Flight Landing: విమానం ల్యాండింగ్‌ సమయంలో వేగం ఎంత ఉంటుంది? ల్యాండింగ్‌లు ఎన్ని రకాలు

Flight Emergency Landing: విమానం అకస్మాత్తుగా సాంకేతిక సమస్యను ఎదుర్కొన్నప్పుడు లేదా ఇంజిన్‌లో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు పైలట్‌ విమానాన్ని అత్యవసరం ల్యాండింగ్‌ చేయాల్సి వస్తుంది. అలాగే ఇంధన లీక్, క్యాబిన్ ఒత్తిడి కోల్పోవడం, ల్యాండింగ్ గేర్ సమస్యలు లేదా వైద్య..

Flight Landing: విమానం ల్యాండింగ్‌ సమయంలో వేగం ఎంత ఉంటుంది? ల్యాండింగ్‌లు ఎన్ని రకాలు

Updated on: Oct 22, 2025 | 9:23 PM

Flight Emergency Landing: ఇటీవల జరిగిన విమాన ప్రమాదాలు పెద్ద విషాధంగా మారాయి. ఇటీవల అహ్మదాబాద్‌లో ఓ భవనంపై కూలిన విమానం 241 మంది మృతి చెందారు. ఇలాంటి ప్రమాదాలు ఎన్నో జరిగాయి. కొన్ని సందర్భాలలో పైలట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వస్తుంటుంది. మరి అత్యవసర ల్యాండింగ్ అంటే ఏమిటి? దాని విధానం ఏమిటి? అటువంటి పరిస్థితిలో పైలట్ ఏం చేస్తారో తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: Bank Holiday: అక్టోబర్‌ 23న బ్యాంకులు బంద్‌ ఉంటాయా..? కారణం ఏంటి?

అత్యవసర ల్యాండింగ్ ఎప్పుడు చేస్తారు?

విమానం అకస్మాత్తుగా సాంకేతిక సమస్యను ఎదుర్కొన్నప్పుడు లేదా ఇంజిన్‌లో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు పైలట్‌ విమానాన్ని అత్యవసరం ల్యాండింగ్‌ చేయాల్సి వస్తుంది. అలాగే ఇంధన లీక్, క్యాబిన్ ఒత్తిడి కోల్పోవడం, ల్యాండింగ్ గేర్ సమస్యలు లేదా వైద్య అత్యవసర పరిస్థితిలో ఫైట్‌ అత్యవసర ల్యాండింగ్‌ అవసరం అవుతుంది.

ఇవి కూడా చదవండి

ల్యాండింగ్‌లు ఎన్ని రకాలు ఉంటాయి?

ఇక ఫెడరేషన్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నివేదిక ప్రకారం.. అత్యవసర ల్యాండింగ్‌లు ప్రధానంగా మూడు రకాలుగా ఉంటాయి.

అకస్మాత్తు ల్యాండింగ్: జిన్ అకస్మాత్తుగా ఆగిపోయినప్పుడు, వెంటనే ల్యాండ్ చేయవలసి వచ్చినప్పుడు.

➦ ముందు జాగ్రత్త ల్యాండింగ్: ఇంధనం అయిపోవడం వంటి, లేదా ఇతర ఏదైనా సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని పైలట్‌ ముందస్తుగా గుర్తించినట్లయితే ముందు జాగ్రత్త చర్యగా ల్యాండింగ్ చేస్తాడు. అలాగే విమానం భూమిపై కాకుండా నీటిపై (నది, సరస్సు లేదా సముద్రం) దిగవలసి వచ్చినప్పుడు.

అత్యవసర ల్యాండింగ్ సమయంలో విమానం వేగం ఎంత ఉంటుంది?

సాధారణంగా సాధారణ ల్యాండింగ్‌లో విమానం వేగం గంటకు 240 నుండి 300 కి.మీ వేగం ఉంటుంది. కానీ అత్యవసర ల్యాండింగ్ సమయంలో పైలట్ వేగాన్ని తగ్గిస్తాడు. ఇది సాధారణంగా గంటకు 150 నుండి 200 కి.మీ.ల మధ్య ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ వేగంతో ఆపడానికి ఎక్కువ దూరం అవసరం అవుతుంది.

అత్యవసర పరిస్థితుల్లో పైలట్ చేసేవి ఏంటి?

పైలట్ ప్రమాద సంకేతం అందుకున్న వెంటనే అతను త్వరగా కొన్ని దశలను అనుసరిస్తాడు.

➦ “మేడే” అని పిలవడం: ముందుగా, పైలట్ “మేడే మేడే మేడే” అని మూడు సార్లు పిలవడం ద్వారా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కి హెచ్చరిక చేస్తాడు.

➦ ల్యాండింగ్ సైట్‌ను ఎంచుకోవడం: పైలట్ సురక్షితమైన ప్రదేశాన్ని ఎంచుకుంటాడు. సమీప రన్‌వే, హైవే, ఓపెన్ ఫీల్డ్.

➦ వేగం, ఎత్తును నియంత్రించడానికి: ఫ్లాప్‌లు, ల్యాండింగ్ గేర్‌లను ఉపయోగించి, విమానం గాలిలో నిలిచిపోకుండా వేగం, ఎత్తును తగ్గిస్తారు.

➦ గాలి దిశను పరిగణనలోకి తీసుకోవాలి: విమానం సహజంగా నెమ్మదించేలా ల్యాండింగ్ ఎల్లప్పుడూ గాలికి వ్యతిరేకంగా జరుగుతుంది.

➦ ఇంజిన్ లేదా వ్యవస్థను ఆపివేయడం: ఇంజిన్‌కు మంటలు లేదా ప్రమాదం ఉంటే ఇంధన సరఫరా, విద్యుత్ వ్యవస్థను నిలిపివేస్తుంది.

➦ ప్రయాణికులు సిద్ధం కావాలి: క్యాబిన్ సిబ్బంది ప్రయాణికులను “బ్రేస్ పొజిషన్” తీసుకోవాలని, సీట్ బెల్టులు బిగించుకోవాలని, మాస్క్‌లు ధరించాలని సూచిస్తారు.

➦ రన్‌వే లేకపోతే, విమానం పొలం, నేల, గడ్డి లేదా నీటిపై ల్యాండ్ అవుతుంది. విమానం ఆగిన వెంటనే, అత్యవసర స్లయిడ్‌లను తెరిచి, ప్రయాణికులను త్వరగా ఖాళీ చేయిస్తారు. అగ్నిమాపక దళం, వైద్య బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంటాయి.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి