Tech Tips: ఈ సింపుల్ టిప్‌తో వైఫై పాస్‌వర్డ్‌ ఇట్టే తెలుసుకోవచ్చు.. స్టెప్‌ బై స్టెప్‌ ప్రాసెస్‌..

Tech Tips: ప్రస్తుతం ఇంటర్‌నెట్‌ వినియోగం అనివార్యంగా మారిపోయింది. ప్రతీ ఒక్కరూ స్మార్ట్‌ ఫోన్‌ వాడడం, నెట్‌ లేకపోతే పని జరిగే పరిస్థితి లేకపోవడంతో మొబైల్‌లో ఇంటర్‌నెట్‌ తప్పనిసరిగా మారింది...

Tech Tips: ఈ సింపుల్ టిప్‌తో వైఫై పాస్‌వర్డ్‌ ఇట్టే తెలుసుకోవచ్చు.. స్టెప్‌ బై స్టెప్‌ ప్రాసెస్‌..
Wifi Password
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 18, 2022 | 10:58 AM

Tech Tips: ప్రస్తుతం ఇంటర్‌నెట్‌ వినియోగం అనివార్యంగా మారిపోయింది. ప్రతీ ఒక్కరూ స్మార్ట్‌ ఫోన్‌ వాడడం, నెట్‌ లేకపోతే పని జరిగే పరిస్థితి లేకపోవడంతో మొబైల్‌లో ఇంటర్‌నెట్‌ తప్పనిసరిగా మారింది. ఇక బ్రాడ్‌ బ్యాండ్ ఇంటర్‌నెట్‌ వాడుతోన్న వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. ప్రతీ ఇంట్లో వైఫై వాడకం పెరుగుతోంది. దీంతో ఎక్కడికి వెళ్లినా వైఫై దర్శనమిస్తోంది. కొత్తగా ఎవరింటికైనా వెళ్లినా మంచి నీళ్లు అడిగే కంటే ముందు వైఫై పాస్‌వర్డ్‌ చెబుతారా? అంటున్నారు. అయితే పాస్‌వర్డ్ నేరుగా చెప్పకుండా వాళ్లే టైప్‌ చేసి ఇవ్వడం మీలో చాలా మంది చూసే ఉంటారు.

మరి సీక్రెట్‌గా మీ ఫోన్‌లో ఎంటర్ చేసిన పాస్‌వర్డ్‌ ఏంటనేదాన్ని కూడా తెలుసుకోవచ్చనే విషయం మీకు తెలుసా.? ఇందుకోసం ఒక సింపుల్‌ టిప్‌ అందుబాటులో ఉంది. ఈ టిప్‌తో మీరు వాడుతోన్న వైఫై పాస్‌వర్డ్‌ ఏంటో తెలుసుకోవచ్చు. దీని ద్వారా ఇతరులతో ఆ పాస్‌వర్డ్‌ను షేర్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంతకీ వైఫై పాస్‌వర్డ్‌ను తెలుసుకోవడానికి ఫాలో కావాల్సిన టిప్స్‌ ఏంటంటే..

* ముందుగా నోటిఫికేషన్‌ బార్‌లో కనిపించే వైఫై సింబల్‌ను లాంగ్‌ ప్రెస్‌ చేయాలి.

ఇవి కూడా చదవండి

* అనంతరం మీరు కనెక్ట్‌ అయి ఉన్న వైఫై పేరు పక్కన ఉన్న సెట్టింగ్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి.

* ఇలా క్లిక్‌ చేయగానే స్క్రీన్‌లో లెఫ్ట్‌ సైడ్‌ కింద క్యూఆర్‌ కోడ్‌ బటన్‌ కనిపిస్తుంది. దాన్ని నొక్కగానే క్యూఆర్‌ కోడ్‌ ఓపెన్‌ అవుతుంది.

* తర్వాత ఆ క్యూఆర్‌ కోడ్‌ను స్క్రీన్‌ షాట్‌ తీసుకోవాలి.

* అనతరం ఫోన్‌లో ఉండే గూగుల్‌ లెన్స్‌ను క్లిక్‌ చేసి క్యూఆర్‌ కోడ్ ఫొటోను అందులోకి అప్‌లోడ్‌ చేయాలి.

* వెంటనే వైఫై పాస్‌వర్డ్‌ కనిపిస్తుంది.

మీ టిప్‌ను ఉపయోగించి ఎదుటి వారు ఏ పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేశారనే విషయంతో పాటు, మీ సొంత వైఫై పాస్‌వర్డ్‌ను మర్చిపోయినా సింపుల్‌గా తెలుసుకోవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..