Moto G54 5g: రూ. 15 వేలలో బడ్జెట్ 5జీ స్మార్ట్‌ ఫోన్‌.. ధరే తక్కువ, ఫీచర్స్‌ మాత్రం..

మోటో జీ54 5జీ స్మార్ట్ ఫోన్‌లో డిస్‌ప్లేకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. డైనమిక్‌ 120 హెర్ట్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌ డిస్‌ప్లే ఈ స్మార్ట్‌ ఫోన్‌ ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ ఆక్టా కోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7020 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌తో ఈ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్‌ చేశారు. బ్యాటరీకి కూడా ఈ ఫోన్‌ను అధిక ప్రాధాన్యత ఇచ్చారు. 6000 ఎంఏహెచ్‌ వంటి పవర్‌...

Moto G54 5g: రూ. 15 వేలలో బడ్జెట్ 5జీ స్మార్ట్‌ ఫోన్‌.. ధరే తక్కువ, ఫీచర్స్‌ మాత్రం..
Moto G54 5g
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 21, 2023 | 8:48 AM

భారత్‌లో 5జీ నెట్‌వర్క్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత రోజుకో కొత్త ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. కంపెనీల మధ్య ఉన్న పోటీ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్‌ ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. 5జీ నెట్‌వర్క్‌ లాంచ్‌ సమయంలో వచ్చిన స్మార్ట్ ఫోన్‌ ధరలు కనీసం రూ. 50 వేలు పలికాయి. అయితే కాలక్రమేణా 5జీ హ్యాండ్‌ సెట్‌ ధరలు భారీగా తగ్గుముఖం పడుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం మోటోరోలా బడ్జెట్ 5జీ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మోటో జీ54 పేరుతో తీసుకొచ్చిన ఈ 5జీ స్మార్ట్ ఫోన్‌ను తక్కువ బడ్జెట్‌లోనే యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

మోటో జీ54 5జీ స్మార్ట్ ఫోన్‌లో డిస్‌ప్లేకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. డైనమిక్‌ 120 హెర్ట్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌ డిస్‌ప్లే ఈ స్మార్ట్‌ ఫోన్‌ ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ ఆక్టా కోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7020 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌తో ఈ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్‌ చేశారు. బ్యాటరీకి కూడా ఈ ఫోన్‌ను అధిక ప్రాధాన్యత ఇచ్చారు. 6000 ఎంఏహెచ్‌ వంటి పవర్‌ ఫుల్‌ బ్యాటరీ ఈ ఫోన్‌ సొంతం. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 6.5 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 20:9 యాస్పెక్ట్ రేషియోతో స్క్రీన్‌ను అందించారు.

ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో స్టోరేజ్‌ కెపాసిటీని 1జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు కల్పించారు. 33 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఈ ఫోన్‌ సొంతం. కెమెరాకు సైతం ఈ స్మార్ట్ ఫోన్‌లో అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. క్వాడ్ పిక్సెల్‌ టెక్నాలజీ ఈ కెమెరా సొంతం. ఇక సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఇక ఇందులో ఐపీ 52 రేటింగ్‌, వాటర్‌ ప్రొటెక్షన్‌ను ఇచ్చారు. మోటో జీ54లో డ్యూయల్‌ స్టీరియో స్పీకర్లు, డాల్బీఎట్మోస్‌ టెక్నాలజీని అందించారు.

Moto

ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ ధర విషయానికొస్తే.. 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ స్మార్ట్‌ ఫోన్‌ ధర రూ. 15,999గా ఉంది. అలాగే 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 18,999గా ఉంది. ప్రముఖ ఈ కామర్స్‌ సైట్‌ ఫ్లిప్‌ కార్ట్‌లో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్‌ మిడ్ నైట్‌ బ్లూ, మింట్‌ గ్రీన్‌, పియర్‌ బ్లూ కలర్స్‌లో అందుబాటులో ఉంది. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే రూ. 1500 ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్ పొందొచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..