CMF Phone-1: యూత్‌కు గుడ్ న్యూస్.. ఫ్రీగా నథింగ్ నయా సీఎంఎఫ్-1 ఫోన్ మీ సొంతం

|

Jul 07, 2024 | 4:17 PM

ఇటీవల కాలంలో భారతదేశంలో స్మార్ట్ ఫోన్లతో స్మార్ట్ యాక్ససరీస్ హవా పెరిగింది. ముఖ్యంగా యువత వీడి వాడకాన్ని అధికంగా ఇష్టపడుతున్నారు. కాబట్టి యువతను ఆకట్టుకునేందుకు సూపర్ ఫీచర్స్‌తో చాలా కంపెనీలు తమ ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. అవి యువతకు చేరువ చేసేందుకు వివిధ ఆఫర్లను పెడుతున్నాయి. తాజాగా సీఎంఎఫ్ బై నథింగ్ తన రాబోయే ఉత్పత్తుల కోసం ప్రత్యేకమైన స్టూడెంట్ రెఫరల్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది.

CMF Phone-1: యూత్‌కు గుడ్ న్యూస్.. ఫ్రీగా నథింగ్ నయా సీఎంఎఫ్-1 ఫోన్ మీ సొంతం
Cmf Phone 1 By Nothing
Follow us on

ఇటీవల కాలంలో భారతదేశంలో స్మార్ట్ ఫోన్లతో స్మార్ట్ యాక్ససరీస్ హవా పెరిగింది. ముఖ్యంగా యువత వీడి వాడకాన్ని అధికంగా ఇష్టపడుతున్నారు. కాబట్టి యువతను ఆకట్టుకునేందుకు సూపర్ ఫీచర్స్‌తో చాలా కంపెనీలు తమ ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. అవి యువతకు చేరువ చేసేందుకు వివిధ ఆఫర్లను పెడుతున్నాయి. తాజాగా సీఎంఎఫ్ బై నథింగ్ తన రాబోయే ఉత్పత్తుల కోసం ప్రత్యేకమైన స్టూడెంట్ రెఫరల్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. సీఎంఎఫ్ ఫోన్ 1, బడ్స్ ప్రో 2, వాచ్ ప్రో 2పై ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ప్రోగ్రామ్ ఎంపిక చేసిన వినియోగదారులకు సీఎంఎఫ్ ఉత్పత్తులను ఉచితంగా అందిస్తుంది. సీఎంఎఫ్ తమ ఉత్పత్తులను జూలై 8న ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో సీఎంఎఫ్ రిఫరల్ ప్రోగ్రామ్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

సీఎంఎఫ్ రిఫరల్ ప్రోగ్రామ్‌లో పాల్గొనాలంటే https://in.cmfstudentreferral.tech/కు లాగిన్ అవ్వాలి. అనంతరం మీ వివరాలను పూరించి, ధ్రువీకరించాలి. ధృవీకరణ పూర్తయిన తర్వాత పాయింట్‌లను సంపాదించడం ప్రారంభించడానికి మీ స్నేహితులతో భాగస్వామ్యం చేయడానికి ఒక ప్రత్యేక కోడ్ వస్తుంది. లాగిన్ అయినప్పుడు స్నేహితుడి రెఫరల్ కోడ్‌ని ఉపయోగించడం వల్ల మీ స్కోర్‌కి, లీడర్‌బోర్డ్‌లో వారి స్కోర్‌కి బోనస్ పాయింట్ యాడ్ అవుతుంది. లీడర్‌బోర్డ్‌లోని టాప్  50 మంది విద్యార్థులు కొత్త సీఎంఎఫ్ లైనప్ నుండి 10 సీఎంఎఫ్ ఫోన్ 1లు, 20 బడ్స్ ప్రో 2లు, 20 వాచ్ ప్రో 2లో ఒకదాన్ని గెలుచుకోవవచ్చు.  దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు తమ తోటివారితో పంచుకోవడానికి ప్రత్యేకమైన రిఫరల్ కోడ్‌ను స్వీకరించడానికి అంకితమైన మైక్రోసైట్‌లో నమోదు చేసుకోవచ్చని కంపెనీ ధ్రువీకరించింది. ప్రతి విజయవంతమైన రిఫరల్ కోసం, రెఫరర్, సూచించిన విద్యార్థి ఇద్దరూ లీడర్‌బోర్డ్‌లో పాయింట్‌లను పొందుతారు.

నథింగ్ ఇండియా ప్రెసిడెంట్ విశాల్ భోలా మాట్లాడుతూ భారతదేశం అంతటా ఉన్న విద్యార్థులకు ఈ ప్రత్యేక అవకాశాన్ని అందించడంచాలా ఆనందంగా ఉందన్నారు. ఈ రెఫరల్ ప్రోగ్రామ్ మా తాజా సీఎంఎఫ్ ఉత్పత్తులను పరిచయం చేయడానికి ఒక మార్గం మాత్రమే కాదని, తమ కంపెనీ కమ్యూనిటీని బలోపేతం చేయడానికి మరియు నిర్మించడానికి చేసిన ప్రయత్నమని తెలిపారు. సీఎంఎఫ్ ఫోన్ 1 ధర రూ. 20,000 కంటే తక్కువగా ఉండవచ్చని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే దాని ప్రీమియం ఫోన్‌లను రూ. 30,000 నుంచి రూ. 50,000 లోపు విక్రయించడం లేదు. సీఎంఎఫ్ ఫోన్ 6జీబీ+128 జీబీ, 8 జీబీ + 128 జీబీ  వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..