AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google Chrome: గూగుల్ క్రోమ్ ఇక పై మరింత సురక్షితం.. అనవసర ఫైళ్ళు డౌన్ లోడ్ చేయకుండా వార్నింగ్ అలారం!

Google Chrome: మనం ఇంటర్నెట్ వినియోగంలో గూగుల్ క్రోమ్ మీద ఎక్కువ ఆధారపడటం జరుగుతుంది. అయితే గూగుల్ బ్రౌజ్ చేసినపుడు కొన్ని సార్లు అనుకోకుండా అనవసరమైన ఫైల్స్ డౌన్ లోడ్ అవుతూ ఉంటాయి.

Google Chrome: గూగుల్ క్రోమ్ ఇక పై మరింత సురక్షితం.. అనవసర ఫైళ్ళు డౌన్ లోడ్ చేయకుండా వార్నింగ్ అలారం!
Google Chrome
KVD Varma
|

Updated on: Jun 05, 2021 | 2:56 PM

Share

Google Chrome: మనం ఇంటర్నెట్ వినియోగంలో గూగుల్ క్రోమ్ మీద ఎక్కువ ఆధారపడటం జరుగుతుంది. అయితే గూగుల్ బ్రౌజ్ చేసినపుడు కొన్ని సార్లు అనుకోకుండా అనవసరమైన ఫైల్స్ డౌన్ లోడ్ అవుతూ ఉంటాయి. ఇది అందరికీ అనుభవమే. ఒక్కోసారి అనుకోకుండా ప్రకటనల వద్ద ఉన్న లింక్ క్లిక్ చేసేస్తాం. దానితో మనకు అర్ధంకాని, అసలు పరిచయం లేని ఫైల్స్ డౌన్ లోడ్ అయిపోతాయి. వీటితో చాలా ప్రమాదం ఉంటుంది. ఒక్కోసారి అవి నేరుగా మన బ్రౌజర్ ఆప్షన్స్ కూడా మార్చేస్తాయి. పనికిరాని.. అవసరం లేని ఎక్స్టెన్షన్స్ బ్రౌసర్ లో క్రియేట్ అయిపోతాయి. ఇవి మన పర్సనల్ సమాచారాన్ని దొంగిలించే అవకాశమూ ఉంది. అలాగే, వైరస్ ను మన సిస్టంలో కూచో పెట్టె చాన్సూ ఉంది. కాబట్టి ఇటువంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతారు.

ఇప్పుడు ఇటువంటి ఇబ్బందిని తొలగించడానికి గూగుల్ క్రోమ్ కొత్తగా ఒక విధానాన్ని తీసుకువచ్చింది. దీనితో మనకు పనికిమాలిన లేదా చెడు చేసే ఫైల్స్ డౌన్ లోడ్ కాకుండా చెక్ పెట్టొచ్చు. క్రోమ్ లో ఏదైనా ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయడానికి లేదా ఇన్‌స్టాల్ చేయడానికి ముందు ఇప్పుడు గూగుల్ హెచ్చరికలు ఇస్తుంది. ఇది సురక్షితమైన బ్రౌజింగ్‌లో మనకు సహాయపడుతుంది. తప్పు ఫైల్ డౌన్‌లోడ్ చేయబడితే అలారం..

మీరు ఫైల్‌ను డౌన్‌లోడ్ చేశారని అనుకుందాం. ఇది హానికరం. కాబట్టి దీన్ని మొదట గూగుల్ లో స్కాన్ చేయమని క్రోమ్ అడుగుతుంది. అప్పుడు ఇది గూగుల్ సేఫ్ బ్రౌజింగ్ ద్వారా విశ్లేషణ కోసం పంపబడుతుంది. మీకు/మీ కంప్యూటర్ కు హాని కలిగించే డేటా ఫైల్‌లో కనబడితే అది మీకు అలారం మోగిస్తుంది. ఆ ఫైల్ సురక్షితం కాదని మీకు చెబుతుంది. అలా అని అన్ని ఫైళ్ళూ కచ్చితంగా స్కాన్ చేయాలని ఏమీ లేదు. కానీ, చేయడం వలన మీకు మంచే జరుగుతుంది.

క్రోమ్ 91 వినియోగదారులందరికీ గూగుల్ ఈ క్రొత్త వ్యవస్థ అందుబాటులోకి తెచ్చింది. ఇది సురక్షితమైన బ్రౌజింగ్‌కు సహాయపడుతుంది. మీ ఆండ్రాయిడ్ పరికరంలో దీన్ని ఎనేబుల్ చేయడానికి, మీరు సెట్టింగ్‌లు> గోప్యత మరియు భద్రత> లోకి వెళ్లి చేసుకోవచ్చు. అలాగే PC లో భద్రత మరియు సెట్టింగ్‌లు> గోప్యత మరియు భద్రత> ప్రాసెస్‌లో సురక్షితం అనే ఆప్షన్ వద్దకు వెళ్లి దీనిని ఎనేబుల్ చేసుకోవచ్చు.

Also Read: Google Earbuds: గూగుల్ నుంచి స‌రికొత్త వైర్‌లైస్ ఇయ‌ర్‌బ‌డ్స్‌.. ఫీచ‌ర్లు చూస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే..

e-mail సృష్టికర్త మనోడే తెలుసా..! ఎందు కోసం.? ఎవరి కోసం తయారు చేశాడో తెలుసా.?