Honor X7b 5G: హానర్‌ నుంచి స్టన్నింగ్ ఫోన్‌.. తక్కువ ధరలోనే 108 ఎంపీ కెమెరా..

సెక్యూరిటీ కోసం ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను అందించారు. అలాగే ఈ స్మార్ట్ ఫోన్‌లో 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో కూడిన 6.8 ఇంచెస్‌ ఫుల్‌హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. టీఎఫ్‌టీ ఎల్‌సీడీ స్క్రీన్‌ను ఇందులో ఇచ్చారు. 90 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్ ఈ స్క్రీన్‌ సొంతం. అలాగే ఇందులో 8జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ను అందించారు. ఇక ధర విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌ బేసిక్‌ వేరియంట్‌...

Honor X7b 5G: హానర్‌ నుంచి స్టన్నింగ్ ఫోన్‌.. తక్కువ ధరలోనే 108 ఎంపీ కెమెరా..
Honor X7b 5g
Follow us

|

Updated on: Apr 04, 2024 | 4:52 PM

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం హానర్‌ గ్లోబల్‌ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. హానర్‌ ఎక్స్‌7బీ పేరుతో ఈ 5జీ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే ఇప్పటికే హానర్‌ ఎక్స్‌7బీ పేరుతో 4జీ ఫోన్‌ను తీసుకోగా తాజాగా 5జీ వెర్షన్‌ను లాంచ్‌ చేసింది. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

హానర్‌ ఎక్స్‌7బీ స్మార్ట్ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 680 చిప్‌సెట్ ప్రాసెసర్‌ను అందించారు. ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో 6000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. డెప్త్‌, మాక్రో షాట్‌లకోసం ప్రత్యేకంగా కెమెరాల అదించారు. 8 జీబీ ర్యామ ఈ ఫోన్‌ సొంతం. కనెక్టివిటీ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. మైక్రో SD కార్డ్ స్లాట్‌, USB-C పోర్ట్‌ , 3.5mm ఆడియో జాక్, డ్యూయల్ స్పీకర్లు, Wi-Fi 802.11ac, బ్లూటూత్ 5.1 అందించారు.

సెక్యూరిటీ కోసం ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను అందించారు. అలాగే ఈ స్మార్ట్ ఫోన్‌లో 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో కూడిన 6.8 ఇంచెస్‌ ఫుల్‌హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. టీఎఫ్‌టీ ఎల్‌సీడీ స్క్రీన్‌ను ఇందులో ఇచ్చారు. 90 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్ ఈ స్క్రీన్‌ సొంతం. అలాగే ఇందులో 8జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ను అందించారు. ఇక ధర విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌ బేసిక్‌ వేరియంట్‌ రూ. 25000గా ఉండొచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం గ్లోబల్‌ మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌ను త్వరలోనే భారత్‌లో లాంచ్‌ చేయనున్నారు. భారత్‌లో ధరలు ఎలా ఉంటాయన్న దానిపై కంపెనీ ఇప్పటిరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్