Realme Buds: తిరుగులేని ఫీచర్లతో రియల్ మీ కొత్త ఇయర్ బడ్స్.. అనువైన బడ్జెట్లో అద్భుతమైన పనితీరు..

రియల్ మీ బ్రాండ్ నుంచి అనువైన బడ్జెట్లో రియల్ మీ బడ్స్ ఎయిర్ 5 మార్కెట్లోకి వచ్చింది. కొంత కాలం క్రితమే రియల్ మీ దీనిని వీటిని లాంచ్ చేసినా.. ఇప్పుడు కొనుగోలు చేసేందుకు అవకాశం ఏర్పడింది. ఈ రియల్ మీ బడ్స్ ఎయిర్ 5 ఇయర్ ఫోన్స్ లో నాయిస్ కాన్సిలేషన్ ఫీచర్ ఉంది. 12.4ఎంఎం మెగా టైటానైజింగ్ డ్రైవర్ యూనిట్ ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర, లభ్యత, ఆఫర్ల గురించి తెలుసుకుందాం..

Realme Buds: తిరుగులేని ఫీచర్లతో రియల్ మీ కొత్త ఇయర్ బడ్స్.. అనువైన బడ్జెట్లో అద్భుతమైన పనితీరు..
Realme Buds Air 5
Follow us
Madhu

|

Updated on: Aug 28, 2023 | 11:06 AM

మీరు ఎక్కువగా మ్యూజిక్ ని ఇష్టపడతారా? అందుకోసం మంచి వైర్ లెస్ ఇయర్ ఫోన్ల కోసం వెతుకుతున్నారా?అయితే మీకో గుడ్ న్యూస్. తక్కువ ధరలో ఉత్తమ ఫీచర్లతో కూడిన ఇయర్ ఫోన్లు మీకు అందుబాటులోకి వచ్చాయి. రియల్ మీ బ్రాండ్ నుంచి అనువైన బడ్జెట్లో రియల్ మీ బడ్స్ ఎయిర్ 5 మార్కెట్లోకి వచ్చింది. కొంత కాలం క్రితమే రియల్ మీ దీనిని వీటిని లాంచ్ చేసినా.. ఇప్పుడు కొనుగోలు చేసేందుకు అవకాశం ఏర్పడింది. ఈ రియల్ మీ బడ్స్ ఎయిర్ 5 ఇయర్ ఫోన్స్ లో నాయిస్ కాన్సిలేషన్ ఫీచర్ ఉంది. 12.4ఎంఎం మెగా టైటానైజింగ్ డ్రైవర్ యూనిట్ ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర, లభ్యత, ఆఫర్ల గురించి తెలుసుకుందాం..

ధర, ఆఫర్లు ఇలా..

ఈ రియల్ మీ బడ్స్ ఎయిర్ 5 ధర రూ. 3,699గా ఉంది. డీప్ సీ బ్లూ, ఆర్టిక్ వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఈ బడ్స్ ను రియల్ మీ అధికారి వెబ్ సైట్ తో పాటు, ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారంలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లలో కొనుగోలు చేయొచ్చు. లాంచింగ్ ఆఫర్ కింద వీటి కొనుగోలుపై రియల్ మీ రూ. 200 తగ్గింపునందిస్తోంది. దీంతో దీనిని మీరు రూ. 3,499కే కొనుగోలు చేయొచ్చు.

రియల్ మీ బడ్స్ ఎయిర్ 5 ఫీచర్లు..

రియల్ మీ బడ్స్ ఎయిర్ 5 లో 12.4ఎంఎం సైజ్ లో టైటనైజెడ్ డ్రైవర్ బ్లూటూత్ కనెక్టివిటీతో ఉంటుంది. ఐపీఎక్స్5 రేటింగ్ తో వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. రియల్ మీ లింక్ యాప్ ద్వారా డ్యూయల్ డివైజ్ కనెక్టివిటీని కలిగి ఉంటుంది. ఏఐ ఆధారితక నాయిస్ క్యాన్సలేషన్ టెక్నాలజీతో ఉంటుంది. దీని ద్వారా అద్భుతమైన కాల్ క్వాలిటీని అందిస్తుంది. చుట్టూ ఉండే వాతావరణంతో సంబంధం లేకుండా, ఎటువంటి డిస్టార్షన్సు లేకుండా కాల్స్ మాట్లాడుకొనే వీలు కల్పిస్తుంది.  దీనిలోని బ్యాటరీ అధిక సామర్థ్యం కలిగి ఉంటుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే  38 గంటల పాటు మ్యూజిక్ ని ఆగకుండా ఎంజాయ్ చేయొచ్చు. ఈ బడ్స్ లో స్విఫ్ట్ చార్జింగ్ కేపబులిటీస్ ఉంటాయి. అలాగే ఆడియో కూడా సూపర్ క్వాలిటీతో వస్తుంది. మీరు తక్కువ ధరలో మంచి వైర్ లెస్ ఇయర్ ఫోన్లను  కొనుగోలు చేయాలని భావిస్తే ఇంతకన్నా బెస్ట్ ఆప్షన్ ఉండదు. ఎందుకంటే దీనిలో ఇంతకు ముందు చెప్పిన విధంగా నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీతో పాటు, అధిక బ్యాటరీ లైఫ్, డ్యూయల్ డివైజ్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..