Alert For Chrome Users: గూగుల్ క్రోమ్ యూజర్లకు భారత ప్రభుత్వ హెచ్చరిక.. ఆ పని చేయకపోతే ఇక అంతే..!
ముఖ్యంగా గూగుల్‌కు ప్రముఖ సెర్చ్ ఇంజిన్‌గా పేరు రావడంతో అందరూ యూజర్ ఫ్రెండ్లీగా ఉండే క్రోమ్ బ్రౌజర్‌నే వాడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్‌టీ-ఐఎన్) గూగుల్ క్రోమ్ వినియోగదారులకు హెచ్చరిక జారీ చేసింది. అత్యంత జనాదరణ పొందిన క్రోమ్ బ్రౌజర్‌ను అప్‌డేట్ చేసుకోకపోతే యూజర్లు ఇబ్బందిపడతారని పేర్కొంది. ముఖ్యంగా మన పరికరాలపై నియంత్రణ సాధించడం, సున్నితమైన సమాచారాన్ని దొంగిలించడం లేదా కార్యకలాపాలకు అంతరాయం కలిగించడం వంటి వివిధ హానికరమైన చర్యలను నిర్వహించడానికి రిమోట్ అటాకర్ ద్వారా ప్రయత్నించే అవకాశం ఉందని తెలిపింది.
ప్రస్తుత రోజుల్లో సమస్త ప్రపంచం అరచేతిలోనే అనే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లు వినియోగం పెరగడంతో ప్రతి చిన్న అవసరానికి వాటిపై ఆధారపడే పరిస్థితి వచ్చింది. స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్‌పై పని చేస్తాయి. ఈ సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసే గూగుల్ ప్రతి ఫోన్‌లో ఇన్‌బుల్ట్‌గా కొన్ని యాప్స్ ఇస్తుంది. ముఖ్యంగా బ్రౌజింగ్ కోసం అందరూ ఇన్‌బుల్ట్‌గా వచ్చే గూగుల్ క్రోమ్‌నే వాడడానికి ఇష్టపడుతున్నారు. అలాగే పీసీలు, ల్యాప్‌టాప్‌ల్లో కూడా క్రోమ్ బ్రౌజర్‌ను వాడుతున్నారు. ముఖ్యంగా గూగుల్‌కు ప్రముఖ సెర్చ్ ఇంజిన్‌గా పేరు రావడంతో అందరూ యూజర్ ఫ్రెండ్లీగా ఉండే క్రోమ్ బ్రౌజర్‌నే వాడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్‌టీ-ఐఎన్) గూగుల్ క్రోమ్ వినియోగదారులకు హెచ్చరిక జారీ చేసింది. అత్యంత జనాదరణ పొందిన క్రోమ్ బ్రౌజర్‌ను అప్‌డేట్ చేసుకోకపోతే యూజర్లు ఇబ్బందిపడతారని పేర్కొంది. ముఖ్యంగా మన పరికరాలపై నియంత్రణ సాధించడం, సున్నితమైన సమాచారాన్ని దొంగిలించడం లేదా కార్యకలాపాలకు అంతరాయం కలిగించడం వంటి వివిధ హానికరమైన చర్యలను నిర్వహించడానికి రిమోట్ అటాకర్ ద్వారా ప్రయత్నించే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా దాడి చేసే వ్యక్తి ఏకపక్ష కోడ్‌ని అమలు చేయడానికి, సర్వీస్ (డీఓఎస్) షరతును తిరస్కరించడానికి, సిస్టమ్‌లోని సున్నితమైన సమాచారాన్ని తస్కరించవచ్చని తెలిపింది. ఈ తాజాగా హెచ్చరికపై మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ప్రమాదం ఇలా
గూగుల్ క్రోమ్ అనేది మిలియన్ల మంది ప్రజలు ఉపయోగించే ఒక ప్రసిద్ధ వెబ్ బ్రౌజర్. అయినప్పటికీ ఏదైనా సంక్లిష్ట సాఫ్ట్‌వేర్ లాగా, దాని కోడ్‌లో దుర్బలత్వం లేదా బలహీనతలు ఉండవచ్చు. ముఖ్యంగా హ్యాకర్లు వారి సొంత లాభం కోసం దోపిడీ చేయడానికి ప్రయత్నించవచ్చు. యూజ్ ఆఫ్టర్ ఫ్రీ అనే ఫీచర్ ద్వారా కొన్ని సెక్యూరిటీ సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే అవుట్ ఆఫ్ బౌండ్స్ ద్వారా సీసీఎస్, వీ8 (జావాస్క్రిప్ట్ ఇంజిన్) ఫాంట్‌ల భాగాల ద్వారా కూడా భద్రతా సమస్యలు రావచ్చు. ముఖ్యంగా ఇది మన సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేసే అవకాశం ఉంది. ప్రత్యేకంగా రూపొందించిన అభ్యర్థనలను పంపడం ద్వారా క్రోమ్ బ్రౌజర్ కోడ్‌లోని బలహీనతలను ఉపయోగించుకోవడానికి రిమోట్ దాడి చేసే వ్యక్తిని అనుమతించవచ్చు. ఇది దాడి చేసే వ్యక్తి బాధితురాలి కంప్యూటర్‌ను నియంత్రించడానికి, వారి డేటాను దొంగిలించడానికి లేదా మాల్వేర్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి అనుమతిస్తుంది.
ప్రభావిత సాఫ్ట్‌వేర్
ముఖ్యంగా విండోస్ వినియోగదారులు 116.0.5845.110/.111కి ముందున్న క్రోమ్ వెర్షన్‌లను ప్రభావితం చేస్తుంది. అలాగే మ్యాక్, లినక్స్‌లో 116.0.5845.110కి ముందు ఉన్న గూగుల్ క్రోమ్ వెర్షన్లు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.
రక్షణ చర్యలివే
ఈ ప్రమాదాలను తగ్గించడానికి సీఈఆర్‌టీ-ఇన్ వారి వెబ్ బ్రౌజర్‌లు, ఇతర సాఫ్ట్‌వేర్‌లను తాజా భద్రతా ప్యాచ్‌లతో తాజాగా ఉంచాలని గూగుల క్రోమ్ వినియోగదారులకు సలహా ఇస్తుంది. భద్రతను బలోపేతం చేయడానికి బ్రౌజర్ డెవలపర్ గూగుల్ ఇప్పటికే తాజా నవీకరణలను విడుదల చేసింది. స్టేబుల్, ఎక్స్‌టెండెడ్ స్టేబుల్ ఛానెల్‌లు, మ్యాక్, లినక్స్ కోసం 116.0.5845.110కి, విండోస్ కోసం 116.0.5845.110/.111కి అప్‌డేట్ చేశారు. ఈ తాజా అప్‌డేట్స్ కొన్ని రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయడంతో పాటు హానికరమైన కోడ్‌ను ఎదుర్కొనే ప్రమాదాన్ని తగ్గించడానికి ముఖ్యంగా అనుమానాస్పద లేదా అవిశ్వసనీయమైన వెబ్‌సైట్‌లను సందర్శించేటప్పుడు వినియోగదారులు జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..