Infinix Smart TV: రూ. 9,500కే హెచ్‌డీ స్మార్ట్ టీవీ.. ప్రీ లోడెడ్ ఓటీటీ యాప్‌లతో..

ఒకవేళ మీరు 32 అంగుళాల టీవీ కావాలనుకుంటే.. అది కూడా అతి తక్కువ ధర అంటే కేవలం రూ. 10వేల లోపు ధరకే ఓ బెస్ట్ ఇప్పడు అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ టెక్ కంపెనీ ఇన్ఫినిక్స్ 32 అంగుళాల టీవీని మార్కెట్లోకి విడుదల చేసింది. 32వై1 ప్లస్ స్మార్ట్ టీవీ పేరుతో దీనిని లాంచ్ చేసింది. దీనిలో కట్టింగ్ ఎడ్జ్ డిస్ ప్లే ఆడియో టెక్నాలజీ మిళితమై ఉన్నాయి. జూన్ 24 నుంచి ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్లో రూ. 9499కే అందుబాటులో అందుబాటులో ఉండనుంది.

Infinix Smart TV: రూ. 9,500కే హెచ్‌డీ స్మార్ట్ టీవీ.. ప్రీ లోడెడ్ ఓటీటీ యాప్‌లతో..
Infinix 32y1 Plus Smart Tv
Follow us
Madhu

|

Updated on: Jun 05, 2024 | 6:17 PM

ప్రస్తుతం ప్రతి ఇంట్లో స్మార్ట్ టీవీ ఉంటోంది. కొన్ని ఇళ్లల్లో ఒకటికి మించి టీవీలు ఉంటున్నాయి. హాల్లో ఒకటి, బెడ్ రూంలో ఒకటి ఇలా ఉంటున్నాయి. వాస్తవానికి హాల్లో పెద్ద టీవీ ఉన్నా.. బెడ్ రూంలో చిన్న టీవీలను కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. వాటి పరిమాణాలను బట్టి ధరల్లో కూడా వ్యత్యాసం ఉంటోంది. ప్రస్తుతం వస్తున్న స్మార్ట్ ఎల్ఈడీ టీవీలు 32 అంగుళాల నుంచి మొదలై 43, 55, 60 అలా ఉంటున్నాయి. ఒకవేళ మీరు 32 అంగుళాల టీవీ కావాలనుకుంటే.. అది కూడా అతి తక్కువ ధర అంటే కేవలం రూ. 10వేల లోపు ధరకే ఓ బెస్ట్ ఇప్పడు అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ టెక్ కంపెనీ ఇన్ఫినిక్స్ 32 అంగుళాల టీవీని మార్కెట్లోకి విడుదల చేసింది. 32వై1 ప్లస్ స్మార్ట్ టీవీ పేరుతో దీనిని లాంచ్ చేసింది. దీనిలో కట్టింగ్ ఎడ్జ్ డిస్ ప్లే ఆడియో టెక్నాలజీ మిళితమై ఉన్నాయి. జూన్ 24 నుంచి ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్లో రూ. 9499కే అందుబాటులో అందుబాటులో ఉండనుంది. ఈ నేపథ్యంలో ఈ ఇన్ఫినిక్స్ 32వై1 ప్లస్ స్మార్ట్ టీవీ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

డిస్ ప్లే వివరాలు..

ఇన్ఫినిక్స్ 32వై1 ప్లస్ స్మార్ట్ ఎల్ఈడీ హెచ్ డీ రెడీ డిస్ ప్లే ఉంటుంది. 250నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ఉంటుంది. దీని సాయంతో వివిడ్ డిస్ ప్లే, షార్ప్ ఇమేజెస్ అందిస్తుంది. ఇది అందించే కాంట్రాస్ట్ వీక్షకులు ఎలాంటి లైటింగ్ స్థితిలోనైనా స్పష్టమైన, ప్రకాశవంతమైన విజువల్స్‌ను ఆస్వాదించగలగుతారు.

ఆడియో సిస్టమ్..

32వై1 ప్లస్ స్మార్ట్ టీవీ, ఆడియో సిస్టమ్ కూడా ఆకట్టుకుంటుంది. ఇది 16 వాట్ల వరకు ఆడియో అవుట్‌పుట్‌ను అందిస్తుంది. డాల్బీ ఆడియోకు మద్దతు ఇచ్చే స్టీరియో స్పీకర్‌లతో వస్తుంది. ఈ సెటప్ చలనచిత్రాలు, సంగీతం, గేమ్‌లకు అనుకూలమైన ధ్వని వాతావరణాన్ని సృష్టించడంలో సహాయపడుతుంది. వినియోగదారులు తమ ఆడియో అనుభవాన్ని అంకితమైన సౌండ్ మోడ్‌లతో అనుకూలీకరించవచ్చు.

యాప్ సపోర్టు..

టీవీ యూజర్ ఫ్రెండ్లీ రిమోట్ కంట్రోల్‌తో వస్తుంది. ఇది సరళత, వాడుకలో సౌలభ్యం కోసం రూపొందింది. ఇది జియో సినిమా, హాట్‌స్టార్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి ప్రముఖ స్ట్రీమింగ్ యాప్‌లకు త్వరిత యాక్సెస్ కోసం హాట్‌కీలను కలిగి ఉంది.

కనెక్టివిటీ ఇలా..

32వై1 ప్లస్ స్మార్ట్ టీవీలో రెండు హెచ్డీఎంఐ పోర్ట్‌లు, రెండు యూఎస్బీ పోర్ట్‌లు, ల్యాన్ కనెక్షన్, హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఇది హెచ్డీఎంఐ పోర్ట్‌లలో ఒకదానిలో హెచ్డీఎంఐ ఏఆర్సీకి కూడా మద్దతు ఇస్తుంది. వైర్‌లెస్ కనెక్టివిటీ కోసం, ఇది మిరాకాస్ట్‌ను కలిగి ఉంది. వినియోగదారులు తమ పరికరాల నుంచి టీవీ స్క్రీన్‌కు కంటెంట్‌ను సులభంగా భాగస్వామ్యం చేయడానికి అనుమతిస్తుంది. 32వై1 ప్లస్ స్మార్ట్ టీవీలో 4జీబీ మెమరీతో కూడిన క్వాడ్-కోర్ ప్రాసెసర్, మృదువైన, ప్రతిస్పందించే పనితీరును అందిస్తుంది. అలాగే ప్రీ లోడెడ్ యాప్స్ ఉంటాయి. ప్రైమ్ వీడియో, యూట్యూబ్, సోనీలివ్, జీ5, ఎరోస్ నౌ, ఆజ్ తక్, జియో సినిమా , హాట్ స్టార్ వంటివి ఉంటాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..