AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tech Tips: మీ ఫోన్ పోయిందా.. మీ మెయిల్‌కే ఆ దొంగ ఫొటో.. జస్ట్ ఇలా చేస్తే చాలు..

ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ పోతే చాలా కష్టం. ఎందుకంటే మన రోజువారీ పనులు, ముఖ్యమైన వివరాలు, వ్యక్తిగత సమాచారం అంతా ఫోన్‌లోనే ఉంటాయి. అందుకే మొబైల్ చోరీ అయినా దొరకాలంటే కొన్ని సెక్యూరిటీ సెట్టింగ్‌లను ఆన్ చేసుకోవాలి. ఒకవేళ మీ ఫోన్‌ను ఎవరైనా దొంగిలించినా, వారి ఫొటో మీ మెయిల్‌కు వస్తుంది. అది ఎలాగో తెలుసుకుందాం..

Tech Tips: మీ ఫోన్ పోయిందా.. మీ మెయిల్‌కే ఆ దొంగ ఫొటో.. జస్ట్ ఇలా చేస్తే చాలు..
How To Activate Thief Selfie Feature
Krishna S
|

Updated on: Oct 27, 2025 | 2:28 PM

Share

నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్ వాడని వారు ఉండడం చాలా తక్కువ. ఒక్క నిమిషం ఫోన్ లేకపోతే ఏం తోచదు. అయితే ఫోన్ పోయినప్పుడు ఎంతో బాధపడతారు. ముఖ్యంగా IMEI నంబర్ కూడా గుర్తు లేకపోతే పోయిన ఫోన్‌ను తిరిగి పొందడం దాదాపు అసాధ్యం. దొంగలు వెంటనే సిమ్ తీసేయడం లేదా ఫోన్‌ను ఫార్మాట్ చేయడం చేస్తుంటారు కాబట్టి, సాధారణ ట్రాకింగ్ పద్ధతులు కూడా పనిచేయవు. అయితే కొన్ని సెక్యూరిటీ సెట్టింగ్‌లు, యాప్‌లను ముందుగానే ఆన్ చేయడం ద్వారా మీ ఫోన్‌ను దొంగిలించిన వ్యక్తి ఫోటోను మీరే పొందవచ్చు.

యాంటీ-థెఫ్ట్ సెల్ఫీ టెక్నిక్

ఈ టెక్నాలజీ ద్వారా మీ ఫోన్ చోరీ అయితే ఆ ఫోన్ స్వయంగా దొంగ ఫోటో తీసి మీకు పంపుతుంది. దొంగ సిమ్ కార్డు తీసేసినా లేదా ఫోన్‌ను ఫార్మాట్ చేసినా మీకు దొరికిన ఫోటోతో దొంగను పట్టుకోవడం సులభమవుతుంది.

ఈ యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకోండి

మీరు మీ మొబైల్‌లో ఈ అద్భుతమైన ఫీచర్‌ను పొందాలనుకుంటే.. ముందుగా ప్లే స్టోర్ నుండి నమ్మకమైన యాంటీ థెఫ్ట్ యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. వీటిలో ముఖ్యమైనవి..

  • బిట్‌డెఫెండర్
  • ప్రే
  • సెర్బెరస్

సెల్ఫీ ఫీచర్‌ను ఎనేబుల్ చేయడం ఇలా

  • పైన తెలిపిన యాప్‌లలో దేనినైనా డౌన్‌లోడ్ చేసుకుని, దానికి అవసరమైన అన్ని పర్మిషన్స్ ఇవ్వండి
  • ఇన్‌స్టాలేషన్ పూర్తయిన తర్వాత, ఆ యాప్ సెట్టింగ్‌లకు వెళ్లండి.
  • యాంటీ-థెఫ్ట్ సెట్టింగ్‌లలో థీఫ్ సెల్ఫీ అనే ఫీచర్‌ను ఆన్ చేయండి.
  • అవసరమైతే మీకు ఫోటోలు అందేలా మీ మెయిల్‌ ఐడీని అక్కడ నమోదు చేయండి.

ఇది ఎలా పనిచేస్తుంది?

మీరు థీఫ్ సెల్ఫీ ఫీచర్‌ను ఆన్ చేసిన తర్వాత ఎవరైనా మీ ఫోన్‌ను దొంగిలించినా.. తప్పు పాస్‌వర్డ్ నమోదు చేసినా లేదా సిమ్ కార్డును మార్చినా, ఫోన్ వెంటనే సెల్ఫీ కెమెరా ద్వారా దొంగ ఫోటో తీసి, మీరు నమోదు చేసిన మెయిల్ ఐడీకి పంపిస్తుంది. మీరు వేరే ఫోన్‌లో మీ మెయిల్‌ను తెరిచి ఆ ఫోటో వివరాలను పోలీసులకు అందించవచ్చు. అయితే ఈ ఫీచర్ కోసం ఎప్పుడూ ప్లే స్టోర్ నుండి మాత్రమే యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని  టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి