UPI Payment: మీ స్మార్ట్ ఫోన్ పోయిందా.. మరి యూపీఐ ఐడీల పరిస్థితి ఏంటి.?
గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్ వంటి ఎన్నో రకాల యూపీఐ పేమెంట్స్ సేవల అందుబాటులోకి వచ్చాయి. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా సింపుల్‌గా పేమెంట్స్ చేసుకునే అవకాశం లభించింది. ఇదంతా బాగానే ఉంది. ఒకవేళ మీ స్మార్ట్ ఫోన్ పోయినా, ఎవరైనా దొంగలించినా.. యూపీఐ ఐడీల పరిస్థితి ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా.? ఫోన్ పోయిన వెంటనే యూపీఐ ఐడీలను ఎలా బ్లాక్ చేయాలి.?
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ లేనిది రోజు గడిచే పరిస్థితి లేదు. ప్రతీ పనికి స్మార్ట్ ఫోన్ అనివార్యంగా మారింది. మొబైల్ రీఛార్జ్ నుంచి ఫ్లైట్ టికెట్ బుకింగ్ వరకు అన్నింటికీ స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. ఇక యూపీఐ పేమెంట్స్ విధానం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఫోన్ లేకపోతే అడుగు బయటపెట్టలేని పరిస్థితి ఉంది.
గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్ వంటి ఎన్నో రకాల యూపీఐ పేమెంట్స్ సేవల అందుబాటులోకి వచ్చాయి. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా సింపుల్‌గా పేమెంట్స్ చేసుకునే అవకాశం లభించింది. ఇదంతా బాగానే ఉంది. ఒకవేళ మీ స్మార్ట్ ఫోన్ పోయినా, ఎవరైనా దొంగలించినా.. యూపీఐ ఐడీల పరిస్థితి ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా.? ఫోన్ పోయిన వెంటనే యూపీఐ ఐడీలను ఎలా బ్లాక్ చేయాలి.? ఇందుకోసం ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పేటీఎమ్ ఐడిని ఇలా బ్లాక్ చేసుకోండి..
ఇందుకోసం ముందుంగా పేటీఎమ్ హెల్ప్ లైన్‌నెంబర్ 01204456456కు కాల్ చేయాలి. అనంతరం మీ ఫోన్ నెంబర్ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు పోయిన మీ ఫోన్ నెంబర్‌ను సెలక్ట్ చేసుకోవాలి. తర్వాత లాగ్ అవుట్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం పేటీఎమ్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి 24×7 హెల్ప్ ఆప్షన్‌ని సెలక్ట్ చేసుకోవాలి. తర్వాత రిపోర్ట్ ఏ ఫ్రాడ్ లేదా మెసేజ్ అస్ ఆప్షన్‌ని సెలక్ట్ చేసుకోవాలి. చివరిగా పోలీస్ రిపోర్ట్‌తో సహా కొన్ని వివరాలను వివరించాలి. అన్ని వివరాలను తనిఖీ చేసిన తర్వాత పేటీఎమ్ మీ ఖాతాను తాత్కాలికంగా బ్లాక్ చేస్తుంది.
ఫోన్‌పేని యూపీఐ ఐడీని..
ఇందుకోసం ముందుగా 02268727374 లేదా 08068727374కు కాల్ చేయాలి. అనంతరం యూపీఐ ఐడీ లింక్ చేసిన మొబైల్ నెంబర్‌ను ఫిర్యాదు చేయాలి. ఓటీపీ ఆప్షన్ అడిగిన్పుడు సిమ్ కార్డ్ అండ్ డివైజ్ లాస్ట్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత వెంటనే కస్టమర్ కేర్‌కి కాల్ కనెక్ట్ అవుతుంది. అనంతరం కొన్ని అంశాలు అందించిన వెంటనే యూపీఐ ఐడీ బ్లాక్ అవుతుంది.
గూగుల్ పే యూపీఐ ఐడీ..
ఇందుకోసం ముందుగా 18004190157 నంబర్‌కు కాల్ చేయాలి. అనంతరం మీ యూపీఐ ఐడీ బ్లాక్ చేయాలనే విషయాన్ని తెలియజేయాలి.. అనంతరం ఆండ్రాయిడ్ యూజర్లు.. కంప్యూటర్ లేదా ఫోన్‌లో Google Find My Phoneకి లాగిన్ చేయాలి. అనంతరం గూగుల్ పే డేటాను రిమోట్‌గా తొలగించాలి. దీని తర్వాత మీ Google Pay ఖాతా తాత్కాలికంగా బ్లాక్ అవుతుంది. ఒకవేళ ఐఓఎస్ యూజర్లు అయితే.. Find my app ద్వారా డేటాను తొలగించడం ద్వారా గూగుల్ పే ఖాతాను బ్లాక్ చేయొచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..