రైడర్లకు గుడ్‌న్యూస్.. లాంగ్ రైడ్స్ కోసం కొత్త బైక్ తెచ్చేసిన కవాసాకి.. సేఫ్టీ ఫీచర్లు ఇవే
లాంగ్ డిస్టెన్స్ రైడింగ్‌ను ఇష్టపడే బైక్ ప్రియుల కోసం Kawasaki కొత్త అడ్వెంచర్ టూరర్ మోడళ్లను పరిచయం చేసింది. Versys 900, Versys 900 SE పేర్లతో ఆవిష్కరించిన ఈ బైక్‌లలో 948cc ఇంజిన్, రాడార్ ఆధారిత సేఫ్టీ ఫీచర్లు, ఆధునిక ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి. ఇప్పటికే ఉన్న Versys 650, Versys 1100 మోడళ్ల మధ్య ఇవి స్థానం దక్కించుకోనున్నాయి.

శక్తివంతమైన ఇంజిన్‌తో పాటు రైడర్ భద్రతకు ప్రాధాన్యత ఇచ్చే టూరింగ్ బైక్ కోసం చూస్తున్నవారికి Kawasaki Versys 900 ఆసక్తికరమైన ఎంపికగా నిలవనుంది. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి ఫీచర్లతో వచ్చిన ఈ కొత్త బైక్‌ల ధరలు, స్పెసిఫికేషన్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
948cc ఇంజిన్..
Kawasaki Versys 900, Versys 900 SE బైక్‌లను ఇప్పటికే మార్కెట్లో ఉన్న Z900 ఆధారంగా రూపొందించారు. ఇందులో 948cc ఇన్లైన్-ఫోర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది సుమారు 122–123hp పవర్, 97.3Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొత్త ట్రెల్లిస్ ఫ్రేమ్, USD ఫ్రంట్ ఫోర్క్, వెనుక లింకేజ్ మోనోషాక్ సస్పెన్షన్‌తో రైడింగ్ సమయంలో మెరుగైన నియంత్రణ, స్థిరత్వాన్ని అందించేలా బైక్‌ను రూపొందించారు. దీని సీటు ఎత్తు 825mm కాగా, అవసరాన్ని బట్టి 845mm వరకు పెంచుకునే అవకాశం ఉంది. లాంగ్ రైడ్స్‌లో సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సెటప్‌ను అందించారు.
రాడార్ సేఫ్టీ..
Kawasaki Versys 900లో అడ్వాన్స్డ్ రైడర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ARAS) ప్రధాన ఆకర్షణ. ఫ్రంట్, రియర్ రాడార్ వ్యవస్థల ఆధారంగా పనిచేసే అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ వంటి ఫీచర్లు రైడర్‌కు అదనపు భద్రతను అందిస్తాయి. వీటితో పాటు రైడ్-బై-వైర్, పవర్ మోడ్లు, ట్రాక్షన్ కంట్రోల్, స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్, బైడైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్ ఉన్నాయి. 6-యాక్సిస్ IMU, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన 5-అంగుళాల TFT డిస్ప్లే కూడా లభిస్తుంది.
SE వేరియంట్లో LED ఫాగ్ ల్యాంప్స్, హ్యాండ్ గార్డ్స్, హీటెడ్ గ్రిప్స్, రేడియేటర్ గార్డ్, ఫ్రేమ్ ప్రొటెక్షన్ స్లైడర్లు, లోయర్ కౌల్, సెంటర్ స్టాండ్ వంటి అదనపు పరికరాలు స్టాండర్డ్‌గా ఉంటాయి. స్టాండర్డ్ మోడల్ బ్లాక్, వైట్ రంగుల్లో లభించగా, SE వేరియంట్ లైమ్ గ్రీన్/బ్లాక్, రెడ్/గ్రే రంగుల్లో వస్తుంది.
ధర విషయానికి వస్తే.. యూకేలో Versys 900 ధర GBP 10,899 కాగా, Versys 900 SE ధర GBP 11,799గా ప్రకటించారు. ఇవి భారత కరెన్సీలో సుమారు రూ.13.74 లక్షలు, రూ.14.87 లక్షలు. యూకేలో ఈ బైక్‌ల విక్రయాలు ఏప్రిల్ 2027 నుంచి ప్రారంభం కానున్నాయి. భారత్‌లోకి వీటి రాకపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. 2027లో విడుదలయ్యే అవకాశం ఉందన్నది ప్రస్తుతానికి అంచనా మాత్రమే.
