Instagram: ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లకు అదిరిపోయే ఫీచర్‌.. ఇకపై రీల్స్‌ను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయడం మరింత సులువు..

Instagram: సోషల్‌ మీడియా సైట్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఓ సంచలనం. అత్యంత తక్కువ సమయంలో ఎక్కువ మంది ఫాలోవర్లను సొంతం చేసుకున్న సోషల్‌ మీడియా సైట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌ పేరు తెచ్చుకుంది...

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లకు అదిరిపోయే ఫీచర్‌.. ఇకపై రీల్స్‌ను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయడం మరింత సులువు..
Instagram
Follow us

|

Updated on: Aug 18, 2022 | 10:11 AM

Instagram: సోషల్‌ మీడియా సైట్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఓ సంచలనం. అత్యంత తక్కువ సమయంలో ఎక్కువ మంది ఫాలోవర్లను సొంతం చేసుకున్న సోషల్‌ మీడియా సైట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌ పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా యంగ్‌ జనరేషన్‌ అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొచ్చే ఇన్‌స్టా రోజురోజుకీ యూజర్లను పెంచుకుంటూ పోతోంది. టిక్‌టాక్‌ బ్యాన్‌ అనంతరం ఇన్‌స్టా తీసుకొచ్చిన రీల్స్‌ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఫీచర్‌కు భారీ క్రేజ్‌ దక్కింది.

ఇదిలా ఉంటే రీల్స్‌లో మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి ఫేస్‌బుక్‌కు రీల్స్‌ను క్రాస్ పోస్టింగ్‌ చేసుకునే అవకాశం కల్పించనుంది. అంతేకాకుండా రీల్స్‌ కొత్త ఫీచర్లు, అప్‌డేట్స్‌ను విడుదల చేయనున్నారు. ఈ కొత్త ఫీచర్‌ ద్వారా కేవలం ఒకే బటన్‌ నొక్కడం ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి ఫేస్‌బుక్‌కు రీల్స్‌ క్రాస్‌ పోస్ట్‌ చేసుకునే అవకాశం లభిస్తుంది. అలాగే స్టోరీస్‌లో పాపులరైన ‘యాడ్‌ యువర్స్‌ స్టిక్కర్‌’ ఫీచర్‌ను రీల్స్‌లోనూ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్లను త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..