నేడు ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. అది అందరికీ తప్పనిసరి వస్తువుగా మారింది. ప్రతి రోజూ వివిధ పనులు చేయడానికి చాాలా ఉపయోగంగా ఉంటోంది. గతంలో ఫోన్ అంటే కేవలం మాట్లాడటానికి మాత్రమే వాడేవారు. ఇప్పుడు రోజులు మారాయి. టెక్నాలజీకి అనుగుణంగా ఫోన్లు కొత్తరూపు సంతరించుకున్నాయి. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లతో అనేక లావాదేవీలు నిర్వహించవచ్చు. ఇంతటి ప్రాధాన్యం కలిగిన ఫోన్ ను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా దాని పనితీరు, వేగం తగ్గకుండా ఉండటానికి కొన్ని చిట్కాలు పాటించాలి. మన ఇంట్లో పర్సనల్ కంప్యూటర్లు, ట్యాబ్ ల పనితీరు మందగిస్తే వెంటనే రీఫ్రెష్ చేస్తాం. వాటిని వేగం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. అదే విధంగా స్మార్ట్ ఫోన్ విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. అప్పుడే దాని పనితీరు వేగవంతంగా, మునుపటి కన్నా మెరుగ్గా ఉంటుంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ పనితీరు తగ్గిపోవడానికి గల కారణాలను పరిశీలిద్దాం. దాన్ని మెరుగుపర్చడానికి తీసుకోవాల్సిన చర్యలను తెలుసుకుందాం.
స్మార్ట్ ఫోన్లలో అనవసర యాప్‌లు ఉంటాయి. అవి మనకు ఉపయోగపడవు. పైగా స్పేస్ ను ఆక్రమిస్తాయి. స్మార్ట్‌ఫోన్‌లో ఇలాంటి యాప్ లను తొలగించాలి. దీని వల్ల ఫోన్ పనితీరు మెరుగుపడుతుంది. ఎందుకంటే యాప్‌లు చాలా నిల్వను ఆక్రమిస్తాయి. అవసరమైనవి ఉంటే తప్పనిసరిగా ఉపయోగించాలి.
ఫోన్ పనితీరులో ఎలాంటి మార్పు రాకుండా ఉండాలంటే ముఖ్యంగా దానిలోని యాప్ లు, ఆపరేటింగ్ సిస్టమ్ ను ఎప్పటి కప్పుడు అప్ డేట్ చేసుకోవాలి. తాజా ఆపరేటింగ్ సిస్టమ్‌తో పరికరాన్ని ఉపయోగించడం వల్ల ఫోన్ వేగంగా పని చేస్తుంది. తద్వారా మీ పనులు చాలా సులువుగా జరుగుతాయి.
అనవసర యాప్ లతో పాటు బోట్ వేర్ యాప్ లను కూడా ఫోన్ నుంచి అన్ ఇన్ స్టాల్ చేయాలి. అప్పుడే మీ ఫోన్ పనితీరు వేగంగా ఉంటుంది. ఎందుకంటే ఫోన్ లోని చాలా నిల్వను బోట్ వేర్ ఆక్రమిస్తుంది. ఫోన్ పనితీరుపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. కాబట్టి పనితీరును మెరుగుపర్చుకోవడానికి తప్పనిసరిగా బోట్ వేర్ ను తొలగించాలి.
సాధారణంగా ఫోన్ ను ప్రతి ఒక్కరూ చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు. దీని వల్ల మనకు తెలియకుండానే కాష్ పెరిగిపోతుంది. కాబట్టి రోజుకు ఒక్క ఐదు నిమిషాలు కేటాయించి మీ ఫోన్ లేదా టాబ్లెట్ లోని కాష్ ను ఎప్పటి కప్పుడు తొలగించాలి. దీని వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ముందుగా ఫోన్ పనితీరు మెరుగుపడుతుంది. మల్టీ టాస్కింగ్ సమయంలో ఎటువంటి సమస్య ఉండదు.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి