Gas Cylinder: మీ గ్యాస్‌ సిలిండర్‌ ఎక్కువ రోజులు రావాలంటే ఏం చేయాలి? అద్భుతమైన ట్రిక్‌!

Gas Cylinder: వంట చేసే ముందు వంట పాత్రలు బర్నర్‌పై ఉంచేటప్పుడు ఆ పాత్రలు పొడిగా ఉండాలి. తడిగా ఉంటే ఆవిరి కావడానికి సమయం పట్టే అవకాశం ఉంది. దీని వల్ల కొంత గ్యాస్‌ వెస్ట్‌ అవుతుంది. చిన్ననీటి బిందువులను కలిగి..

Gas Cylinder: మీ గ్యాస్‌ సిలిండర్‌ ఎక్కువ రోజులు రావాలంటే ఏం చేయాలి? అద్భుతమైన ట్రిక్‌!

Updated on: Nov 23, 2025 | 8:00 AM

Gas Cylinder: గ్యాస్‌ సిలిండర్‌ అనేది ఈరోజుల్లో ప్రతి ఒక్కరు వాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి వంట గ్యాస్‌ సిలిండర్‌ ఉండాలని, కట్టెల పొయ్యిపై వండకూడదనే ఉద్దేశంతో ఉజ్వల స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ప్రస్తుతం దేశంలో అందరి ఇళ్లలో గ్యాస్‌ సిలిండర్‌లే ఉన్నాయి. అయితే గ్యాస్‌ సిలిండర్‌ను ఇష్టానుసారంగా వాడితే గ్యాస్‌ త్వరగా అయిపోయే అవకాశం ఉంది. కొన్ని ట్రిక్స్‌ పాటిస్తే గ్యాస్‌ను ఎక్కువ రోజులు వచ్చేలా చేసుకోవచ్చు. అదేలాగో చూద్దాం.

బర్నర్‌:

చాలా మంది వంట చేసేటప్పుడు బర్నర్‌ను మొత్తం పైకి తిప్పే అలవాటు ఉంటుంది. దీని వల్ల మీ ఎల్పీజీ గ్యాస్ త్వ‌ర‌గా అయిపోయే అవ‌కాశం ఉంటుంది. అందుకే మీరు ఏదైనా వేడి చేయాల‌నుకున్నా, వంట చేయాల‌నుకున్నా పాత్ర కింది భాగంలో మంట ఉండేలా బ‌ర్న‌ర్ ను తిప్పుకుంటే స‌రిపోతుంది. దీని వ‌ల్ల ఎల్పీజీ సిలిండ‌ర్ ఎక్కువ రోజులు రావడంతో పాటు మీ వంట‌గ‌దిలో మ‌రింత వేడి లేకుండా ఉంటుందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు.

స్టవ్‌ బర్నర్‌ శుభ్రం ఉంచుకోవడం:

అలాగే మీ స్టవ్ బర్నర్‌ను శుభ్రంగా ఉంచుకోవ‌డం కూడా ముఖ్యమే. ఎప్పటికప్పుడు బర్నర్‌ను శుభ్రం ఉంచుకోవడం వల్ల కూడా గ్యాస్‌ ఎక్కువ రోజులు వచ్చే అవకాశం ఉంది. ఇందు కోసం మీ గ్యాస్‌ మంట రంగును గమనిస్తే తెలిసిపోతుంది. గ్యాస్‌ మంట నీలం రంగు వచ్చినట్లయితే మీ బ‌ర్న‌ర్ స‌రిగ్గా ఉంద‌ని అర్థం. అలా కాకుండా ఎరుపు/పసుపు/నారింజ రంగు మంట వ‌స్తే మీ బ‌ర్న‌ర్ శుభ్రంగా లేద‌ని అర్థం చేసుకోవాలి. అంటే గ్యాస్ పూర్తిగా ఉపయోగించడం వల్ల మంట అలా నీలం రంగు కాకుండా వ‌స్తుంది. గోరువెచ్చని నీరు, స్క్రబ్ బ్రష్ ఉపయోగించి బర్నర్‌ను శుభ్రం చేసుకోవాలి. అయినా కూడా అలాగే ఉంటే రిపేరు చేయించడం మంచిది.

ఇవి కూడా చదవండి

ఎక్కువ నీరు:

చాలా మంది వంట చేసేటప్పుడు నీరు లేదా పదార్థాల పరిమాణాన్ని కొలవరు. నీరు ఎక్కువ‌గా ఉంటే అది ఆవిరి అయ్యే వ‌ర‌కు వంట‌గ్యాస్ వినియోగించాల్సి వస్తుంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే గ్యాస్‌ ఎక్కువ రోజుల వ‌చ్చేలా చేసుకోవచ్చు.

పాత్రలు తడిగా ఉంచడం:

వంట చేసే ముందు వంట పాత్రలు బర్నర్‌పై ఉంచేటప్పుడు ఆ పాత్రలు పొడిగా ఉండాలి. తడిగా ఉంటే ఆవిరి కావడానికి సమయం పట్టే అవకాశం ఉంది. దీని వల్ల కొంత గ్యాస్‌ వెస్ట్‌ అవుతుంది. చిన్ననీటి బిందువులను కలిగి ఉన్న పాత్రలు నీటిని ఆవిరి చేయడానికి ఎక్కువ గ్యాస్ వినియోగించాల్సి వ‌స్తుంది. పాన్ వేడెక్కిన తర్వాత మీరు మంటను తగ్గించి కూడా గ్యాస్‌ను ఆదా చేసుకోవచ్చు. అధిక మంట పెట్టడం వల్ల కూడా గ్యాస్‌ ఎక్కువా తీసుకుంటుంది.

ఇది కూడా చదవండి: Instant Electric Water Heater: గీజర్ లేకుండా కుళాయి నుండి వేడి నీరు.. ధర కేవలం రూ.1249కే!

ఇది కూడా చదవండి: Sankranti Holidays 2026: ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఎప్పటి నుంచో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి