేసిక్ 5 జీ వేరింయంట్‌లో మధ్యతరగతి వారికి కూడా అందుబాటు ధరలో వస్తుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.9699గా ఉంది. 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ స్క్రీన్, ఆక్టాకోర్ ఎక్సినోస్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 12 సపోర్ట్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటివి ఈ ఫోన ప్రత్యేకతలు. ఈ ఫోన్‌లో ముఖ్యంగా 50 ఎంపీ+5 ఎంపీ+ 2 ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. అలాగే 8 ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తుంది.
పోకో ఎక్స్ 5 5 జీ
ఈ స్మార్ట్ ఫోన్ బేస్ ధర రూ.15,999గా ఉంది. స్పెసిఫికేషన్ల విషయం దగ్గరకి వస్తే 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ ఎమోఎల్‌ఈడీ డిస్ ప్లే, స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఎంఐయూఐ 13తో ఆండ్రాయిడ్ 12 సపోర్ట్‌తో ఈ ఫోన్ పని చేస్తుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు 48 ఎంపీ + 8 ఎంపీ + 2 ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. అలాగే 13 ఎంపీ సెల్ఫీ కెమెరా ఈ ఫోన్ ప్రత్యేకత.
ఆపిల్ ఐ ఫోన్ 13
ఆపిల్ ఐఫోన్ 13 స్మార్ట్ ఫోన్ 6.1 అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేతో వస్తుంది. ఏ 15 బయోనిక్ ప్రాసెసర్ 12 ఎంపీ +12 ఎంపీ బ్యాక్ కెమెరాతో పాటు 12 ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.58,999గా ఉంది.
మోటోరోలా జీ 62 5 జీ
మోటోరోలా జీ 62 5 జీ ఫోన్ ఈ సేల్‌లో రూ.15,999కు అందుబాటులో ఉంది. 6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో స్పీడ్‌గా పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 12 సపోర్ట్‌తో పాటు 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. 50 ఎంపీ + 8 ఎంపీ + 2 ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో పాటు 16 ఎంపీ సెల్ఫీ కెమెరాతో ఆకర్షణీయంగా ఉంటుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..