Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tesla Smartphone: టెస్లా నుంచి స్మార్ట్‌ ఫోన్‌లు కూడా వచ్చేస్తున్నాయి.. ధర, ఫీచర్లు ఎలా ఉండనున్నాయో తెలుసా?

Tesla Smartphone: టెస్లా అంటే ఎలాన్‌ మస్క్‌, ఎలాన్‌ మస్క్‌ అంటే టెస్లా అన్నంతలా పరిస్థితి మారిపోయింది. ఎలక్ట్రిక్‌ కార్ల రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న టెస్లా, స్సేస్‌ ఎక్స్‌ పేరుతో అంతరిక్ష..

Tesla Smartphone: టెస్లా నుంచి స్మార్ట్‌ ఫోన్‌లు కూడా వచ్చేస్తున్నాయి.. ధర, ఫీచర్లు ఎలా ఉండనున్నాయో తెలుసా?
Tesla Smat Phone
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 22, 2021 | 4:46 PM

Tesla Smartphone: టెస్లా అంటే ఎలాన్‌ మస్క్‌, ఎలాన్‌ మస్క్‌ అంటే టెస్లా అన్నంతలా పరిస్థితి మారిపోయింది. ఎలక్ట్రిక్‌ కార్ల రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న టెస్లా, స్సేస్‌ ఎక్స్‌ పేరుతో అంతరిక్ష సంస్థను కూడా నెలకొల్పారు. ఇలా టెక్నాలజీతో కూడిన ప్రతీ రంగంలో అడుగుపెట్టిన టెస్లా.. తాజాగా మొబైల్‌ తయారీ కంపెనీ రంగంలోకి కూడా అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం టెక్‌ మార్కెట్లో టెస్లా స్మార్ట్‌ ఫోన్‌లపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే అన్ని రంగాల్లో చెరగని ముద్ర వేసుకున్న టెస్లా, స్మార్ట్‌ ఫోన్‌ రంగంలో ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తుందో అన్న చర్చ మొదలైంది. ఇక టెస్లా కంపెనీ ఇప్పటి వరకు ఈ ఫోన్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ.. నెట్టింట మాత్రం ఈ ఫోన్‌పై కొన్ని వార్తలు షికార్లు చేస్తున్నాయి. వీటి ప్రకారం ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత ఉండనుంది.? లాంటి విశేషాలను మీకోసం..

ఫీచర్లు ఎలా ఉండనున్నాయి..

టెస్లా కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను మోడల్‌ పై/పీ (Model Pi/P) అనే పేరుతో తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇక టెస్లా ఈ స్మార్ట్‌ఫోన్‌ రూపాన్ని ఇప్పటి వరకు ఏ స్మార్ట్‌ ఫోన్‌ లేని రీతిలో డిజైన్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 108 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు మరో రెండు కెమెరాలు ఉండనున్నాయి. ఇక ఈ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 898 ప్రాసెసర్‌తో పనిచేయనున్నట్లు సమాచారం. 6.5 ఇంచెస్‌తో కూడిన 4కే రిజల్యూషన్‌ డిస్‌ప్లేను ఇవ్వనున్నట్లు సమాచారం.

ధర విషయానికొస్తే..

ఇప్పటి వరకు తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ స్మార్ట్‌ ఫోన్‌ 800 నుంచి 1200 డాలర్ల వరకు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 60 నుంచి రూ. 90 వేల మధ్య ఈ ఫోన్‌ ధర ఉండనుంది. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫోన్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారని సమాచారం.

Also Read: Ongole Politics: ఒంగోలులో సుబ్బారావు గుప్తా కేసులో మరో ట్విస్ట్.. దాడికి పాల్పడ్డ వైసీపీ నేత సుభాని అరెస్ట్!

హైదరాబాద్‌లో ఐదేళ్లల్లో ఎన్ని క్వింటాళ్ల బంగారం పట్టుబడిందో తెలుసా..?

PM Modi: దేశంలో పెరుగుతోన్న ఒమిక్రాన్ వేరియంట్ కేసులు.. తాజ పరిస్థితులపై సమావేశం నిర్వహించనున్న మోడీ..