AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes: డయాబెటిస్ బాధితులకు తీరనున్న కష్టాలు.. ఇకపై ఇంజెక్షన్‌ అవసరం ఉండదు

టైప్‌ 1 డయాబెటిస్‌ బాధితులకు చికిత్స చేయడానికి ప్యాంక్రియాటిక్‌ ఐలెట్ కణాలను అమర్చే విధానం అందుబాటులో ఉంది. ఇది అవసరమైనప్పుడు ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయగలదు. రోగులకు తరచుగా ఇన్సులిన్‌ ఇంజెక్షన్ ఇవ్వడం నుంచి విముక్తి కలిగిస్తుంది. అయితే ఈ విధానంలో ఒక సమస్య.. కణాలను అమర్చిన తర్వాత చివరికి ఆక్సిజన్‌ అయిపోతాయి, దీంతో ఇన్సులిన్‌ ఉత్పత్తి ఆగిపోతుంది. దీనిని అధిగమించడానికే...

Diabetes: డయాబెటిస్ బాధితులకు తీరనున్న కష్టాలు.. ఇకపై ఇంజెక్షన్‌ అవసరం ఉండదు
Diabetes
Narender Vaitla
|

Updated on: Sep 21, 2023 | 8:08 AM

Share

డైప్‌ 1 డయాబెటిస్‌తో బాధపడేవారు ఇన్సులిన్ ఇంజెక్షన్స్‌ ఇచ్చుకుంటారనే విషయం తెలిసిందే. ఇది చాలా ఇబ్బందితో కూడుకున్న ప్రక్రియ. అంతేకాకుండా శరీరానికి కూడా ఎంతో హాని కలుగుతుంది. అయితే దీని నుంచి ఉపశమనం కల్పించేందుకు శాస్త్రవేత్తలు సరికొత్త విధాన్ని తీసుకొస్తున్నార. అమెరికాలోని ప్రముఖ విశ్వవిద్యాలయం మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు రూపొందించిన ఇంప్లాంటబుల్ పరికరంతో ఇంజెక్షన్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది.

టైప్‌ 1 డయాబెటిస్‌ బాధితులకు చికిత్స చేయడానికి ప్యాంక్రియాటిక్‌ ఐలెట్ కణాలను అమర్చే విధానం అందుబాటులో ఉంది. ఇది అవసరమైనప్పుడు ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయగలదు. రోగులకు తరచుగా ఇన్సులిన్‌ ఇంజెక్షన్ ఇవ్వడం నుంచి విముక్తి కలిగిస్తుంది. అయితే ఈ విధానంలో ఒక సమస్య.. కణాలను అమర్చిన తర్వాత చివరికి ఆక్సిజన్‌ అయిపోతాయి, దీంతో ఇన్సులిన్‌ ఉత్పత్తి ఆగిపోతుంది. దీనిని అధిగమించడానికే ఎమ్‌ఐటీ శాస్త్రవేత్తలు కొత్త ఇంప్లాంటబుల్ పరికరాన్ని రూపొందించారు. ఇది అత్యధికంగా ఇన్సులిన్‌ ఉత్పత్తి చేసే ఐలెట్ కణాలను అభివృద్ధి చేయడమే కాకుండా, సొంతంగా ఆక్సిజన్‌ తయారు చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. శరీరంలోని ఉండే నీటి ఆవిరి ద్వారా స్వయంగా ఆక్సిజన్‌ను తయారు చేసుకుటుంది.

డయాబెటిస్‌ ఉన్న ఎలుకల్లో ఈ పరికరాన్ని అమర్చినప్పుడు.. ఎలుకల రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలు కనీసం నెలపాటు స్థిరంగా ఉంచడాన్ని పరిశోధకలు గుర్తించారు. టైప్‌ 1 డయాబెటిస్‌ ఉన్న వారు వారి రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలను జాగ్రత్తగా పర్యవేక్షించాల్సి ఉంటుంది. కనీసం రోజుకు ఒకసారి ఇన్సులిన్‌ ఇంజక్షన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ పక్రియ రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలను నియంత్రించే శరీరం సహజ సామర్థ్యాన్ని మాత్రం ప్రతిబింబించదు. ఈ విషయమై ఎమ్‌ఐటీకి చెందిన శాస్త్రవేత్త అండర్సన్‌ మాట్లాడుతూ.. ‘టైప్‌1 డయాబెటిస్‌ బాధితులు తమకు తాము ఇంజక్షన్‌ తీసుకుంటారు. అయితే వారి రక్తంలో ఆరోగ్యకరంగా చక్కెర స్థాయిలు లేవు’ అని చెప్పుకొచ్చారు.

ఎమ్‌ఐటీ బృందం నీటిని విభజించడం ద్వారా ఆక్సిజన్‌ను నిరంతరం ఉతపత్తి చేయగల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇది ప్రోటాన్‌-ఎక్స్‌ఛేంజ్‌ మెమ్బ్రేన్‌ విధానంలో చేస్తారు. ఈ విధానంలో ఎలాంటి వైర్లు, బ్యాటరీల అవసరం లేదు. నీటి ఆవిరిని విభజించడానికి ఒక చిన్న వోల్టేజ్‌ మాత్రమే అవసరపడుతుంది. రెసొనెంట్ ఇండక్టివ్‌ కప్లింగ్‌ అనే పరికరం ఇందుకు ఉపయోగిస్తారు. ఈ పరికరాన్ని శాస్త్రవేత్తలు ఎలుకల్లో విజయవంతంగా పరీక్షించారు. ఎలుకల చర్మం కింద ఈ చిన్న పరికరాన్ని అమర్చారు.

ఎలుకల్లో ప్రయోగం విజయవంతంకావడంతో ప్రస్తుతం పరిశోధకులు పెద్ద జంతువులతో పాటు భవిష్యత్తులో మనుషుల్లో ఈ పరికరాన్ని పరీక్షించడానికి సిద్ధమవుతున్నారు. చూయింగ్ గమ్‌ పరిమాణంలో ఉండే ఈ ఇంప్లాంట్‌ను అభివృద్ది చేయాలని చూస్తున్నారు. ఈ పరికరం శరీరంలో ఎక్కువ కాలం ఉంటుందా లేదా అన్న కోణంలోనూ పరీక్షించడానికి పరిశోధకలు ప్లాన్‌ చేస్తున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..