AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పొరపాటున ఇంపార్టెంట్‌ ఫొటోలు డిలీట్ చేశారా? వాటిని ఎలా పొందాలంటే?

అనుకోకుండా ఫోటోలు, వీడియోలు డిలీట్ చేశారా? ఆందోళన వద్దు! అవి వెంటనే శాశ్వతంగా తొలగిపోవు. సరైన చర్యలతో వాటిని తిరిగి పొందవచ్చు. డిలీట్ అయిన వెంటనే కొత్త డేటా రాకుండా చూసుకోండి. ‘రీసెంట్లీ డిలీటెడ్‌’ ఫోల్డర్‌, క్లౌడ్ బ్యాకప్‌లు, రికవరీ సాఫ్ట్‌వేర్ లేదా నిపుణుల సహాయంతో మీ విలువైన ఫైళ్లను సురక్షితంగా వెనక్కి తీసుకురావచ్చు.

పొరపాటున ఇంపార్టెంట్‌ ఫొటోలు డిలీట్ చేశారా? వాటిని ఎలా పొందాలంటే?
Deleted Photos Recovery
SN Pasha
|

Updated on: Mar 29, 2026 | 9:19 AM

Share

పొరపాటున ఫోటోలు లేదా వీడియోలను తొలగించడం అనేది చాలా మందికి ఎదురయ్యే సాధారణ సమస్యగా మారింది. అయితే ఈ ఫైళ్లు శాశ్వతంగా వెంటనే చెరిగిపోవని, సరైన సమయంలో సరైన చర్యలు తీసుకుంటే వాటిని తిరిగి పొందడం సాధ్యమని నిపుణులు చెబుతున్నారు. ఫైల్‌ను డిలీట్ చేసినప్పుడు, అది పూర్తిగా తొలగించబడకుండా, స్టోరేజ్‌లోని స్థలం మాత్రమే ఖాళీగా గుర్తించబడుతుంది. ఈ సమయంలో కొత్త డేటా దానిపై రాసుకుపోయే ముందు చర్యలు తీసుకుంటే రికవరీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

అందుకే ఫైళ్లు డిలీజ్‌ చేసిన వెంటనే కొత్త ఫోటోలు తీయడం, యాప్‌లు ఇన్‌స్టాల్ చేయడం లేదా ఫైళ్లను డౌన్‌లోడ్ చేయడం వంటి చర్యలను నివారించడం అవసరం. మొదటగా పరికరంలో ఉన్న ‘రీసెంట్లీ డిలీటెడ్‌’ లేదా ‘రీసైకిల్‌ బిన్‌’ ఫోల్డర్‌ను పరిశీలించడం ఉత్తమం. సాధారణంగా ఈ ఫోల్డర్‌లో ఫైళ్లు 30 రోజుల వరకు నిల్వ ఉంటాయి. అక్కడి నుంచి ఒకే క్లిక్‌తో వాటిని తిరిగి పొందవచ్చు.

క్లౌడ్ బ్యాకప్ సేవలు కూడా డేటా రికవరీలో కీలక పాత్ర పోషిస్తాయి. గూగుల్‌ ఫొటోలు లేదా యాపిల్‌ ఫొటోలు వంటి ప్లాట్‌ఫారమ్‌లు ఆటోమేటిక్‌గా ఫోటోలు, వీడియోలను ఆన్‌లైన్‌లో నిల్వ చేస్తాయి. పరికరం నుండి తొలగించినా, క్లౌడ్ ట్రాష్‌లో అవి ఇంకా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇవన్నీ పనిచేయనప్పుడు, విశ్వసనీయమైన డేటా రికవరీ సాఫ్ట్‌వేర్‌ను జాగ్రత్తగా ఉపయోగించవచ్చు. అయితే అనుమానాస్పద యాప్‌లను ఉపయోగించడం మరింత ప్రమాదకరం కావచ్చు. అవసరమైతే నిపుణుల సేవలను ఆశ్రయించడం మంచిది. మొత్తం మీద క్రమం తప్పకుండా బ్యాకప్‌లు తీసుకోవడం, జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారా డేటా నష్టాన్ని నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
సగ్గుబియ్యం పాయసం ఇలా ఒక్కసారి ట్రై చేస్తే మీ ఫేవరెట్ అయిపోతుంది!
సగ్గుబియ్యం పాయసం ఇలా ఒక్కసారి ట్రై చేస్తే మీ ఫేవరెట్ అయిపోతుంది!
14 ఏళ్ల నిరీక్షణకు తెర ?తొలి మ్యాచ్ గండం నుంచి ముంబై బయటపడుతుందా?
14 ఏళ్ల నిరీక్షణకు తెర ?తొలి మ్యాచ్ గండం నుంచి ముంబై బయటపడుతుందా?
మే 5న జరగాల్సిన JEE Main 2026 పరీక్ష వాయిదాకు విజ్ఞప్తులు
మే 5న జరగాల్సిన JEE Main 2026 పరీక్ష వాయిదాకు విజ్ఞప్తులు
డిలీట్‌ చేసిన ఫొటోలు మళ్లీ కావాలంటే ఇలా చేయండి
డిలీట్‌ చేసిన ఫొటోలు మళ్లీ కావాలంటే ఇలా చేయండి
ఓవైపు ఎండ, మరోవైపు వాన.. తెలుగురాష్ట్రాలో వాతావరణం ఎలా ఉంటుందంటే
ఓవైపు ఎండ, మరోవైపు వాన.. తెలుగురాష్ట్రాలో వాతావరణం ఎలా ఉంటుందంటే
వచ్చే వారం వరుసగా 6 రోజులు బ్యాంక్ సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
వచ్చే వారం వరుసగా 6 రోజులు బ్యాంక్ సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
మీ కాలి వేళ్లు ఇలా ఉన్నాయా? అయితే ఇదే మీ క్యారెక్టర్..
మీ కాలి వేళ్లు ఇలా ఉన్నాయా? అయితే ఇదే మీ క్యారెక్టర్..
డొనాల్డ్ ట్రంప్‌నకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చిన అమెరికన్లు..!
డొనాల్డ్ ట్రంప్‌నకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చిన అమెరికన్లు..!
క్యారెట్ దోశ.. ఇలా చేస్తే పిల్లలతో పాటు పెద్దలు కూడా లాగిస్తారు
క్యారెట్ దోశ.. ఇలా చేస్తే పిల్లలతో పాటు పెద్దలు కూడా లాగిస్తారు
భార్యతో మాట్లాడాడని ఫ్రెండ్‌ను దారుణంగా చంపాడు..
భార్యతో మాట్లాడాడని ఫ్రెండ్‌ను దారుణంగా చంపాడు..