Facebook: ఫేస్‌బుక్ యూజర్లకు గుడ్‌న్యూస్.. మెసెజింగ్ కోసం పాత ఫీచర్‌ను మళ్లీ తీసుకొస్తున్న మెటా..

|

Mar 09, 2023 | 4:03 PM

కొన్ని సంవత్సరాల తర్వాత మెసేజ్‌ల కోసం ప్రత్యేక యాప్‌ కావాలని కంపెనీ భావించి.. మెజెంజర్‌ యాప్‌ను అందరూ డౌన్‌లోడ్‌ చేసుకొనే అవసరాన్ని క్రియేట్‌ చేసింది. అయితే ఫేస్‌బుక్‌ ఇప్పుడు

Facebook: ఫేస్‌బుక్ యూజర్లకు గుడ్‌న్యూస్.. మెసెజింగ్ కోసం పాత ఫీచర్‌ను మళ్లీ తీసుకొస్తున్న మెటా..
Meta's Fb
Follow us on

సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోయిన ప్రస్తుత కాలంలో.. ఫేస్‌బుక్ గురించి తెలియనివారు ఉండరు. ఇది ఎంత పాప్యులర్ అంటే రెండేసి ఫేస్‌బుక్ అకౌంట్లను కలిగి ఉన్నవారి సంఖ్య.. దాని వాడకంలో దాదాపు 40 శాతానికి పైగానే ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది యూజర్లు కూడా ఉన్నారు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా యాప్‌లో కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలో ఫేస్‌బుక్‌ తన యాప్‌లో ఓ సరికొత్త మార్పు చేయబోతోంది. త్వరలో ఎఫ్‌బీ యాప్‌లోనే మెసేజ్ ఇన్‌బాక్స్‌ని యాక్సెస్ చేసే సదుపాయం కలగనుంది. వాస్తవానికి మెసెంజర్ రాకముందు ఫేస్‌బుక్ యాప్‌లోనే యూజర్లు మెసేజ్‌లు యాక్సెస్‌ చేసే ఫీచర్‌ ఉంది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత మెసేజ్‌ల కోసం ప్రత్యేక యాప్‌ కావాలని కంపెనీ భావించి.. మెజెంజర్‌ యాప్‌ను అందరూ డౌన్‌లోడ్‌ చేసుకొనే అవసరాన్ని క్రియేట్‌ చేసింది. అయితే ఫేస్‌బుక్‌ ఇప్పుడు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోెవడమే కాక యాప్‌లో మెసేజ్ ఇన్‌బాక్స్‌ను తిరిగి తీసుకొచ్చింది. తమ అప్లికేషన్‌లో యూజర్లకు మెసెంజర్ ఇన్‌బాక్స్‌ని యాక్సెస్‌ అందించే ఆప్షన్‌ను టెస్ట్‌ చేస్తున్నట్లు కంపెనీ తాజాగా ప్రకటించింది.

ఈ క్రమంలో త్వరలోనే ఈ ఫెసిలిటీని అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. ఫేస్‌బుక్‌లో మెసేజ్‌ ఇన్‌బాక్స్‌ను అందించడం ద్వారా కంటెంట్ డిస్కవరీ, షేరింగ్ మెరుగవుతుందని మెటా కంపెనీ తెలిపింది. ఇతర సోషల్ మీడియా యాప్‌లు, షార్ట్‌ వీడియో యుగంలో తగ్గుతున్న ఫేస్‌బుక్‌ ప్రాధాన్యానికి ఈ నిర్ణయానికి ఎలాంటి సంబంధం లేదు. రెండు బిలియన్ల రోజువారీ యాక్టివ్‌ యూజర్ల మైలురాయిని చేరుకున్నట్లు కంపెనీ తాజాగా పేర్కొంది. ఈ స్థాయిలో యాక్టివ్‌ యూజర్లను సొంతం చేసుకోవడం గొప్ప విషయం. కానీ కొన్ని సంవత్సరాలుగా ఫేస్‌బుక్‌ రెవెన్యూ తగ్గుతూ వస్తోంది. ఈ క్రమంలో ఈ మార్పును శాశ్వతం చేయాలని, భవిష్యత్తులో ఫేస్‌బుక్‌ మెసేంజర్‌ యాప్‌ను తిరిగి తీసుకొచ్చే యోచన లేదని మెటా పేర్కొంది.

ఇవి కూడా చదవండి

ఆల్ఫాబెట్ బాటలోనే మెటా కూడా..

ఫేస్‌బుక్‌ యూజర్‌ ప్రైవసీ, డేటా రెగ్యులేషన్‌ సమస్యలతో చిక్కుకున్న తరుణంలో కంపెనీ మాతృసంస్థ పేరును మెటాగా మార్చింది. గూగుల్‌కు ఆల్ఫాబెట్ తరహాలోనే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మాతృ సంస్థ కిందకు వచ్చేలా మెటా క్రియేట్‌ అయింది. ప్రజలు టెక్స్ట్ పోస్ట్‌ల కంటే ఎక్కువ వీడియోలను ప్రాధాన్యం ఇస్తున్నారు. అన్ని వేదికల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ట్రెండ్‌లను అందుకోవడానికి మెటా తన శక్తి మేరకు ప్రయత్నిస్తూనే ఉంది. వివిధ అప్లికేషన్‌లలోని ఫీచర్లను మెర్జ్‌ చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలు లాగానే, వాట్సాప్‌లో స్టేటస్‌ ఆప్షన్‌ పని చేస్తుంది. కానీ మెసేజెస్‌ ఫీచర్‌ మిలియన్ల మంది యూజర్లకు ఉపయోగకరంగా ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి