Jio Prepaid: ఉచితంగా నెట్ ఫ్లిక్స్, అన్ లిమిటెడ్ కాల్స్.. జియో నుంచి అదిరే ప్లాన్..
దేశంలోనే నంబర్ వన్ నెట్ వర్క్ గా కొనసాగుతోంది. కోట్లాది మంది వినియోగదారులు జియోకి ఉన్నారు. అందుకే కస్టమర్లందరినీ సంతోషంగా ఉంచేందుకు కంపెనీ వివిధ రేంజ్‌లలో ప్లాన్‌లను అందిస్తోంది. ఇదే క్రమంలో జియో నుంచి మరో ఆకర్షణీయమైన ప్లాన్ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ లో ఉచిత నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్, అన్ లిమిటెడ్ కాల్స్ , 3జీబీ డేటా ఇస్తుంది. ఈ ప్లాన్ కోసం మీరు కోసం రోజుకు రూ.18 చెల్లిస్తే సరిపోతుంది.
టెలికాం రంగంలో సంచలనం రిలయన్స్ జియో. చవకైన ధరల్లో హై స్పీడ్ ఇంటర్ నెట్ ను జనాలకు పరిచయం చేసింది జియో. ప్రస్తుతం దేశంలోనే నంబర్ వన్ నెట్ వర్క్ గా కొనసాగుతోంది. కోట్లాది మంది వినియోగదారులు జియోకి ఉన్నారు. అందుకే కస్టమర్లందరినీ సంతోషంగా ఉంచేందుకు కంపెనీ వివిధ రేంజ్‌లలో ప్లాన్‌లను అందిస్తోంది. ఇదే క్రమంలో జియో నుంచి మరో ఆకర్షణీయమైన ప్లాన్ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ లో ఉచిత నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్, అన్ లిమిటెడ్ కాల్స్ , 3జీబీ డేటా ఇస్తుంది. ఈ ప్లాన్ కోసం మీరు కోసం రోజుకు రూ.18 చెల్లిస్తే సరిపోతుంది. ఈ ప్లాన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
జియో రూ. 1,499 ఉచిత నెట్‌ఫ్లిక్స్ ప్లాన్..
జియో రూ. 1499 ప్లాన్‌లో, మీరు అపరిమిత వాయిస్ కాలింగ్ సపోర్ట్ పొందుతారు. అలాగే, ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్ లు వస్తాయి. ఇది కాకుండా, కస్టమర్‌లు ప్లాన్‌లో ప్రతిరోజూ 3జీబీ డేటాను కూడా పొందుతారు. ఈ విధంగా, ఈ ప్లాన్‌లో కస్టమర్‌లకు మొత్తం 252జీబీ డేటా ఇస్తుంది. ఈ ప్లాన్‌లో లభించే ప్రత్యేక ప్రయోజనాలను చూస్తే.. నెట్ ఫ్లిక్స్(బేసిక్), జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ కి యాక్సెస్‌ను అందిస్తుంది. ప్లాన్‌లోని డేటా పరిమితి ముగిసిన తర్వాత, వేగం 64కేబీపీఎస్ కి తగ్గుతుంది. ప్లాన్‌లోని కస్టమర్‌లకు జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ అందుతుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు.
బేసిక్ నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ ధర
నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్ ధర చూస్తే, జియో ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్ ను మీరు ఉచితంగా పొందాలంటే నెలకు రూ. 199 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ 720p (హెచ్డీ) రిజల్యూషన్‌కు మద్దతు ఇస్తుంది. టీవీ, కంప్యూటర్, మొబైల్ ఫోన్, టాబ్లెట్‌తో సహా అన్ని పరికరాలలో ప్లాన్ పనిచేస్తుంది. అయితే కంటెంట్‌ని ఒకేసారి ఒక స్క్రీన్‌లో మాత్రమే ప్లే చేయగలం.
నెట్ ఫ్లిక్స్ ఉచితం..
జియో రూ. 1099 ప్లాన్ నెట్‌ఫ్లిక్స్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తో కూడా వస్తుంది. ఈ ప్లాన్‌లో రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌తో మీరు జియో టీవీ, జియో క్లౌడ్ వంటి యాప్స్ కు యాక్సెస్ లభిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజుల వరకు ఉంటుంది.
మార్కెట్లో పోటీ వాతావరణం..
టెలికాం మార్కెట్లో విపరీతమైన పోటీ ఉంది. అందుకే ఒకదాని కొకటి పోటా పోటీగా ప్లాన్లను అందిస్తున్నాయి. ప్రధానం ఎయిర్ టెల్, రియలన్స్ జియో, వొడాఫోన్-ఐడియా(వీఐ) మధ్య పోటీ సాగుతోంది. వినియోగదారులు ఇటీవల ఓటీటీ ప్లాట్ ఫాం సబ్ స్క్రిప్షన్లతో కూడిన ప్లాన్లను ఎక్కువగా తీసుకుంటుండటంతో అన్ని టెలికాం కంపెనీలు ఆ దిశగా కొత్త ప్లాన్లను ఆవిష్కరిస్తున్నాయి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..