
వినాయక చవితి, దసరా, దీపావళి వరుస నెలల్లో వస్తాయి. అన్ని పెద్ద పండుగలు కావడంతో మార్కెట్ కి జోష్ వస్తుంది. దానిని అందిపుచ్చుకునేందుకు అన్ని వస్తువులు, గ్యాడ్జెట్లపై కంపెనీలు పలు ఆఫర్లను అందిస్తాయి. డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ లు, ఎక్స్ చేంజ్ మేళాలు నిర్వహిస్తాయి. ఆ సమయం వరకూ అందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తారు. ఇప్పటికే ఆన్ లైన్ మార్కెట్ దిగ్గజాలు ఫ్లిప్ కార్ట్, అమెజాన్ పండుగ సీజన్ సేల్స్ ను ప్రకటించాయి. ఇదే క్రమంలో జియోమీ కూడా ఓ కొత్త సేల్ తో ముందుకొచ్చింది. దివాలి విత్ ఎంఐ సేల్ 2023 పేరిట ఆన్ లైన్ లో పలు ఆఫర్లను ప్రకటించింది. స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్ల వంటి ఇతర డివైజ్ లలో కూపన్ డిస్కౌంట్లు అందించనుంది. అయితే దీనికి సంబంధించిన షెడ్యూల్ ఇంకా రాలేదు. అయితే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023, ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2023 జరిగే సమయంలోనే ఇది కూడా ఉండే అవకాశం ఉంది. ఏదిఏమైనా దివాలి విత్ ఎంఐ సేల్ అక్టోబర్ మొదటి అర్థ భాగంలోనే ఉంటుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దివాలి సేల్ లో ఉండే ఆఫర్లు, డిస్కౌంట్ల గురించి తెలుసుకుందాం..
జియోమీ ఇంకా దివాలి విత్ ఎంఐ సేల్ 2023 తేదీలను ప్రకటించలేదు. అయితే ఈ సేల్లో జియోమీకి చెందిన పలు స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై ఆఫర్లు ఉండనున్నాయి. ముఖ్యంగా రెడ్ మీ నోట్ 13 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు, రెడ్ మీ ప్యాడ్ ఎస్ఈ వంటి ట్యాబ్లెట్‌లు దివాలి విత్ ఎంఐ 2023 సేల్‌లో తగ్గింపు ధరలకు లభించే అవకాశం ఉంది. ఈమేరకు కంపెనీకి చెందిన అధికారిక సోషల్ మీడియా పేజీలో ఓ టీజర్ ను విడుదల చేసింది. దీనిలో 5జీ రెడీ స్మార్ట్‌ఫోన్‌లపై స్మార్ట్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా అందిస్తున్నట్లు ప్రకటించింది. కొనుగోలుదారులు గేమ్ లాంజ్ ద్వారా రివార్డ్‌లను గెలుచుకోవడంతో పాటు ప్రతిరోజూ కొత్త సర్ ప్రైజ్ లను కూడా అన్‌లాక్ చేయవచ్చు. ఈ దివాలి విత్ ఎంఐ సేల్‌లో పాల్గొనడానికి స్నేహితులు, కుటుంబ సభ్యులను భాగస్వామ్యం చేయడానికి, ఆహ్వానించడానికి కొనుగోలుదారులకు కంపెనీ ఫ్రీబీలను కూడా అందిస్తుంది.
దివాలి విత్ ఎంఐ సేల్ 2023లో ఏయే ఉత్పత్తులు ఆఫర్లపై విక్రయించనుందో జియోమీ అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇటీవల మార్కెట్లోకి వచ్చిన రెడ్ మీ 13 సిరీస్ ఫోన్లు అయిన రెడ్‌మీ నోట్ 13 ప్రో, రెడ్‌మీ నోట్ 13 ప్రో+ , బేస్ మోడల్, రెడ్‌మీ ఎ2+ , రెడ్‌మీ కె60, అల్ట్రా, రెడ్‌మీ నోట్ 12 ప్రో 5జీ, రెడ్‌మీ 12 5జీ వంటి స్మార్ట్ ఫోన్లపై పండుగ తగ్గింపులు ఉండే అవకాశం ఉంది. వీటితో పటు ఇటీవల ప్రారంభించిన కొన్ని ఎంఐ ఉత్పత్తులు కూడా అమ్మకానికి వెళ్ళవచ్చు. స్మార్ట్‌ఫోన్‌ల నుంచి గృహోపకరణాలు, స్మార్ట్‌వాచ్‌లు, టీవీ స్టిక్‌ల వరకు సేల్ లో కనిపించే అవకాశం ఉంది. జియోమీ ఈ సంవత్సరం దీవాలి విత్ ఎంఐ ఎడిషన్‌లో చాలా గ్యాడ్జెట్‌లపై గొప్ప తగ్గింపులను అందజేస్తుందని భావిస్తున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..