AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lumpy skin vaccine: లంపీ స్కిన్‌ వ్యాధికి టీకా.. ప్రపంచంలోనే తొలిసారిగా తయారైంది ఎక్కడంటే..

బయోవెట్ వ్యవస్థాపకుడు డాక్టర్ కృష్ణ ఎల్లా మాట్లాడుతూ, మూడు నెలల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పశువులకు సంవత్సరానికి ఒకసారి ఈ వ్యాక్సిన్ వేయాలని చెప్పారు. పశుసంపద అభివృద్ధి, ఆరోగ్యానికి సంబంధించి ముఖ్యమైన ముందడుగని పేర్కొన్నారు. ఈ టీకాను పాడి పశువులకు వేయిస్తే, ఎల్‌ఎస్‌డీ వ్యాధి తీవ్రత తగ్గుముఖం పట్టి, పాల ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంటుందని బయోవెట్‌ వర్గాలు వివరించాయి.

Lumpy skin vaccine: లంపీ స్కిన్‌ వ్యాధికి టీకా.. ప్రపంచంలోనే తొలిసారిగా తయారైంది ఎక్కడంటే..
Lumpy Skin Vaccine
Jyothi Gadda
|

Updated on: Feb 11, 2025 | 12:44 PM

Share

లంపి వైరస్ ఇన్ఫెక్షన్ నుండి పశువులను రక్షించడానికి భారతదేశం ప్రపంచంలోనే మొట్టమొదటి దివా మార్కర్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. దీనికి సంబంధించిన లైసెన్స్‌ను సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) ఇటీవల ఆమోదించింది. బయోవెట్ అని పిలువబడే ఈ వ్యాక్సిన్‌ను హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సహకారంతో అభివృద్ధి చేసింది. పాడి పశువులకు వచ్చే లంపీ స్కిన్ వ్యాధి నుంచి రక్షించడానికి ఈ టీకా ఇస్తారు. ఎల్‌ఎస్‌డీ వ్యాధితో గత రెండు సంవత్సరాల్లో సుమారు 2 లక్షల పశువులు మృతి చెందాయి. దీంతో భారత్ బయెటెక్ సంస్థ ఈ టీకాను కనిపెట్టింది. ‘బయోలంపివ్యాక్సిన్‌’ అనే ఈ టీకా మన దేశంలోనే మొదటిది.

ఈ లంపీ చర్మ వ్యాధి పోక్స్విరిడే కుటుంబానికి చెందిన వైరస్ వల్ల పశువులకు సంక్రమించే అంటు వ్యాధి. దీనిని నీత్లింగ్ వైరస్ అని కూడా అంటారు. దీనివల్ల చర్మంపై ఒక ముద్ద ఏర్పడుతుంది. ఈ వైరస్‌ బారిన పడ్డ పశువులు జ్వరం, శోషరస గ్రంథులు వాపు, పాల ఉత్పత్తి తగ్గడం, కదలడంలో ఇబ్బందితో బాధపడుతుంటాయి. ఈ వైరస్ దోమలు, కీటకాలు, ఇతర కుట్టే కీటకాల ద్వారా వ్యాపిస్తుంది.

ఇవి కూడా చదవండి

బయోవెట్ వ్యవస్థాపకుడు డాక్టర్ కృష్ణ ఎల్లా మాట్లాడుతూ, మూడు నెలల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పశువులకు సంవత్సరానికి ఒకసారి ఈ వ్యాక్సిన్ వేయాలని చెప్పారు. ఇది మనదేశంలో పశుసంపద అభివృద్ధి, ఆరోగ్యానికి సంబంధించి ముఖ్యమైన ముందడుగని పేర్కొన్నారు. ఇకపై ఈ టీకా కోసం దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదన్నారు. ఈ టీకాను పాడి పశువులకు వేయిస్తే, ఎల్‌ఎస్‌డీ వ్యాధి తీవ్రత తగ్గుముఖం పట్టి, పాల ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంటుందని బయోవెట్‌ వర్గాలు వివరించాయి.

తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
మేడారం జాతరలో టాలీవుడ్ హీరోయిన్..
మేడారం జాతరలో టాలీవుడ్ హీరోయిన్..
తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన ఓ ప్రజాపతి..స్కానింగ్‌
తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన ఓ ప్రజాపతి..స్కానింగ్‌
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
vasant panchami: ఇంట్లో సరస్వతి దేవిని ఎలా పూజించాలో తెలుసా?
vasant panchami: ఇంట్లో సరస్వతి దేవిని ఎలా పూజించాలో తెలుసా?
తగ్గేదేలేదు.. స్టార్ హీరోల మధ్య టఫ్ ఫైట్.. రికార్డ్స్ సెట్ చేస్తు
తగ్గేదేలేదు.. స్టార్ హీరోల మధ్య టఫ్ ఫైట్.. రికార్డ్స్ సెట్ చేస్తు
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం