సమాజం స్మార్ట్ అడుగులు వేస్తోంది. మనిషికి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు అనంత సౌఖ్యాన్ని అందిస్తున్నాయి. అందివస్తున్న సాంకేతికతతో సర్వం మనిషి చేతిలో నిక్షిప్తం అయిపోతోంది. ఇటీవల కాలంలో స్మార్ట్ వాచ్ ల వినియోగం కూడా బాగా పెరిగింది. అందరూ తమ చేతికి స్మార్ట్ వాచ్ ఉండాలని కోరుకుంటున్నారు. మీరు కూడా కొత్త స్మార్ట్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ కథనం మీకోసమే. ప్రీమియం మోడల్లో పీట్రాన్ ఏస్ స్మార్ట్ వాచ్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. దీంతో పాటు జెన్ బడ్స్ ఈవో ట్రూ వైర్ లెస్ ఇయర్ బడ్స్ ను కూడా కంపెనీ విడుదల చేసింది. ఈ రెండు కూడా ప్రీమియం ఫీచర్లతో పాటు అనువైన ధరలోనే అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్త స్మార్ట్ వాచ్, ఇయర్ బడ్స్ గురించిన స్పెసిఫికేషన్లు, పీచర్లు, ధర, లభ్యత వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఈ స్మార్ట్ వాచ్ లో 1.85 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే ఉంటుంది. ప్రత్యేకంగా బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. ఇది ఇన్ డోర్, అవుట్ డోర్ లలోనూ అద్భుతమైన డిస్ ప్లే ను అందిస్తుంది. మంచి క్వాలిటీతో కూడిన పిక్చర్ ను అందిస్తుంది. ఐపీ68 రేటింగ్ తో వాటర్, డస్ట్ రెసిస్టెంట్ గా పనిచేస్తుంది. ఇక ఫీచర్ల విషయానికి వస్తే హార్ట్ రేట్ మానిటర్, స్లీప్ ట్రాకింగ్ వంటి అధునాతన ఫీచర్లు ఉంటాయి. ప్రతి రోజూ చేసే వ్యయామాలు, వాకింగ్ వంటి పర్యవేక్షణ ఉంటుంది. ఇందులో 120 స్పోర్ట్స్ మోడ్లు ఉంటాయి. ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీస్ చేసే వారికి సరిగ్గా సరిపోతుంది. అలాగే ఇన్ బిల్ట్ గేమ్స్ ఈ స్మార్ట వాచ్ లో ఉంటాయి.
ఈ ఇయర్ బడ్స్ స్టైలిష్ లుక్ లో ఉంటాయి. దీనిలో ట్రూ టాక్ ఏఐ ఈఎన్సీ కాల్స్ టెక్నాలజీని వినియోగించారు. ఇది బ్యాగ్రౌండ్ నాయిస్ ను సమర్థవంతంగా తగ్గిస్తోంది. 32 గంటల ప్లే టైం ఉంటుంది. ఇందులో మూవీ లేదా మ్యూజిక్ మోడ్లు ఉంటాయి. దీనిలో ఎలక్ట్రో ప్లేటెడ్ టైప్ సీ ఫాస్ట్ చార్జింగ్ కేస్ ఉంటుంది. ఇది కూడా ఐపీఎక్స్5 రేటింగ్ తో వాటర్ రెసిస్టెన్స్ గా వస్తోంది.
పీట్రాన్ ఏస్ స్మార్ట్ వాచ్ జూలై పదో తేదీ నుంచి కొనుగోలుదారులకు అందుబాటులోకి వచ్చింది. దీని ధర రూ. 1299గా ఉంది. అలాగే పీట్రాన్ ఇయర్ బడ్స్ ధర రూ. 899గా ఉంది. ఇది జూలై 11 నుంచి ఆన్ లైన్లో అందుబాటులోకి రానుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..