Figure 03: గిన్నెలు కడిగి బట్టలు ఉతికే రోబో! ఇంకా ఇది చేసే పనులు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

రోబో అంటే ఏదో పెద్ద పెద్ద కంప్యూటర్ టాస్క్ లకు మాత్రమా పనికొస్తుందనుకుంటారు చాలామంది. అయితే ఇప్పుడు రోజులు మారాయి. రోబోలు ఇంట్లో పనులు చేసేస్తున్నాయి. రీసెంట్ గానే అచ్చం ఇంటి పని కోసం ఒక రోబోను తయారు చేశారు. దాని గురించిన ఇంటరెస్టింగ్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం.

Figure 03: గిన్నెలు కడిగి బట్టలు ఉతికే రోబో! ఇంకా ఇది చేసే పనులు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Latest Ai Figure 03

Updated on: Oct 12, 2025 | 1:06 PM

ఇంట్లో పని మనిషి అవసరం లేకుండా రోబోనే ఇంటి పనులన్నీ చేయగలిగే రోజులు మరెంతో దూరంలో లేవు. కాలిఫోర్నియాకు చెందిన ఫిగర్ ఏఐ అనే సంస్థ రీసెంట్ గా ఫిగర్ 03 అనే రోబోని ఆవిష్కరించింది. ఇది అచ్చంగా రోజువారీ సాధారణ ప్రయోజనాలకు కోసం తయారు చేసిన హ్యూమనాయిడ్ రోబోట్. ఇది ఏమేం పనులు చేస్తుందంటే..

ఇంటి పనులన్నీ..

ఫిగర్ 03 చేయలేని పనంటూ లేదు. ఇది ఇంట్లో మొక్కలకు నీరు పెట్టడం నుంచి గదిని చక్కబెట్టడం, ఫుడ్ అందించడం, గిన్నెలు కడగడం, బట్టలు మడతపెట్టడం ఇలా ఇంటి పనులకు మంచి తోడుగా ఉండగలదు. ఇందులో పరికరాలను గమనించేందుకు మెరుగైన సెన్సరీ సూట్ అలాగే పనలు చేసేందుకు అడ్వాన్స్ డ్ హ్యాండ్ సిస్టమ్ ఉంటాయి. అలాగే ఇందులో హై-ఫ్రీక్వెన్సీ విజువోమోటర్ కంట్రోల్ కోసం రూపొందించబడిన నెక్స్ట్ జనరేష్ విజన్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఇది మనిషి లాగా అన్ని వస్తువులను స్పష్టంగా చూడగలుగుతుంది. ఇల్లు ఇరుకుగా ఉన్నా లేదా ఇంట్లో అంతా చిందరవందరగా ఉన్నా కూడా ఇది ఆ ప్రదేశాన్ని తెలివిగా నావిగేట్ చేసి అనుగుణంగా పని చేస్తుంది.

సెల్ఫ్ అప్‌డేట్‌

ఇక ఈ రోబో చేతుల గురించి చెప్పాలంటే.. ఫిగర్ 03 చాలా మృదువైన చేతులను కలిగి ఉంటుంది. వివిధ ఆకారాలు, పరిమాణాలు ఉన్న వస్తువులను మనుషుల్లాగానే గ్రహించగలుగుతుంది. ఇకపోతే ఈ రోబో మీరు చెప్పింది అర్థం చేసుకుని పని చేస్తుంది. ఇందులో ఉండే ఏఐ మీరు చెప్పేదాని నుంచి నిరంతరం నేర్చుకుంటూ..  తనకు తాను అప్ డేట్ అవుతుంది. ఈ రోబో 5 అడుగుల 8 అంగుళాల ఎత్తు , 61 కిలోల బరువు ఉంటుంది. ఇది వైర్‌లెస్ స్టాండ్‌పై నిలబడటం ద్వారా తనను తాను ఛార్జ్ చేసుకుంటుంది. సింగిల్ ఛార్జ్ పై 5 గంటల వరకు పనిచేస్తుంది. ఇక ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ధర ఎంత? అనే విషయాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇ‍క్కడ క్లిక్‌ చేయండి