AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెట్రో న్యూ రికార్డు

హైదరాబాద్‌ మెట్రోరైలు సరికొత్త రికార్డు నెలకొల్పింది. మెట్రో రైలులో ఒక్కరోజులో ప్రయాణించే వారి సంఖ్య 3 లక్షలకు దాటింది. గురువారం ఒక్కరోజే 3 లక్షల 6వేల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చినట్లు హైదరాబాద్‌ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. త్వరలోనే హైటెక్‌ సిటీ నుంచి రాయదుర్గం స్టేషన్‌ వరకు మెట్రో సేవలను అందుబాటులోకి రానున్నాయి. సేఫ్టీ క్లియరెన్స్‌ వచ్చిన తర్వాత అమీర్‌పేట-హైటెక్‌ సిటీ మార్గంలో 5 నిమిషాలకు ఒక మెట్రో రైలును నడుపుతామని […]

మెట్రో న్యూ రికార్డు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 16, 2019 | 7:38 AM

Share

హైదరాబాద్‌ మెట్రోరైలు సరికొత్త రికార్డు నెలకొల్పింది. మెట్రో రైలులో ఒక్కరోజులో ప్రయాణించే వారి సంఖ్య 3 లక్షలకు దాటింది. గురువారం ఒక్కరోజే 3 లక్షల 6వేల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చినట్లు హైదరాబాద్‌ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు.

త్వరలోనే హైటెక్‌ సిటీ నుంచి రాయదుర్గం స్టేషన్‌ వరకు మెట్రో సేవలను అందుబాటులోకి రానున్నాయి. సేఫ్టీ క్లియరెన్స్‌ వచ్చిన తర్వాత అమీర్‌పేట-హైటెక్‌ సిటీ మార్గంలో 5 నిమిషాలకు ఒక మెట్రో రైలును నడుపుతామని ఎండీ తెలిపారు. రద్దీ సమయాల్లో 3 నిమిషాలకు ఒకటి నడిపేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని ఆయన వివరించారు.