Social media: ఇకపై ‘ఎక్స్‌’లో లైవ్‌ స్ట్రీమింగ్ ఉచితం కాదు.. మస్క్‌ కీలక నిర్ణయం

'ఎక్స్‌' ఎక్కువగా సినీ, రాజకీయ ప్రముఖులు ఉపయోగిస్తారనే విషయం తెలిసిందే. ఇందులో వీడియోలను లైవ్ స్ట్రీమింగ్ చేస్తుంటారు. అయితే ఇప్పటి వరకు ఈ లైవ్‌ స్ట్రీమింగ్‌లను ఉచితంగా చేసుకునే అవకాశం ఉంది. కాగా త్వరలో ఎక్స్‌లో లైవ్‌ స్ట్రీమింగ్ చేయాలంటే కచ్చితంగా డబ్బులు చెల్లించాల్సిందేనని తెలుస్తోంది. కేవలం ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ ఉన్న వారికి మాత్రమే...

Social media: ఇకపై 'ఎక్స్‌'లో లైవ్‌ స్ట్రీమింగ్ ఉచితం కాదు.. మస్క్‌ కీలక నిర్ణయం
Twitter
Follow us

|

Updated on: Jun 23, 2024 | 7:02 AM

ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌ ట్విట్టర్‌ను ఎలాన్‌ మస్క్ కొనుగోలు చేసిన తర్వాత ఎన్నో మార్పులు చేస్తూ వస్తున్నారు. కొనుగోలు చేసిన కొన్ని రోజులకే ట్విట్టర్‌ పేరును కాస్త ఎక్స్‌గా మార్చిన మస్క్‌ మరిన్ని సంస్కరణలను తెర తీశారు. ఆదాయ మార్గాలను పెంచుకోవడమే లక్ష్యంగా మస్క్ మరో కీలక నిరణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

‘ఎక్స్‌’ ఎక్కువగా సినీ, రాజకీయ ప్రముఖులు ఉపయోగిస్తారనే విషయం తెలిసిందే. ఇందులో వీడియోలను లైవ్ స్ట్రీమింగ్ చేస్తుంటారు. అయితే ఇప్పటి వరకు ఈ లైవ్‌ స్ట్రీమింగ్‌లను ఉచితంగా చేసుకునే అవకాశం ఉంది. కాగా త్వరలో ఎక్స్‌లో లైవ్‌ స్ట్రీమింగ్ చేయాలంటే కచ్చితంగా డబ్బులు చెల్లించాల్సిందేనని తెలుస్తోంది. కేవలం ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ ఉన్న వారికి మాత్రమే లైవ్‌ స్ట్రీమింగ్ చేసే అవకాశం ఇవ్వనున్నట్లు ఎక్స్‌ తన అకౌంట్‌లో అధికారికంగా ప్రకటించింది.

రాబోయే రోజుల్లో కేవలం ప్రీమియం సబ్‌స్క్రైబర్‌లు మాత్రమే ‘ఎక్స్’లో లైవ్ స్ట్రీమ్ (క్రియేట్ లైవ్ వీడియో స్ట్రీమ్‌) చేయగలరు. ఇందులో ఎక్స్ ఇంటిగ్రేషన్‌తో ఎన్‌కోడర్ నుంచి లైవ్ కూడా ఉంటుంది. ఈ లైవ్ కొనసాగించడానికి యూజర్లు ప్రీమియంకు అప్‌గ్రేడ్ అవ్వాల్సిన అవసరం ఉంది. కంపెనీ దీనికి సంబంధించి ఓ ప్రకటన వెల్లడించినప్పటికీ.. ఇది ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందనే విషయాన్ని కంపెనీ ఇంకా అధికారింగా వెల్లడించలేదు. ఇదిలా ప్రస్తుతం ఎక్స్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ ధర రూ. 215 నుంచి మొదలవుతుంది.

ఇదిలా ఉంటే ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు పలు సోషల్‌ మీడియా సైట్స్ ఇప్పటికే లైవ్‌ స్ట్రీమింగ్ ఆప్షన్‌ను అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవేవి ఇందుకోసం ఛార్జీలను వసూలు చేయడం లేదు. మరి తొలిసారి ఎక్స్‌ తీసుకున్న ఈ నిర్ణయంపై నెటిజన్ల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. మరి ఇతర సంస్థలు సైతం ఎక్స్‌ బాటలోనే నడుస్తాయ అన్న సందేహాలు సైతం వస్తున్నాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

అమెరికాలో ఉద్యోగాల కొరత.! ఉద్యోగాలు దొరక్క తెలుగు వారికి కష్టాలు.
అమెరికాలో ఉద్యోగాల కొరత.! ఉద్యోగాలు దొరక్క తెలుగు వారికి కష్టాలు.
సరోగసీ ద్వారా తల్లైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి.. ప్రసూతి సెలవులు.
సరోగసీ ద్వారా తల్లైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి.. ప్రసూతి సెలవులు.
భావప్రకటన స్వేచ్ఛాహక్కును ఈ ఉత్తర్వు చాటిచెప్పింది- NBF
భావప్రకటన స్వేచ్ఛాహక్కును ఈ ఉత్తర్వు చాటిచెప్పింది- NBF
TV9, మరో 3 ఛానెళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలంటూ 15 మంది MSOలకు..
TV9, మరో 3 ఛానెళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలంటూ 15 మంది MSOలకు..
స‌ముద్రంలోకి కార్లతో డ్రైవింగ్.. రీల్స్ పిచ్చితో ఇరుక్కున్న యువ‌త
స‌ముద్రంలోకి కార్లతో డ్రైవింగ్.. రీల్స్ పిచ్చితో ఇరుక్కున్న యువ‌త
పొట్టచుట్టూ కొవ్వు పేరుకుపోయిందా.? ఇలా చేస్తే ఇట్టే కరిగిపోతుంది.
పొట్టచుట్టూ కొవ్వు పేరుకుపోయిందా.? ఇలా చేస్తే ఇట్టే కరిగిపోతుంది.
గాయాలతో బాధపడుతున్నా బాధితుడిని కనికరించని ఇజ్రాయెల్‌ సైన్యం..
గాయాలతో బాధపడుతున్నా బాధితుడిని కనికరించని ఇజ్రాయెల్‌ సైన్యం..
ఖాళీ కడుపుతో ఇది తినండి.. మార్పు మీరే గమనించండి.!
ఖాళీ కడుపుతో ఇది తినండి.. మార్పు మీరే గమనించండి.!
తగ్గనున్న రైల్వే ప్లాట్‌ఫారం టిక్కెట్‌ ధర.. ఆర్థిక మంత్రి ప్రకటన.
తగ్గనున్న రైల్వే ప్లాట్‌ఫారం టిక్కెట్‌ ధర.. ఆర్థిక మంత్రి ప్రకటన.
వర్షాకాలంలో గొడుగు పట్టుకోవడం ఇబ్బందిగా ఉందా.. ఇది మీ కోసమే.!
వర్షాకాలంలో గొడుగు పట్టుకోవడం ఇబ్బందిగా ఉందా.. ఇది మీ కోసమే.!