Health and Medicine: మలేరియా నివారణ నుంచి కరోనా పై పోరాటం వరకూ ఈ సంవత్సరం వచ్చిన అద్భుత ఆవిష్కరణలు ఏమిటో తెలుసా?

Health and Medicine: మలేరియా నివారణ నుంచి కరోనా పై పోరాటం వరకూ ఈ సంవత్సరం వచ్చిన అద్భుత ఆవిష్కరణలు ఏమిటో తెలుసా?
Health Innovations

ఆరోగ్యం-మెడిసిన్ రంగాలలో 2021 సంవత్సరం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. ప్రపంచంలోని వైద్య విజ్ఞాన చరిత్రలో ఇంతకు ముందెన్నడూ లేని విజయాలు ఈ సంవత్సరంలో సాధ్యం అయ్యాయి.

KVD Varma

|

Dec 05, 2021 | 9:38 PM

Health and Medicine: ఆరోగ్యం-మెడిసిన్ రంగాలలో 2021 సంవత్సరం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. ప్రపంచంలోని వైద్య విజ్ఞాన చరిత్రలో ఇంతకు ముందెన్నడూ లేని విజయాలు ఈ సంవత్సరంలో సాధ్యం అయ్యాయి. ఔషధాల తయారీకి సంబంధించి అత్యధిక పరిశోధనలు, అనుమతులు పొందిన ఈ సంవత్సరం, కోవిడ్-19 మహమ్మారి నుండి మలేరియా వరకు ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షించడానికి టీకాలు అందుబాటులోకి తీసుకువచ్చింది. కొత్త వ్యాక్సిన్‌ల నుండి అల్ట్రా-షార్ప్ CT స్కానర్‌ల వరకు ఈ సంవత్సరం వైద్య ఆరోగ్య రంగం సాధించిన 6 పెద్ద విజయాలు ఇక్కడ ఉన్నాయి..

ఇన్నోవేషన్ ఆఫ్ ది ఇయర్

కోవిడ్-19కి వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో, దేశంలోనే రికార్డు సమయంలో తయారు చేసిన భారత్ బయోటెక్ కోవాక్సిన్, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్ చాలా ప్రభావవంతంగా ఉన్నాయి. ఫైజర్-బయోఎన్‌టెక్, మోడర్నా యొక్క కోవిడ్-19 వ్యాక్సిన్ కలయిక కూడా ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్‌ను నిరోధించడంలో చాలా ప్రభావవంతంగా ఉంది. అన్నీ కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గుర్తింపు పొందాయి.

ఎబోలా దాడిని ఆపడానికి గేమ్‌ఛేంజర్ యాంటీబాడీ షాట్

ఎబోలాతో పోరాడేందుకు అమెరికన్ కంపెనీ రెజెనెరాన్ ఫార్మాస్యూటికల్స్ తయారు చేసిన ఇన్‌మాజెబ్ కూడా ఈ ఏడాది ఆమోదం పొందింది. ఈ మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్సలో అత్యంత ప్రభావవంతమైనదిగా ఇది నిరూపితం అయింది. ఎబోలా కారణంగా, శరీరంలోని సిరల నుండి రక్తం రావడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా అంతర్గత రక్తస్రావం ప్రారంభమవుతుంది.

జన్యు చికిత్స కోసం ఒక పెద్ద అడుగు.. కాలేయాన్ని రక్షించడం ఇక సులభం

జన్యు చికిత్స రంగంలో 2021 సంవత్సరంలో ఒక పెద్ద విజయం దొరికింది. మొదటిసారిగా, ఇంటెల్లియా థెరప్యూటిక్స్, రెజెనెరాన్ ఫార్మాస్యూటికల్స్ పరిశోధకులు ఒక జన్యు సవరణ సాధనాన్ని నేరుగా ఒక వ్యక్తి శరీరంలోకి ఇంజెక్ట్ చేయడం ద్వారా జన్యు కాలేయ వ్యాధికి విజయవంతంగా చికిత్స చేశారు.

మొదటి మలేరియా వ్యాక్సిన్‌గా మస్క్విరిక్స్..

మలేరియాను నివారించడానికి యూకేకి చెందిన గ్లాక్సో స్మిత్‌క్లైన్ అభివృద్ధి చేసిన ‘మస్కిరిక్స్’ వ్యాక్సిన్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ఆమోదించింది. మాస్క్విరిక్స్ అనేది పరాన్నజీవి వల్ల వచ్చే వ్యాధులకు వ్యతిరేకంగా ఉపయోగించబడే మొదటి లైసెన్స్ పొందిన వ్యాక్సిన్.

అరుదైన, ప్రాణాంతక జన్యు వ్యాధికి కొత్త చికిత్స..

అత్యంత అరుదైన హచిన్సన్-గిల్ఫోర్డ్ ప్రొజెరియా సిండ్రోమ్ చికిత్సకు యూఎస్ ఆధారిత ఎగర్ ఫార్మాస్యూటికల్స్ ఔషధం ‘జోక్విన్వి’ ప్రభావవంతంగా ఉంటుంది. ఈ ఔషధం చాలా అరుదైన ఆటోసోమల్ జెనెటిక్ డిజార్డర్ చికిత్సలో ఉపయోగపడుతుంది. దీనిలో చాలా చిన్న వయస్సులో వేగంగా వృద్ధాప్యం లక్షణాలు కనిపిస్తాయి.

కరోనాను నివారించడానికి ఇంటి పరీక్ష కిట్

ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు కరోనా వైరస్‌ను గుర్తించేందుకు హోమ్ టెస్ట్ కిట్‌లను ప్రారంభించాయి. దేశంలో, పూణేకు చెందిన మైలాబ్ డిస్కవరీ సొల్యూషన్ కంపెనీ టెస్టింగ్ కిట్‌ను ఐసీఎంఆర్(ICMR) ఆమోదించింది. ఇది కేవలం స్వీయ-పరీక్ష ద్వారా 15 నిమిషాల్లో కోవిడ్-19 ఫలితాన్ని ఇస్తుంది.

ఇవి కూడా చదవండి: EPF and LIC: మీ పీఎఫ్ ఎకౌంట్ నుంచి ఎల్ఐసీ ప్రీమియం చెల్లించే అవకాశం ఉంది తెలుసా? ఇదెలా సాధ్యమంటే..

Omicron: వామ్మో ఒమిక్రాన్.. ఇది ఎందుకు వేగంగా విస్తరిస్తుందో తెలిసింది..ఇది సాధారణ వేరియంట్ కాదు.. అంతకుమించి!

Vaccination Offer: టీకా వేయించుకోండి.. 50 వేల రూపాయల స్మార్ట్‌ఫోన్ గెలుచుకోండి..అదిరిపోయే ఆఫర్.. వివరాలివే!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu