AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశ ప్రజలకు భారీ ఊరట.. భారత్‌లోకి తొలి డెంగ్యూ వ్యాక్సిన్.. అందుబాటులోకి ఎప్పుడంటే?

దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న డెంగ్యూ వ్యాధికి చెక్‌ పెట్టేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాల్లో మరో ముందడుగు పడింది. జపాన్ డ్రగ్‌మేకర్ టకేడా తయారు చేసిన క్యూడెంగా వ్యాక్సిన్‌ త్వరలోనే అందుబాటులోకి రానుంది. అయితే, ఈ టీకా ఇప్పటికే ఉన్న ప్రజారోగ్య చర్యలకు ప్రత్యామ్నాయం కాదని, వాటికి అదనపు బలంగా మాత్రమే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

దేశ ప్రజలకు భారీ ఊరట.. భారత్‌లోకి తొలి డెంగ్యూ వ్యాక్సిన్.. అందుబాటులోకి ఎప్పుడంటే?
India First Dengue Vaccine
Anand T
|

Updated on: Sep 19, 2026 | 10:00 AM

Share

డెంగ్యూ నివారణపై భారత్ చేస్తున్న పోరులో కీలక అడుగు పడింది. జపాన్ డ్రగ్‌మేకర్ టకేడా తయారు చేసిన ఈ క్యూడెంగా వ్యాక్సిన్‌ను ఇండియాలోని ప్రైవేట్ హెల్త్‌కేర్ మార్కెట్‌లో తీసుకురావడం, పంపిణీ కోసం ఇటీవలే డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ CDSCO సైతం ఆమోదం తెలపడంతో ఇది త్వరలోనే అర్హులైన పిల్లలు, పెద్దలకు అందుబాటులోకి రానుంది.

ఈ వ్యాక్సిన్ ఎప్పుడు మార్కెట్‌లోకి వస్తుంది?

టెకేడా తయారు చేసిన ఈ క్యూడెంగా వ్యాక్సిన్‌కు.. CDSCO నంచి జూలైలోనే అనుమతి రావడంతో.. ఇది 2027 తొలి నాళ్లలో ఇండియన్ మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే.. దీన్ని 4 నుండి 60 సంవత్సరాల వయస్సు గల వారు వాడోచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ వ్యాక్సిన్‌లో ఇండియన్ మార్కెట్‌లోకి తీసుకొచ్చే బాధ్యతలను డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ తీసుకుంది.

మన దేశానికి ఈ వ్యాక్సిన్ ఎందుకు ముఖ్యం!

మన దేశంలో ఈ డెంగ్యూ అనేది రోజురోజుకూ పెరుగుతున్న ప్రధాన సమస్య.. గడిచిన 20 ఏళ్లలో మన దేశంలో డెంగ్యూ కేసుల సంఖ్య దాదాపు 11 రేట్లు పెరిగినట్టు నివేదికలు చెబుతున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యే మొత్తం డెంగ్యూ కేసుల్లో 3/1 శాతం ఇండియాలోనే ఉన్నట్టు స్పష్టమైంది. ఈ పెరుగుదల యావత్ దేశాన్ని తీవ్ర భయాందోళనలోకి నెట్టేసింది. కాబట్టి ఈ పెరుగుదలను నియంత్రించడం.. దీనికి నివారణ చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యమైపోయింది.

క్యూడెంగా అంటే ఏమిటి?.. ఇది ఎలా పనిచేస్తుంది.

NPJ వ్యాక్సిన్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. క్యూడెంగా దీనినే TAK-003 అని కూడా పిలుస్తారు. ఈ వ్యాక్సిన్ డెంగ్యూ వైరస్‌లోని నాలుగు సెరోటైప్‌లైన DENV-1, DENV-2, DENV-3, DENV-4 నుండి రక్షణ కల్పిస్తాయి. ఈ వ్యాక్సిన్‌ను బాధితులకు మూడు నెలల వ్యవధిలో రెండు డోసులుగా ఇస్తారు. ఈ వ్యాక్సిన్ ప్రత్యేక ఏమిటంటే.. ఒక వ్యక్తికి గతంలో డెంగ్యూ వచ్చిందా లేదా అనేది సంబంధం లేకుండా దీన్ని ఇవ్వొచ్చు.. అంటే వ్యాది నిర్ధారణ కోసం ప్రత్యేకంగా టెస్ట్‌లు చేయాల్సిన అవసరం లేదు.. నేరుగా ఇచ్చేయొచ్చు. ఈ వ్యాక్సిన్‌ ఇప్పటికే అనేక ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ప్రీక్వాలిఫికేషన్ పొందింది.

డెంగ్యూ నివారణలో ఈ వ్యాక్సిన్ పాత్ర

ఈ క్యూడెంగా వ్యాక్సిన్ రావడంతో మన దేశంలో డెంగ్యూ నివారణకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. అయితే, ఈ టీకా అనేది ఇప్పటికే ఉన్న ప్రజారోగ్య చర్యలకు అదనపు బలాన్ని ఇస్తుందే తప్ప వాటిని రీప్లేస్ చేయదని.. అధికారులు చెబుతున్నారు. దీనిలో పాటు దోమల నియంత్రణ, దోమలు వృద్ధి చెందే ప్రదేశాలను తగ్గించడం, వ్యాధి పర్యవేక్షణ, ముందస్తు వ్యాధి నిర్ధారణ, సకాలంలో చికిత్స తీసుకోవడం చేస్తేనే.. ఈ మహమ్మారిని నుంచి మనం తప్పించుకోగలం అని చెబుతున్నారు.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
దేశ ప్రజలకు భారీ ఊరట.. భారత్‌లోకి తొలి డెంగ్యూ వ్యాక్సిన్
దేశ ప్రజలకు భారీ ఊరట.. భారత్‌లోకి తొలి డెంగ్యూ వ్యాక్సిన్
13 ఏళ్లుగా ఒక్క విద్యార్థి కోసం రోజూ 5 కి.మీ అడవిలో ట్రెక్కింగ్..
13 ఏళ్లుగా ఒక్క విద్యార్థి కోసం రోజూ 5 కి.మీ అడవిలో ట్రెక్కింగ్..
వాషింగ్ మెషీన్‌లో బట్టలు చిక్కు పడుతున్నాయా? ఈ సింపుల్ హ్యాక్‌తో
వాషింగ్ మెషీన్‌లో బట్టలు చిక్కు పడుతున్నాయా? ఈ సింపుల్ హ్యాక్‌తో
ది ప్యారడైజ్‌లో సమ్మక్క ఎవరు.?
ది ప్యారడైజ్‌లో సమ్మక్క ఎవరు.?
రుతుపవనాల వీడ్కోలు.. పలు రాష్ట్రాలకు తుఫాను, భారీ వర్షాల అలర్ట్!
రుతుపవనాల వీడ్కోలు.. పలు రాష్ట్రాలకు తుఫాను, భారీ వర్షాల అలర్ట్!
ఆసియా గేమ్స్‌కు తుఫాన్ ముప్పు
ఆసియా గేమ్స్‌కు తుఫాన్ ముప్పు
ఇంగ్లిష్ అంటే భయం.. ఇప్పుడేమో Googleలో రూ.3 కోట్ల ప్యాకేజీతో జాబ్
ఇంగ్లిష్ అంటే భయం.. ఇప్పుడేమో Googleలో రూ.3 కోట్ల ప్యాకేజీతో జాబ్
గ్యాస్ కనెక్షన్ అడ్రస్ మార్చుకోవాలా..? ప్రాసెస్ చాలా సింపుల్..
గ్యాస్ కనెక్షన్ అడ్రస్ మార్చుకోవాలా..? ప్రాసెస్ చాలా సింపుల్..
ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉండాలి.. ఎక్కువ ఉంటే ఏమౌతుంది
ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉండాలి.. ఎక్కువ ఉంటే ఏమౌతుంది
రొయ్యల వెనుక ఉన్న నల్లటి నరాన్ని ఎందుకు తొలగించాలి? ఆరోగ్యానికి
రొయ్యల వెనుక ఉన్న నల్లటి నరాన్ని ఎందుకు తొలగించాలి? ఆరోగ్యానికి