జియో యూజర్లకు అదిరే అప్ డేట్.. కాల్స్‌లోనూ ఏఐ ఫీచర్.. ఎలా వాడాలంటే..

Jio Phone Call AI Feature: ప్రస్తుతం టెక్నాలజీలో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) దూసుకుపోతోంది. అన్ని ప్రముఖ కంపెనీలు ఏఐ సేవలను వినియోగించుకుంటున్నాయి. దానిలో భాగంగానే జియో కూడా తమ యూజర్లకు పరిచయం చేసింది. ఫోన్ కాల్స్ చేసుకునే సమయంలో ఏఐ ద్వారా మనకు కొత్త సేవలు అందుతాయి. రియల్ టైమ్ రికార్డింగ్, ట్రాన్స్‌క్రిప్షన్, మెసేజ్, అనువాదం తదితర సేవలు అందుతాయి.

జియో యూజర్లకు అదిరే అప్ డేట్.. కాల్స్‌లోనూ ఏఐ ఫీచర్.. ఎలా వాడాలంటే..
Jio Phone Call Ai Feature
Follow us

|

Updated on: Aug 31, 2024 | 6:54 PM

ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో తన వినియోగదారులకు అనేక సేవలు అందిస్తూ ముందుకు సాగుతోంది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ మెరుగైన సేవలు అందిస్తోంది. దేశంలో ఎక్కువ మంది యూజర్లు ఉన్న నెట్ వర్క్ గా చెలామణి అవుతోంది. దీనిలో భాగంగా మరో కొత్త ఫీచర్ ను ప్రకటించింది. దీనితో యూజర్లకు మరిన్ని మెరుగైన సేవలు అందుతాయని భావిస్తోంది. కొత్తగా జియో ఫోన్ కాల్ ఏఐ అనే ఫీచర్ ను తీసుకువచ్చింది. దీని ఉపయోగాలు, పనితీరు విధానాన్ని తెలుసుకుందాం.

మెరుగైన సేవలు..

ప్రస్తుతం టెక్నాలజీలో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) దూసుకుపోతోంది. అన్ని ప్రముఖ కంపెనీలు ఏఐ సేవలను వినియోగించుకుంటున్నాయి. దానిలో భాగంగానే జియో కూడా తమ యూజర్లకు పరిచయం చేసింది. ఫోన్ కాల్స్ చేసుకునే సమయంలో ఏఐ ద్వారా మనకు కొత్త సేవలు అందుతాయి. రియల్ టైమ్ రికార్డింగ్, ట్రాన్స్‌క్రిప్షన్, మెసేజ్, అనువాదం తదితర సేవలు అందుతాయి. ముఖ్యంగా కాల్ నిర్వహణను మెరుగుపర్చడం దీని ప్రధాన ఉద్దేశం.

ఏఐ ఆధారిత సేవలు..

రిలయన్స్ జియో 47వ వార్షిక సాధారణ సమావేశం ఇటీవల జరిగింది. ఈ సందర్భంగా జియో ఫోన్‌కాల్ ఏఐ అనే ఏఐ ఆధారిత సేవలను కంపెనీ పరిచయం చేసింది. జియో అందించిన ఈ కొత్త సేవ ద్వారా మన ఫోన్ కాల్ కు కృత్రిమ మేధస్సు (ఏఐ)ను అనుసంధానిస్తుంది. దీని ద్వారా యూజర్లు తమ సంభాషణలను రికార్డ్ చేయడానికి, అనువదించడానికి, పంపించడానికి అవకాశం ఉంటుంది. దీని ద్వారా అన్ని భాషలలో ఫోన్ కాల్ నిర్వహణ మెరుగవుతుంది.

జియో ఫోన్ కాల్ ఏఐ అంటే..

జియో అందించిన కొత్త ఏఐ ఆధారిత సేవనే జియో ఫోన్ కాల్ ఏఐ అని పిలువొచ్చు. ఫోన్ కాల్స్ కోసం ఏఐ ఆధారిత ఫీచర్లను అందిస్తుంది. మనం మాట్లాడే పదాలను టెక్స్ట్‌గా మార్చడం, సంభాషణలను సేవ్ చేయడం, వాటిని వివిధ భాషల్లోకి అనువదించడం తదతర వాటిని చాలా సులభంగా నిర్వహిస్తుంది.

ఉపయోగించే విధానం..

  • మీరు వేరొకరితో మాట్లాడుతున్నప్పుడు ఆ కాల్‌కు జియో ఫోన్‌కాల్ ఏఐ నంబర్ (1-800-732-673)ను యాడ్ చేయాలి.
  • కనెక్ట్ అయిన తర్వాత ఏఐ యాక్టివేట్ అయ్యిందని తెలుపుతూ మీకు స్వాగత సందేశం వస్తుంది.
  • మీ సంభాషణను రికార్డ్ చేయడానికి #1ని నొక్కండి. దీంతో ఏఐ ఆ మాటలను టెక్స్ట్‌గా మార్చడం ప్రారంభిస్తుంది. అలాగే సంభాషణను రికార్డ్ చేస్తుంది.
  • మీరు ఏ సమయంలోనైనా ట్రాన్స్‌క్రిప్షన్‌ను పాజ్ చేయాలనుకుంటే #2 నొక్కండి. ట్రాన్స్క్రిప్షన్ పాజ్ చేయబడిందని ఏఐ మెసేజ్ పంపుతుంది.
  • పునఃప్రారంభించడానికి మళ్లీ #1ని నొక్కండి. దీంతో మీ సేవలు కంటిన్యూ అవుతాయి.
  • ఇక ఏఐ సేవలు వద్దు అనుకుంటే #3ని నొక్కండి. దాన్ని నిర్ధారిస్తూ కూడా మీకు మెసేజ్ వస్తుంది.
  • మీ కాల్ ముగిసిన తర్వాత రికార్డింగ్‌లు, సారాంశాలు, అనువాదాలన్నీ జియో క్లౌడ్‌లో స్టోర్ అవుతాయి. మీకు అవసరమైనప్పుడు ఆ ఫైల్‌ను యాక్సెస్ చేయవచ్చు.

ఎప్పటి నుంచి అంటే..

జియో తీసుకువచ్చిన కొత్త ఫీచర్ ఎప్పటి నుంచి వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందనే విషయంపై సరైన స్పష్టత లేదు. కొన్ని వారాల్లో ఈ సేవను అందుబాటులోకి తెస్తారని భావిస్తున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..
విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..
విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..
కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!
మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!
కూరగాయలు ఫ్రీ.. ఎక్కడంటే.! ఒక్కసారిగా ఎగబడ్డ జనం.
కూరగాయలు ఫ్రీ.. ఎక్కడంటే.! ఒక్కసారిగా ఎగబడ్డ జనం.
రైలు పట్టాలపై గొడుగు వేసుకొని మరీ నిద్రపోయిన వ్యక్తి. చూస్తే షాక్
రైలు పట్టాలపై గొడుగు వేసుకొని మరీ నిద్రపోయిన వ్యక్తి. చూస్తే షాక్