Gmail Tips: హ్యాకర్లు పొంచి ఉన్నారు జాగ్రత్త! మీ జీమెయిల్‌తో ఈ పనులు అస్సలు చేయకండి..
ఓ చిన్న మెయిల్ ని క్లిక్ చేయడం ద్వారా మన వ్యక్తిగత సమాచారం మొత్తం హ్యాకర్లకు చేరిపోతుంది. అందుకే గూగుల్ జీమెయిల్ వినియోగదారుల భద్రతకు అధిక ప్రధాన్యం ఇస్తుంది. అయినప్పుటికీ కొన్ని ప్రమోషనల్ మెసేజ్లు, ఆఫర్లు అంటూ ప్రైవేటు లింకులు మన జీమెయిల్ లో చేరుతుంటాయి.

జీమెయిల్.. దీని గురించి తెలియని వారుండరు. విద్యార్థుల నుంచి ఉద్యోగులు, బిజినెస్ మ్యాన్ ల వరకూ ప్రతి ఒక్కరికీ ఇది ఉపయోగకరమే. ఆఫీషియల్ సమాచారాన్ని షేర్ చేసేందుకు ఈ జీమెయిల్ చాలా ఉపయోగపడుతుంది. అయితే ఇది ప్రయోజనమే దీనివల్ల అంతే ప్రమాదం కూడా పొంచి ఉంది. అది సైబర్ సెక్యూరిటీ విషయంలో. ఎందుకంటే ఓ చిన్న మెయిల్ ని క్లిక్ చేయడం ద్వారా మన వ్యక్తిగత సమాచారం మొత్తం హ్యాకర్లకు చేరిపోతుంది. అందుకే గూగుల్ జీమెయిల్ వినియోగదారుల భద్రతకు అధిక ప్రధాన్యం ఇస్తుంది. 99.9 శాతం స్పామ్, ఫిషింగ్, మాల్వేర్ లను జీ మెయిలే రిజెక్ట్ చేసేస్తోంది. ఇలా రోజుకు దాదాపు 15 బిలియన్ అవాంఛిత మెసేజ్ లను జీమెయిల్ బ్లాక్ చేస్తుంది. అయినప్పుటికీ కొన్ని ప్రమోషనల్ మెసేజ్లు, ఆఫర్లు అంటూ ప్రైవేటు లింకులు మన జీమెయిల్ లో చేరుతుంటాయి. అటువంటి సమయంలో మనం ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. మరి మీ జీమెయిల్ ని భద్రంగా ఉంచుకోడానికి మీరు కొన్ని టిప్స్ తెలుసుకోవాలి.. అవేంటో ఓసారి చూద్దాం..
వ్యక్తిగత సమాచారం అడగదు..
సాధారణంగా గూగుల్ ఎప్పుడూ వినియోగదారుల వ్యక్తిగత సమాచారం అడగదు. గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడే కావాల్సిన వివరాలను తీసుకుంటుంది. కానీ ఎప్పుడైన ఈమెయిల్ లో మీ వ్యక్తిగత వివరాలు కావాలని ఏదైనా మెయిల్ వస్తే దానిలోని లింక్స్ క్లిక్ చేస్తే మీరు హ్యాకర్ల చేతిలో పడే అవకాశం ఉంది. అందుకే ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి.
ఈ సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దు..
- మీ బ్యాంకు, సోషల్ మీడియాకు సంబంధించిన యూజర్ నేమ్, పాస్ వర్డ్ వంటి వివరాలు ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు.
- మీ సోషల్ సెక్యూరిటీ నంబర్ ను బయటపెట్టొద్దు.
- బ్యాంకు అకౌంట్ నంబర్లు కూడా మీకు మాత్రమే తెలిసి ఉండేటట్లు చూసుకోవాలి.
- పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్స్(పిన్) లను ఎవరితోనూ షేర్ చేయొద్దు.
- క్రెడిట్ నంబర్లు కూడా ఎవరికి చెప్పొద్దు.
- అలాగే మీ తల్లి మొదటి పేరు అసలు చెప్పొద్దు.
- మీ పుట్టిన రోజును కూడా ఎవరితోనూ షేర్ చేయొద్దు.
- మీ మెయిల్ చేసిన వ్యక్తి ఎవరైనా మీ వ్యక్తి గత సమాచారాన్ని షేర్ చేయొద్దు.
- అలాగే మెయిల్ కి వచ్చే అవాంఛిత లింక్స్ పై క్లిక్ చేయవద్దు. అటాచ్ మెంట్స్ ని కూడా డౌన్ లోడ్ చేయవద్దు.
అనుమానాస్పద మెయిల్ వస్తే..
మీ మెయిల్ కి ఏదైనా అనుమానాస్పద లింక్ గానీ, అటాచ్ మెంట్ గానీ మెయిల్ రూపంలో వస్తే మీరు ఈ విషయాలను గుర్తుచుకోవాలి. అనుమానాస్పద మెయిల్ వస్తే వెంటనే దానిని రిపోర్ట్ చేయాలి అలా కాకుండా పొరపాటున అనుమానాస్పద మెయిల్ కు మీరు మీ సమాచారాన్ని అందించారని అనుకుందాం. అయితే మీరు వెంటనే మీరు షేర్ చేసిన సమాచారానికి అనుబంధంగా ఉన్న బ్యాంకు ఖాతాలు,క్రెడిట్ కార్డులను తనిఖీ చేసుకోవాలి. ఏదైనా లావాదేవీలు జరిగాయేమో సరిచూసుకోవాలి. ఒకవేళ మీకు సంబంధం లేకుండా అకౌంట్ లో లావాదేవీలు జరిగినట్లు గుర్తిస్తే వెంటనే బ్యాంకుకు సమచారం ఇవ్వాలి. అలాగే వెంటనే మీ అన్ని ఖాతాల పాస్ వర్డ్ లను మార్చేయాలి.



మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..