Airtel Wynk Music: ఎయిర్‌టెల్ వినియోగదారులకు షాక్.. త్వరలోనే వింక్ మ్యూజిక్ యాప్ నిలిపివేత

భారతదేశంలో ప్రముఖ టెలికం కంపెనీ అయిన ఎయిర్‌టెల్ మ్యూజిక్ ప్రియులకు షాక్ ఇచ్చింది. ఇప్పటిదాకా వింక్ మ్యూజిక్ యాప్ ద్వారా ఇచ్చిన సేవలను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు ఎయిర్‌టెల్ యూజర్లకు డిఫాల్ట్‌గా అందుబాటులో ఉన్న యాప్‌ను ఈ సంవత్సరం చివరిలో నిలిపివేయనుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

Airtel Wynk Music: ఎయిర్‌టెల్ వినియోగదారులకు షాక్.. త్వరలోనే వింక్ మ్యూజిక్ యాప్ నిలిపివేత
Airtel Wynk
Follow us

|

Updated on: Aug 31, 2024 | 4:45 PM

భారతదేశంలో ప్రముఖ టెలికం కంపెనీ అయిన ఎయిర్‌టెల్ మ్యూజిక్ ప్రియులకు షాక్ ఇచ్చింది. ఇప్పటిదాకా వింక్ మ్యూజిక్ యాప్ ద్వారా ఇచ్చిన సేవలను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు ఎయిర్‌టెల్ యూజర్లకు డిఫాల్ట్‌గా అందుబాటులో ఉన్న యాప్‌ను ఈ సంవత్సరం చివరిలో నిలిపివేయనుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వింక్ మ్యూజిక్ యాప్ చాలా ఏళ్లుగా అందుబాటులో ఉంది. అయితే వింక్ మ్యూజిక్ యాప్‌నకు ప్రధాన ప్రత్యర్థిగా జియో సావన్ యాప్ నిలిచింది. ఈ నేపథ్యంలో వింక్ మ్యూజిక్ యాప్ నిలిపితే గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

ఎయిర్‌టెల్ వింక్ యాప్ ఈ ఏడాది చివరి నాటికి తమ ప్రీమియం బ్రాడ్‌బ్యాండ్, మొబైల్ వినియోగదారులకు మరింత ఆకర్షణీయమైన అవకాశాన్ని అందించడానికి ఇది సరైన సమయం భావిస్తున్నారు. అందువల్ల వింక్ మ్యూజిక్ ఉద్యోగులందరూ ఎయిర్‌టెల్ వివిధ విభాగాల్లో ప్లేస్ చేయనున్నారు. వింక్ ప్రీమియం అనేది ఎయిర్‌టెల్ వినియోగదారులు నెలవారీ రుసుము చెల్లించే మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్. ఎయిర్‌టెల్ తాజాగా తన టీవీ ప్లస్, యాప్ మ్యూజిక్ సేవల కోసం యాపిల్‌తో జత కట్టినందున త్వరలో ఈ సేవలను వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. 

ఎయిర్‌టెల్ వింక్ ప్రీమియం వినియోగదారులను యాపిల్ మ్యూజిక్ వినియోగదారులుగా మార్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే యాపిల్ మ్యూజిక్ ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం ఎలాంటి సేవలను అందిస్తుందో? వేచి చూడాలని చెబుతున్నారు. వింక్ మ్యూజిక్‌ను మొదటగా 2014లో అందుబాటులోకి తీసుకొచ్చారు. దాదాపు పదేళ్ల తర్వాత ఈ యాప్‌ను అధికారికంగా ఎయిర్‌టెల్ నిలిపేసింది. ప్రస్తుతం ఎంపిక చేసిన ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్, బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల కోసం ఎయిర్‌టెల్ యాపిల్ మ్యూజిక్, టీవీ ప్లస్‌ని కూడా ఆఫర్ చేస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో యాపిల్ మ్యూజిక్, టీవీ ప్లస్ యాప్‌లు నెలకు కేవలం రూ. 99 సాధారణ రుసుముతో అందుబాటులో ఉన్నాయి. అయితే ఎయిర్‌టెల్‌తో జతకట్టడం వల్ల యాపిల్ సేవలు ఇతర స్ట్రీమింగ్ దిగ్గజాలతో పోటీపడనున్నాయి. 

హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..
విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..
విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..
కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!
మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!
కూరగాయలు ఫ్రీ.. ఎక్కడంటే.! ఒక్కసారిగా ఎగబడ్డ జనం.
కూరగాయలు ఫ్రీ.. ఎక్కడంటే.! ఒక్కసారిగా ఎగబడ్డ జనం.
రైలు పట్టాలపై గొడుగు వేసుకొని మరీ నిద్రపోయిన వ్యక్తి. చూస్తే షాక్
రైలు పట్టాలపై గొడుగు వేసుకొని మరీ నిద్రపోయిన వ్యక్తి. చూస్తే షాక్