Mini Projector: కేవలం రూ. 8 వేలతో ఇంటిని థియేటర్‌గా మార్చేయొచ్చు..

|

Jun 08, 2024 | 7:17 PM

ఇంట్లో ఓ గదిని థియేటర్‌లాగా మార్చేసుకుంటున్నారు. ఇందుకోసం ప్రొజెక్టర్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే ప్రొజెక్టర్‌ అనగానే సాధారణంగా ఎక్కువ ధర ఉంటుందని అందరూ భావిస్తుంటారు. అయితే ప్రస్తుతం తక్కువ ధరకే ప్రొజెక్టర్లు లభిస్తున్నాయి. తక్కువ ధరలో అందుబాటులో ఉన్న ప్రొజెక్టర్లలో పోర్ట్రోనిక్స్‌ బీమ్‌ 440 స్మార్ట్‌ ఎల్‌ఈడీ ప్రొజెక్టర్‌ ఒకటి...

Mini Projector: కేవలం రూ. 8 వేలతో ఇంటిని థియేటర్‌గా మార్చేయొచ్చు..
Mini Projector
Follow us on

ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తోంది. ఇంటర్నెట్ వినియోగం పెరగడం, తక్కువ ధరకే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ అందుబాటులోకి రావడంతో చాలా మంది ఇంట్లోనే సినిమాలను చూస్తున్నారు. దీంతో పెద్ద పెద్ద స్క్రీన్‌లతో కూడిన టీవీలకు డిమాండ్ పెరిగింది. ఇంట్లోనే థియేటర్‌ సెటప్‌ చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే వీటితో పాటు మిని థియేటర్లను ఏర్పాటు చేసుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది.

ఇంట్లో ఓ గదిని థియేటర్‌లాగా మార్చేసుకుంటున్నారు. ఇందుకోసం ప్రొజెక్టర్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే ప్రొజెక్టర్‌ అనగానే సాధారణంగా ఎక్కువ ధర ఉంటుందని అందరూ భావిస్తుంటారు. అయితే ప్రస్తుతం తక్కువ ధరకే ప్రొజెక్టర్లు లభిస్తున్నాయి. తక్కువ ధరలో అందుబాటులో ఉన్న ప్రొజెక్టర్లలో పోర్ట్రోనిక్స్‌ బీమ్‌ 440 స్మార్ట్‌ ఎల్‌ఈడీ ప్రొజెక్టర్‌ ఒకటి. ఈ ప్రొజెక్టర్‌ కేవలం రూ. 7999కి అందుబాటులో ఉంది. ఇంతకి ఈ ప్రొజెక్టర్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ ప్రొజెక్టర్‌ను తక్కువ బరుతో డిజైన్‌ చేశారు. కేవలం 1.2 కిలోల బరువు మాత్రమే ఉంటుంది. దీంతో ప్రొజెక్టర్‌ను ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. ఇక ఈ ప్రొజెక్టర్‌లో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్ వంటి ప్రముఖ స్ట్రీమింగ్ యాప్‌లు డీఫాల్ట్‌గా ఇన్‌స్టాల్ అయి ఉంటాయి. దీంతో వైఫైకి కనెక్ట్‌ చేసుకొని మీకు నచ్చిన కంటెంట్‌ను పెద్ద స్క్రీన్‌పై చూడొచ్చు. అంతేకాకుండా స్క్రీన్‌ మిర్రరింగ్ ఫీచర్‌ ద్వారా మీ స్మార్ట్ ఫోన్‌ లేదా ల్యాప్‌టాప్‌తో సైతం కంటెంట్‌ను వీక్షించవచ్చు.

ఇక ఈ ప్రొజెక్టర్‌లో 720పీ రిజల్యూషన్‌ వీడియో ప్లే అవుతుంది. ఇది కాస్త తక్కువేనని చెప్పాలి. 4కేవ వంటి క్లారిటీ ఇందులో ఆశించలేము. ఇక ఇందులో ఇన్‌బిల్ట్‌గా 3 వాట్స్‌ స్పీకర్‌ను సైతం అందించారు. సినిమాలు చూడాలనుకునే వారు ఎక్ట్రనల్‌ స్పీకర్లను ఉపయోగించడం ఉత్తమం. తక్కువ ధరలో మంచి ఫీచర్ల కోసం వెతుకుతున్న వారికి ఈ మినీ ప్రొజెక్టర్‌ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..