AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google for India 2023: సామాన్య ప్రజల కోసం గూగుల్‌ సూపర్‌ యాప్‌.. ఆవిష్కరించిన కేంద్ర మంత్రి.. ఫీచర్లు ఇవే..

సామాన్య ప్రజలకు ఉపయోగపడేలా గూగుల్‌ ఒక సూపర్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యాక్సిస్‌ మై ఇండియా సహకారంతో రూపొందిన ఈ యాప్‌ను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) మంత్రి అశ్విని వైష్ణవ్ ఆవిష్కరించారు. గూగుల్‌ ఫర్‌ ఇండియా 2023 ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన ఈ సూపర్‌ యాప్‌ను ఆవిష్కరించారు. ఆర్టీఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సహకారంతో గూగుల్‌ ఈ యాప్‌ను రూపొందించింది.

Google for India 2023: సామాన్య ప్రజల కోసం గూగుల్‌ సూపర్‌ యాప్‌.. ఆవిష్కరించిన కేంద్ర మంత్రి.. ఫీచర్లు ఇవే..
Minister Ashwini Vaishnaw
Basha Shek
|

Updated on: Oct 21, 2023 | 1:07 PM

Share

సామాన్య ప్రజలకు ఉపయోగపడేలా గూగుల్‌ ఒక సూపర్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యాక్సిస్‌ మై ఇండియా సహకారంతో రూపొందిన ఈ యాప్‌ను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) మంత్రి అశ్విని వైష్ణవ్ ఆవిష్కరించారు. గూగుల్‌ ఫర్‌ ఇండియా 2023 ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన ఈ సూపర్‌ యాప్‌ను ఆవిష్కరించారు. ఆర్టీఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సహకారంతో గూగుల్‌ ఈ యాప్‌ను రూపొందించింది. ఈ సూపర్ యాప్‌కి లాగిన్ చేయడానికి, మీరు మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. ఈ యాప్ ప్రజలకు ప్రభుత్వ పథకాలు, ఇతర సేవల గురించి సమస్త సమాచారాన్ని అందిస్తుంది. యాక్సిస్ మై ఇండియా, గూగుల్ సంయుక్తంగా తయారు చేసిన ఈ యాప్ ప్రత్యేకత ఏంటంటే.. ఈ యాప్‌లో వాయిస్ యాక్టివేటెడ్ పర్సనల్ అసిస్టెంట్ సదుపాయం ఉంటుంది. ఇది మాత్రమే కాదు, ఈ యాప్ ద్వారా మీరు ఆయుష్మాన్ భారత్, వ్యవసాయం, ప్రభుత్వ పథకాలు, ఉపాధితో సహా అనేక విషయాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు.

ఉదాహరణకు, ఈ యాప్ సహాయంతో మన సమీపంలో ఏయే ఆయుష్మాన్ భారత్ హాస్పిటల్స్ ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు. అలాగే రైతులు ఈ యాప్ ద్వారా తమ పంటలకు కనీస మద్దతు ధర ఎక్కడ లభిస్తుందో కనుక్కోవచ్చు. ఈ సూపర్‌ యాప్‌ మరో స్పెషాలిటీ ఏంటంటే.. మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్‌తో రూపొందడం. ఈ యాప్ సాధారణ ప్రజల సౌలభ్యం కోసం తయారు చేశారు కాబట్టి 13 విభిన్న భాషలలో ఈ యాప్‌ పనిచేస్తుంది. అంటే మనకు ఇష్టమైన భాషలో సమాచారాన్ని పొందవచ్చు. కాగా ఈ సూపర్‌ యాప్‌ గురించి కేంద్ర మంత్రి అ శ్విని వైష్ణవ్‌ ట్వీట్‌ చేశారు.

13 భాషల్లో అందుబాటులోకి..

కాగా.. న్యూఢిల్లీలో జరిగిన తొమ్మిదవ వార్షిక గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్‌లో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నట్లు కంట్రీ హెడ్ అండఖ వైస్ ప్రెసిడెంట్, గూగుల్ ఇండియా.. సంజయ్ గుప్తా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్‌లో తాము కొత్త ఉత్పాదక AI-ఆధారిత లాంచ్‌లు, భాగస్వామ్యాలు, పెట్టుబడులను ప్రకటించామన్నారు.

సుందర్ పిచాయ్ ట్వీట్..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..