AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maruti Baleno Rating: మారుతి సుజుకి బాలేనో భద్రతా ప్రమాణాల్లో ఫెయిల్.. జీరో స్టార్ రేటింగ్!

మారుతి సుజుకి బాలెనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ భద్రతా ప్రమాణాలను చేరుకోలేకపోయింది. ఇంతకు ముందు మారుతి స్విఫ్ట్ కూడా ఇదేరకంగా భద్రతా ప్రమాణాల విషయంలో విఫలం అయింది.

Maruti Baleno Rating: మారుతి సుజుకి బాలేనో భద్రతా ప్రమాణాల్లో ఫెయిల్.. జీరో స్టార్ రేటింగ్!
Mruti Baleno Ncap Rating
KVD Varma
|

Updated on: Oct 30, 2021 | 1:48 PM

Share

Maruti Baleno Rating: మారుతి సుజుకి బాలెనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ భద్రతా ప్రమాణాలను చేరుకోలేకపోయింది. ఇంతకు ముందు మారుతి స్విఫ్ట్ కూడా ఇదేరకంగా భద్రతా ప్రమాణాల విషయంలో విఫలం అయింది. భారతదేశంలో తయారైన మారుతి బాలెనోలో 2 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.

ఎన్‌కాప్(NCAP) క్రాష్ టెస్ట్‌లో ఈ కారు జీరో రేటింగ్‌ను పొందింది. మారుతి స్విఫ్ట్ కూడా 1 నెల క్రితం భద్రత కోసం జీరో రేటింగ్‌ను పొందింది. ఈ విధంగా, 2 నెలల్లో, కంపెనీకి చెందిన బాలెనో కారుతో సహా 2 కార్లు లాటిన్ ఎన్‌కాప్(NCAP) క్రాష్ టెస్ట్‌లో వెనుకబడినట్లు నిరూపణ అయింది. 2015లో దేశంలో మొట్టమొదటి బాలెనో విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 9 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి.

లాటిన్ NCAP రేటింగ్‌లో, బాలెనో అడల్ట్ ఓక్యుపెంట్ సేఫ్టీలో 20.03%, పిల్లల ఆక్యుపెంట్ సేఫ్టీలో 17.06%, పాదచారుల భద్రతలో 64.06%, సేఫ్టీ అసిస్ట్ బాక్స్‌లో 6.98% స్కోర్ చేసింది. ఫ్రంటల్ ఇంపాక్ట్ టెస్ట్‌లో బాలెనో స్థిరంగా ఉండగా, సైడ్ ఇంపాక్ట్ టెస్ట్ సమయంలో పెద్దవారి ఛాతీ భద్రత వెనుకబడి ఉందని నిరూపితమైంది. పేలవమైన సైడ్ సేఫ్టీ, మార్జినల్ విప్లాష్ ప్రొటెక్షన్, స్టాండర్డ్ సైడ్ బాడీ, హెడ్ సేఫ్టీ కోసం ఎయిర్‌బ్యాగ్ లేకపోవడం, స్టాండర్డ్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) చైల్డ్ రెస్ట్రెయింట్ లేకపోవడం వల్ల NCAPకి హెడ్ సేఫ్టీ కోసం ఎయిర్‌బ్యాగ్ లభించకపోవడం వంటి కారణాలతో ఈ కారుకు జీరో స్టార్ రేటింగ్ లభించింది.

9 వేరియంట్లలో అందుబాటులో ఉన్న బాలెనో మారుతి

బాలెనో దేశంలో 9 వేరియంట్లలో అందుబాటులో ఉంది. బాలెనో ధర రూ. 5.97 లక్షలు (ఎక్స్-షోరూమ్), టాప్-స్పెక్ ట్రిమ్ రూ. 9.33 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద ప్రారంభమవుతుంది. ఈ ఆల్-ట్రిమ్స్ వేరియంట్ డ్రైవర్, ఫ్రంట్ ప్యాసింజర్ కోసం రెండు ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తుంది.

బాలెనో కార్ల విక్రయాలు ఆగస్ట్‌లో అత్యధికంగా ఉన్నాయి

గత మూడు నెలల్లో బాలెనో అమ్మకాల పరంగా, జూలైలో బాలెనో అమ్మకాల పరంగా 14,729 కార్ల విక్రయాలతో వేగాన్ ఆర్ , స్విఫ్ట్ తర్వాత టాప్ 3లో ఉంది. ఆగస్టులో బాలెనో అత్యధికంగా 15,646 కార్లను విక్రయించింది. అదే సమయంలో సెప్టెంబర్‌లో 8,077 కార్లను విక్రయించి 6వ స్థానానికి చేరుకుంది.

ఇవి కూడా చదవండి: Solar Flare: సూర్యునిలో పేలుడు.. సౌర తుపానుగా భూమిపైకి.. కమ్యూనికేషన్లపై కనిపించనున్న ఎఫెక్ట్!

Microsoft: ఆపిల్‌ను వెనక్కి నెట్టేసిన మైక్రోసాఫ్ట్.. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీ!

By Polls 2021: దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో 29 అసెంబ్లీ.. 3 లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు ఈరోజే..