AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flipkart Delivery: పది నిమిషాల్లోనే ఫ్లిప్‌కార్ట్ ఆర్డర్ మీ చేతుల్లోకి.. ఇక ఆ కంపెనీలకు గట్టి పోటీ

ప్రస్తుత కాలంలో ఈ-కామర్స్ రంగం వృద్ధి చెందడంతో మనకు కావాల్సిన వస్తువు మన ఇంటికే వచ్చేస్తుంది. అంతే కాకుండా స్విగ్గీ, జొమాటో వంటి యాప్స్ ద్వారా మనకు కావాల్సిన ఆహారం కూడా నిమిషాల్లోనే మన ఇంటికే వస్తుంది. ముఖ్యంగా స్విగ్గీకు చెందిన ఇన్‌స్టామర్ట్, అలాగే బ్లింక్ ఇట్, జెప్టో వంటి యాప్స్ ద్వారా మనకు కావాల్సిన కిరాణా కూడా గంటల్లోనే ఇంటికి చేరుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో భారతదేశంలో ప్రముఖ ఈ-కామర్స్ యాప్‌గా గుర్తింపు పొందిన ఫ్లిప్‌కార్ట్ కూడా పది నిమిషాల్లోనే ఆర్డర్‌ను కస్టమర్‌కు డెలివరీ ఇచ్చేందుకు సిద్ధం అవుతుంది.

Flipkart Delivery: పది నిమిషాల్లోనే ఫ్లిప్‌కార్ట్ ఆర్డర్ మీ చేతుల్లోకి.. ఇక ఆ కంపెనీలకు గట్టి పోటీ
Flipkart Sale
Nikhil
|

Updated on: Aug 07, 2024 | 10:26 PM

Share

ఇటీవల కాలంలో పెరిగిన టెక్నాలజీ వల్ల ప్రజలకు కొత్త తరహా సేవలు అందుబాటులోకి వచ్చాయి. గతంలో షాపింగ్ చేయాలంటే పదుల కొద్దీ షాపులను తిరిగితే కానీ మనకు నచ్చిన వస్తువు దొరికేది కాదు. కానీ ప్రస్తుత కాలంలో ఈ-కామర్స్ రంగం వృద్ధి చెందడంతో మనకు కావాల్సిన వస్తువు మన ఇంటికే వచ్చేస్తుంది. అంతే కాకుండా స్విగ్గీ, జొమాటో వంటి యాప్స్ ద్వారా మనకు కావాల్సిన ఆహారం కూడా నిమిషాల్లోనే మన ఇంటికే వస్తుంది. ముఖ్యంగా స్విగ్గీకు చెందిన ఇన్‌స్టామర్ట్, అలాగే బ్లింక్ ఇట్, జెప్టో వంటి యాప్స్ ద్వారా మనకు కావాల్సిన కిరాణా కూడా గంటల్లోనే ఇంటికి చేరుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో భారతదేశంలో ప్రముఖ ఈ-కామర్స్ యాప్‌గా గుర్తింపు పొందిన ఫ్లిప్‌కార్ట్ కూడా పది నిమిషాల్లోనే ఆర్డర్‌ను కస్టమర్‌కు డెలివరీ ఇచ్చేందుకు సిద్ధం అవుతుంది. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ గ్రాసరీ ఆర్డర్స్‌తో పాటు స్మార్ట్ ఫోన్లను పది నిమిషాల్లో డెలివరీ ఇచ్చేలా చర్యలను తీసుకుంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ పేరుతో అందుబాటులోకి వస్తున్న ఈ స్పీడ్ డెలివరీ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

ఇటీవల విడుదలైన పలు నివేదికల ప్రకారం ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ ద్వారా స్పీడ్ డెలివరీ సిస్టమ్ ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో అమలు చేస్తున్నారని సమాచారం. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ హోమ్ బ్రాంచ్ ఉన్న బెంగూళూరులోని కొన్ని ప్రాంతాల్లో ఈ సిస్టమ్ అమల్లోకి వచ్చిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో ఎంపిక చేసిన వినియోగదారులకు ఈ సేవ అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఫ్లిప్ కార్ట్ మినిట్స్ యాప్ ద్వారా గ్రాసరీ వస్తువులతో పాటు ఐ ఫోన్ 15 లేదా సోనీ ప్లే స్టేషన్ కన్సోల్ వంటి హై-ఎండ్ వస్తువులను కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. ఫ్లిప్‌కార్ట్ మినిట్స్‌ యాప్‌ను ప్రజలకు చేరువ చేసేందుకు ఫ్లిప్‌కార్ట్ వివిధ ఆఫర్లను అందించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

బెల్లందూర్, హెచ్‌ఎస్‌ఆర్ వంటి బెంగళూరులోని ఎంపిక చేసిన ప్రాంతాల్లోని ఆండ్రాయిడ్ వినియోగదారులకే ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ యాప్ ద్వారా స్పీడ్ డెలివరీ అందుబాటులో ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా ఆర్డర్‌ను కేవలం 16 నిమిషాల్లోపు కస్టమర్ ఇంటికి చేర్చేలా ఫ్లిప్ కార్ట్ చర్యలను తీసుకుంటుంది. అయితే  రూ. 99 కంటే ఎక్కువ ఆర్డర్‌ల కోసం ఉచిత డెలివరీలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్లు వివిధ యాప్స్‌కు గట్టి పోటీనిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఆర్డర్ మన ఇంటికి వచ్చాక రిజెక్ట్ చేసే అవకాశం కూడా వినియోగదారులను అందుబాటులో ఉంటుంది. అయితే ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ యాప్ ఆర్డర్‌పై రూ.5 వరకు ప్లాట్‌ఫారమ్ ఫీజు వసూలుద చేస్తుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..