Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Robots: మహిళలూ ఇక రిలాక్స్ అవ్వండి.. ఇంటి పని చేసే రోబోలు వచ్చేస్తున్నాయ్.. పూర్తి వివరాలు ఇవి..

వచ్చే పదేళ్లలో మనిషి చేయగలిగే దాదాపు 39 శాతం ఇంటి పనులను రోబోలే చేసేస్తాయట. అంటే ఇంట్లో వస్తువులు శుభ్రపరచడం, గ్రాసరీలు కొనడం, మార్కెట్ కు వెళ్లి రావడం వంటి పనులన్నీ చేసేస్తాయి.

Robots: మహిళలూ ఇక రిలాక్స్ అవ్వండి.. ఇంటి పని చేసే రోబోలు వచ్చేస్తున్నాయ్.. పూర్తి వివరాలు ఇవి..
Robot Vaccum Cleaners
Follow us
Madhu

|

Updated on: Feb 24, 2023 | 1:00 PM

ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతోంది. అందుబాటులోకి వస్తున్న ఆధునిక సాంకేతికతతో సరికొత్తగా తనను తాను ఆవిష్కరించుకుంటోంది. కృత్రిమ మేథ విపరీతంగా వృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో మనిషికి పని తగ్గిపోతోంది. రానున్న కాలంలో మనిషి చేసే అన్ని పనులు యంత్రాలు చేసేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే ఆ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇదే క్రమంలో మరో ఆసక్తికర సర్వే ఒకటి వెలుగుచూసింది. వచ్చే పదేళ్లలో మనిషి చేయగలిగే దాదాపు 39 శాతం ఇంటి పనులను రోబోలే చేసేస్తాయట. అంటే ఇంట్లో వస్తువులు శుభ్రపరచడం, గ్రాసరీలు కొనడం, మార్కెట్ కు వెళ్లి రావడం వంటి పనులన్నీ చేసేస్తాయట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

పరిశోధన ఇలా..

ప్లాస్ వన్ జర్నల్‌లో ప్రచురించిన పరిశోధన ప్రకారం, రోబోలు రాబోయే దశాబ్దంలో ఇంటి పనుల్లో మూడో వంతు కంటే ఎక్కువ చేయగలవు . 2033 నాటికి జీతం లేని ఇంటి పనిలో 39 శాతం రోబోలు చేయగలవని సర్వే చెబుతోంది. యూకే జపాన్‌కు చెందిన పరిశోధకులు 65 మంది కృత్రిమ మేథస్సు (AI) నిపుణులతో మాట్లాడారు. రాబోయే 10 సంవత్సరాలలో సాధారణ గృహ పనులలో ఆటోమేషన్ ఏ స్థాయిలో ఉండే అవకాశం ఉందో అంచనావేయమని కోరారు. ఈ క్రమంలో పరిశోధకులు మాట్లాడుతూ కిరాణా షాపింగ్ లో పూర్తి స్థాయి ఆటోమేషన్‌ను చూడవచ్చని అంచనా వేశారు. అలాగే యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్, జపాన్‌లోని ఓచనోమిజు యూనివర్సిటీ పరిశోధకులు మాట్లాడుతూ రోబోలు ఇంటి పనిని చేయడంతో పాటు చెత్తను కూడా క్లీన్ చేయగలుగుతుందా అని ప్రశ్నించారు. అయితే ఇప్పటికే రోబో వ్యాక్యూమ్ క్లీనర్ లు విరివిగా వాడబడుతున్నాయన్న విషయాన్ని గుర్తించాలని ఏఐ నిపుణులు వివరించారు.

60 శాతం సమయాన్ని ఆదా చేస్తాయి..

పెద్దలు ఇంటి పనుల నిమిత్తం 43 శాతం సమయాన్ని వెచ్చిస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు. దీనిని తగ్గించేందుకు ఆటోమేషన్ ఉపకరిస్తుందని ఏఐ నిపుణులు చెప్పారు. వచ్చే పదేళ్లలో అందుబాటులోకి వచ్చే సాంకేతికతతో దాదాపు 60 శాతం సమయం ఆదా అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ  క్లిక్ చేయండి..