
మీరు స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే.. కచ్చితంగా మోటరోలా తీసుకొచ్చిన ఈ కొత్త మోడల్‌పై ఒక లుక్కు వేయాల్సిందే. కంపెనీ తన కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ Moto G86 పవర్ 5Gని బుధవారం భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. 6,720mAh లాంగ్ లైఫ్ బ్యాటరీ, 50MP Sony LYTIA-600 కెమెరా, MediaTek Dimensity 7400 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఇది బడ్జెట్ 5G విభాగంలో బలమైన ఎంపికగా నిలిచింది.
మోటో G86 పవర్ 5G 8GB RAM, 128GB స్టోరేజ్ కలిగిన సింగిల్ వేరియంట్ ధర రూ.17,999. ఇది కాస్మిక్ స్కై, గోల్డెన్ సైప్రస్, స్పెల్‌బౌండ్‌తో సహా మూడు పాంటోన్-సర్టిఫైడ్ రంగులలో వస్తుంది. ఇది ఆగస్టు 6 నుండి మోటరోలా అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి వస్తుంది. కంపెనీ ఇంకా లాంచ్ ఆఫర్‌లను వెల్లడించలేదు. కానీ డిస్కౌంట్ లేదా బ్యాంక్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లు అయితే ఉండొచ్చు.
ఈ ఫోన్లో బెస్ట్ పార్ట్ అంటే బ్యాటరీ.. 6,720mAh బ్యాటరీతో వస్తోంది. దీనికి 33W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.7-అంగుళాల పూర్తి HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, 4,500 nits గరిష్ట ప్రకాశాన్ని కలిగి ఉంది.
దీనికి గొరిల్లా గ్లాస్ 7i రక్షణ, SGS సర్టిఫికేషన్ కూడా ఉన్నాయి. ఈ పరికరం 4nm MediaTek Dimensity 7400 ప్రాసెసర్‌ను కలిగి ఉంది, ఇది గేమింగ్, మల్టీ టాస్కింగ్ కోసం మంచి పనితీరును అందిస్తుంది. ఈ ఫోన్ IP68, IP69 రేటింగ్‌లు, MIL-STD-810H సర్టిఫికేషన్‌ను పొందింది. ఈ ఫోన్ Wi-Fi 6, బ్లూటూత్ 5.4, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5G కనెక్టివిటీని కలిగి ఉంది. ఈ ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉంది. ఇందులో 50MP సోనీ LYTIA-600 ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ (మాక్రో సపోర్ట్‌తో), 3-ఇన్-1 ఫ్లికర్ సెన్సార్, 32MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి