China’s Rocket: నియంత్రణ కోల్పోయిన 19 వేల కిలోల చైనా రాకెట్.. భూమి వైపు వేగంగా దూసుకొస్తున్న శకలాలు.. భారీ ముప్పు తప్పదన్న నిపుణులు!

ఇటీవల చైనా ప్రయోగించి ఓ మ్యాడుల్ నియంత్రణ కోల్పోయి.. భూమి చుట్టూ తిరుగుతున్నట్లు చైనా అంతరిక్ష పరిశోధనా సంస్థ తెలిపింది.

  • Balaraju Goud
  • Publish Date - 7:46 pm, Tue, 4 May 21
China's Rocket: నియంత్రణ కోల్పోయిన 19 వేల కిలోల చైనా రాకెట్.. భూమి వైపు వేగంగా దూసుకొస్తున్న శకలాలు.. భారీ ముప్పు తప్పదన్న నిపుణులు!
China's Rocket

China’s Rocket failure: ఇటీవల చైనా ప్రయోగించి ఓ మ్యాడుల్ నియంత్రణ కోల్పోయి.. భూమి చుట్టూ తిరుగుతున్నట్లు చైనా అంతరిక్ష పరిశోధనా సంస్థ తెలిపింది. అతిపెద్ద రాకెట్ నియంత్రణ కోల్పోయిందని.. అది భూమి చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. రాబోయే కొద్ది రోజుల్లో అది తిరిగి భూమిపై పడిపోయే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది. వాస్తవానికి, ఇది 21 టన్నుల బరువున్న చైనా లాంగ్ మార్చ్ 5 బి రాకెట్. ఇదే ఏ క్షణానైనా సముద్రంలో గానీ, భూమిపై పడే అవకాశాలు ఉన్నాయి.

గత వారం అంతరిక్షంలో సొంత స్పేస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేసేందుకు డ్రాగన్ కంట్రీ చైనా ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా మొదటి మాడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 29 రోజున స్పేస్‌ స్టేషన్‌ను అంతరిక్షంలో నిర్మించడం కోసం ఒక టియాన్హె మ్యాడుల్‌ను స్పేస్‌లోకి పంపింది. 2022 నాటి కల్లా సొంతంగా ఓ స్పేస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో సుమారు ముగ్గురు వ్యోమగాములు ఉండేలా చైనా ప్లాన్‌ చేస్తోంది. తియాన్ గాంగ్ స్పేస్‌ స్టేషన్‌లో భాగంగా 30 మీటర్ల పొడవైన తొలి మ్యాడుల్‌ ‘టియాన్హె’ను చైనా లాంగ్‌ మార్చ్ రాకెటును ఉపయోగించి అంతరిక్షంలోనికి పంపింది.

అయితే, ఈ లాంగ్ మార్చి 5 బి రాకెట్ ప్రధాన దశ నియంత్రణ కోల్పోయి సముద్రంలో సృష్టించబడిన భూమిపై పడవలసి ఉంది. కానీ బదులుగా అది భూమి చుట్టూ ప్రదక్షిణ చేయడం ప్రారంభించింది. దీంతో చైనా అంతరిక్ష పరిశోధనకుల్లో ఆందోళన మొదలైంది. స్పేస్‌న్యూస్ నివేదిక ప్రకారం, రాబోయే రోజుల్లో, రాకెట్ మొదటి భాగం భూమిపై పడవచ్చని తెలిపింది. భూమిపై ఉన్న వస్తువులను ట్రాక్ చేసే ఖగోళ శాస్త్రవేత్త జోనాథన్ మెక్‌డోవాల్ దీనిపై స్పందిస్తూ.. ప్రస్తుత ప్రమాణాన్ని బట్టి అనియంత్రితంగా భూమిలోకి ప్రవేశించడం ఆమోదయోగ్యం కాదని అన్నారు.

చైనా మొట్టమొదటిసారిగా తన సొంత టెక్నాలజీతో అభివృద్ధి చేస్తోన్నస్పేస్‌ స్టేషన్‌లోని మూడు ప్రధాన భాగాలలో టియాన్హె ఒకటి. భూమి నుంచి సుమారు 340 నుంచి 450 కిమీ ఎత్తులో ఒక నిర్ధిష్ట కక్ష్యలో స్పేస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని చైనా భావించింది. కాగా ఇప్పటి వరకు అంతరిక్షంలో నాసా అభివృద్ధి చేసిన ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌ ఒకటే వ్యోమగాములకు నివాస కేంద్రంగా ఉంది. ఈ స్పేస్‌ స్టేషన్‌కు యునైటెడ్ స్టేట్స్, రష్యా, యూరప్, జపాన్ ,కెనడా దేశాల మద్దతుతో నిర్మించారు. కాగా, ఈ స్టేషన్‌లో చైనా పాల్గొనకుండా యునైటెడ్ స్టేట్స్ నిరోధించింది.

చైనా అంతరిక్ష కార్యక్రమాన్ని కవర్ చేసిన స్పేస్‌న్యూస్ జర్నలిస్ట్ ఆండ్రూ జాన్స్ మాట్లాడుతూ.. రాకెట్ ప్రధాన దశ 100 అడుగుల పొడవు, 16 అడుగుల వెడల్పుతో ఉంటుంది. రాకెట్ ప్రధాన దశ కక్ష్య నుండి భూమి వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు, అది కాలిపోయే అవకాశం ఉంది. కానీ, దీని తరువాత కూడా కోర్ స్టేజ్ పెద్ద భాగాలు శిధిలాల రూపంలో నేలమీద పడవచ్చు. భూమికి చుట్టూ ఎక్కువ భాగం సముద్రం ఉంది. సముద్రంలోనే రాకెట్ విడి భాగాలు అక్కడ పడే అవకాశం ఉందని తెలిపారు.

రాకెట్ విడి భాగాలు ఎక్కడ పడతాయని కచ్చితంగా కనుక్కోవడం కష్టమని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంతరిక్ష భద్రత కార్యక్రమం అధిపతి హోల్గర్ క్రాగ్ అన్నారు. కానీ నియంత్రణ కోల్పోయిన రాకెట్ న్యూయార్క్, మాడ్రిడ్, బీజింగ్ లతో పోలిస్తే భూమి చుట్టూ ప్రదక్షిణ చేసే రాకెట్ బాడీ మార్గం కొద్దిగా ఉత్తరాన ఉందని జర్నలిస్ట్ ఆండ్రూ జాన్స్ చెప్పారు. అదనంగా, ఇది దక్షిణ చిలీ, న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్‌కు దక్షిణంగా ఉంది. అటువంటి పరిస్థితిలో, ఇది ఈ పరిధిలో ఎప్పుడైనా పడిపోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.

Read Also…. Covid Treatment: ప్రైవేటు ఆసుపత్రులకు తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు.. వివరాలివే.!