Google Play Store App: నకిలీ యాప్‌‌లకు చెక్ పెట్టేందుకు.. గూగుల్ ప్లే స్టోర్ కొత్త మార్గదర్శకాలు..!

|

May 03, 2021 | 11:21 AM

Google Play Store App: టెక్నాలజీ రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. కొత్త కొత్త యాప్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. అదే అదనుగా వాటితో పాటు నకిలీ యాప్స్‌ కూడా పుట్టుకొస్తున్నాయి..

Google Play Store App: నకిలీ యాప్‌‌లకు చెక్ పెట్టేందుకు.. గూగుల్ ప్లే స్టోర్ కొత్త మార్గదర్శకాలు..!
Google Play Store
Follow us on

Google Play Store App: టెక్నాలజీ రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. కొత్త కొత్త యాప్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. అదే అదనుగా వాటితో పాటు నకిలీ యాప్స్‌ కూడా పుట్టుకొస్తున్నాయి. నిజమైన యాప్స్‌ ఏవో.. నకిలీవేవో తెలియని పరిస్థితి ఉంది. అవి తెలుసుకునేందుకు వీలు లేకుండా యాప్స్‌‌ను క్రియేట్‌‌ చేస్తున్నారు హ్యాకర్లు. అంతేకాకుండా కొన్ని స్పామ్‌‌ యాప్స్‌‌ కూడా సృష్టిస్తున్నారు. అలాంటి వాళ్లకు చెక్‌‌ పెట్టేందుకు గూగుల్‌‌ కీలక నిర్ణయం తీసుకుంటోంది.

ఈ నేపథ్యంలో గూగుల్‌ ప్లే స్టోర్‌‌‌‌ కొత్త గైడ్‌‌లైన్స్ తీసుకురానుంది. ఈ గైడ్‌‌లైన్స్‌‌ 2021 చివరి నాటికి అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు గూగుల్ తెలిపింది. యాప్‌‌ టైటిల్‌‌ను 30 క్యారెక్టర్లకు తగ్గిస్తుంది. అంతేకాకుండా యాప్‌‌‌‌ పనితీరును సూచించే కీ వర్డ్స్‌‌ను నిషేధిస్తుందట. ఐకాన్‌‌లో డెవలపర్‌‌‌‌ ప్రమోషన్‌‌ పేరును తొలగించనుంది. వినియోగదారులను తప్పుదారి పట్టించేలా యాప్‌‌ ఐకాన్‌‌పై ఇచ్చే గ్రాఫిక్స్‌‌ను కూడా నిషేధిస్తున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటుగా క్యాపిటల్‌‌ ఫాంట్స్‌‌ వాడకాన్ని, యాప్‌‌ పేరులో ఎమోజీలను వాడకూడదని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలను‌ పాటించని యాప్స్‌‌ను గూగుల్‌‌ ప్లే స్టోర్‌‌‌‌లోకి అనుమతించబోమని స్పష్టం చేసింది. లిస్టింగ్‌‌ ప్రివ్యూవ్‌‌కి సంబంధించి కూడా కొత్త ఎసెట్‌‌ గైడ్‌‌లైన్స్‌‌ విడుదల చేసింది. ఆ యాప్‌‌ను యూజర్స్‌‌ ఇన్‌‌స్టాల్‌‌ చేసుకోవచ్చా? లేదా? అనే విషయానికి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని యాప్‌‌ డెవలపర్స్‌‌కు సూచించింది. అలాగే ప్రివ్యూవ్‌‌ ఎసెట్స్‌‌ కూడా జనాలకు అర్థమయ్యే విధంగా ఉండాలని గూగుల్‌ తెలియజేసింది. 2021 చివరి కల్లా ఈ గైడ్‌‌లైన్స్‌‌ అమల్లోకి వస్తాయని గూగుల్‌ తెలిపింది. దీనిపై మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది.

ఇవీ చదవండి:

Google Maps: కొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోన్న గూగుల్ మ్యాప్స్.. తక్కువ ఇంధనం ఖర్చయ్యే మార్గం

Google Image: గూగుల్‌లో నకిలీ ఫోటోలను గుర్తించడం ఎలా..? చిన్న ట్రిక్స్‌ ద్వారా తెలుసుకోవచ్చు..!