
ఓపెన్ ఏఐకి పోటీగా ఎలన్ మస్క్ గ్రోక్ ఇమాజిన్ అనే ఏఐను లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దీన్ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్తూ.. గ్రోక్ ఇమాజిన్ వెర్షన్ 0.9 ను లాంచ్ చేశారు. ఈ ఫీచర్ టెక్స్ట్, ఇమేజ్‌లు, వీడియోలను హై క్వాలిటీలో వేగవంతంగా జనరేట్ చేయగలదు. రాబోయే రోజుల్లో ఈ టూల్ ఉపయోగించి సినిమా తీసేయొచ్చని మస్క్ అంటున్నాడు.
ఏఐ కంటెంట్ క్రియేషన్ లో ప్రస్తుతం పలు ఏఐ కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే ఓపెన్ ఏఐ సోరా పేరుతో డిజిటల్ కంటెంట్ ఏఐ ను లాంచ్ చేయగా దానికి పోటీగా మస్క్ గ్రోక్ ఇమాజిన్ ను తీసుకొచ్చాడు. తర్వాత ఓపెన్ ఏఐ సోరా 2.0 ను లాంచ్ చేయగా.. మస్క్ గ్రోక్ ఇమాజిన్ v0.9ను తీసుకొచ్చాడు. ఇది అతి వేగవంతమైన టెక్స్ట్, వీడియో, ఇమేజ్ జెనరేషన్ అని మస్క్ పేర్కొన్నారు. ఈ అప్‌డేటెడ్ మోడల్ 15 సెకన్లలోపు కంటెంట్‌ను సృష్టించగలదు. ఈ టూల్ ద్వారా యూజర్లు రియల్-టైమ్ క్రియేషన్ అనుభవాన్ని పొందొచ్చు.
ఈ ఏఐ టూల్ ఎలాంటి టెక్స్ట్, ఇమేజ్, వీడియోలు అయినా కేవలం15 సెకన్లలో రెడీ చేస్తుంది. ఇది హైబ్రిడ్ టెక్స్ట్ మోడల్ తో పని చేస్తుంది. స్క్రోల్ చేసే టైంలోనే ఇమేజ్‌లు రియల్-టైమ్‌లో లోడ్ అయ్యి కనిపిస్తాయి. -ఇది అల్ట్రా-ఫాస్ట్ వీడియో జనరేషన్ ఎక్స్ పీరియెన్స్ ను అందిస్తుంది. వీడియో క్లిప్‌లు సెకన్లలో రెండర్ అవుతాయి. ఈ టూల్ లో వాయిస్ స్పీచ్‌తో కూడా ఇంటరాక్ట్ చేయవచ్చు. కంటెంట్ క్రియేటర్ల నుంచి ప్రొఫెషనల్స్ వరకూ అందరికీ ఈ టూల్ బెస్ట్ ఎక్స్ పీరియెన్స్ నిస్తుంది.
ఇకపోతే మస్క్.. ఈ టూల్ గురించి ఎక్స్ లో పోస్ట్ చేసిన వెంటనే నెటిజన్లు గ్రోక్ ఇమాజిన్ తో క్రియేట్ చేసిన రకరకాల క్రియేటివ్ వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తున్నారు. మస్క్ ఈ టూల్ గురించి మాట్లాడుతూ 2026 చివరి నాటికి గ్రోక్ AI మూవీని తయారు చేస్తుంది . మరో సంవత్సరంలో AI గేమ్ అంతా మారబోతోంది అన్నారు.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి