Poor EV Company Electric Bike launch : ఐఐటి హైదరాబాద్-ఇంక్యుబేటెడ్ స్టార్టప్ ప్యూర్ ఇవి ఇప్పటికే మంచి ఆకర్షణీయమైన ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రవేశపెట్టింది. ఇందులో ఈ-ఫ్లూటో 7జీ చాలా పాపులర్ అయింది. అయితే ప్యూర్ ఈవీ కొత్తగా మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను ఏటీఆర్ ఎస్టి 350బైక్‌ను రూపొందించింది. మార్చి నాటికి దేశవ్యాప్తంగా సుమారు 50 డెమో వాహనాలను ప్రవేశపెట్టనుంది. కంపెనీ ఔట్‌లెట్లలో టెస్ట్ డ్రైవ్‌ల కోసం అందుబాటులో ఉంచుతుంది. మొదట మూడు నగరాల్లో ఈ బైక్‌ని ప్రవేశపెట్టనుంది. ప్యూర్ ఈవీ సరికొత్త బైక్ ‘ETRYST 350’ రోడ్లపైకి రానుంది. ఇది సంప్రదాయ పెట్రోల్ బైక్ మాదిరిగా కనిపిస్తోంది. ఈ బైక్ మొదట బెంగళూరు, హైదరాబాద్ మరియు పూణేలలో ప్రారంభించనుంది. తరువాత సంవత్సరం చివరినాటికి మరిన్ని అవుట్లెట్లకు విస్తరిస్తుంది.
PURE EV ‘ETRYST 350’బైక్ అచ్చం పెట్రోల్ బైక్ మాదిరిగానే ఉంది. ఇంజన్ స్థానంలో బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. గంటకు 85 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. సింగిల్ చార్జ్‌పై సుమారు 120 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఈ బైక్‌లో 3.5 కిలోవాట్ల పేటెంట్ బ్యాటరీని వినియోగించినట్లు తెలుస్తోంది. ఈ బ్యాటరీపై మూడు లేదా ఐదేళ్ల వారంటీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఎలక్ట్రిక్ బైక్ ఇండియన్ రోడ్స్ కండీషన్‌కు అనుగుణంగా తయారు చేశారు. రోజువారీ ప్రయాణాలకు 85 కిలోమీటర్ల వేగంతో కూడా చాలా స్థిరమైన రైడ్ అనుభవాన్ని అందిస్తుంది. ప్రీమియం పెట్రోల్ వాహనాలతో సమానంగా మంచి పికప్ ఇస్తుంది. స్టైలిష్‌గా ఉంటుంది. ప్రస్తుతం బైక్ కోసం విస్తృతమైన ట్రయల్స్, టెస్టింగ్ జరుగుతోంది. ప్యూర్ ఈవీ సంస్థ తమిళనాడు నుండి శ్రీనగర్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు 100 కి పైగా టచ్ పాయింట్లను కలిగి ఉంది, మరింత విస్తరించే యోచనలో ఉంది. నేపాల్‌కు ఎగుమతులు ప్రారంభమయ్యాయి. మిగిలిన దక్షిణ ఆసియా, ఆగ్నేయాసియా మరియు దక్షిణాఫ్రికాతో పాటు ఆఫ్రికాకు కూడా ఎగుమతులు చేయాలని కంపెనీ భావిస్తోంది.