ISSతో ఫాల్కన్-9 వ్యోమనౌక డాకింగ్ విజయవంతం.. చరిత్ర సృష్టించిన శుభాంశు శుక్లా
అంతరిక్షం లో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. అంతరిక్ష పరిశోధ కేంద్రం ISSతో ఫాల్కన్ వ్యోమ నౌక డాకింగ్ విజయవంతం అయ్యింది. బుధవారం(జూన్ 25) శుభాంశు శుక్లా తోపాటు మరో ముగ్గురు వ్యోమగాములను తీసుకుని యాక్సియం-4 నింగిలోకి దూసుకెళ్లింది. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్‌సెంటర్‌లో చేపట్టిన ఫాల్కన్-9 విజయవంతంగా అంతరిక్షంలోకి వెళ్లింది.

అంతరిక్షం లో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. అంతరిక్ష పరిశోధ కేంద్రం ISSతో ఫాల్కన్ వ్యోమ నౌక డాకింగ్ విజయవంతం అయ్యింది. బుధవారం(జూన్ 25) శుభాంశు శుక్లా తోపాటు మరో ముగ్గురు వ్యోమగాములను తీసుకుని యాక్సియం-4 నింగిలోకి దూసుకెళ్లింది. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్‌సెంటర్‌లో చేపట్టిన ఫాల్కన్-9 విజయవంతంగా అంతరిక్షంలోకి వెళ్లింది. స్పేస్‌లో అడుగుపెట్టగానే జైహింద్.. జై భారత్ అన్న సందేశాన్ని శుభాంశు శుక్లా పంపించారు. ISSలో అడుగుపెడుతున్న తొలి భారతీయుడు శుభాంశు శుక్లాను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు.
నా భుజాలపై త్రివర్ణ పతాకం ఉంది. సెకనుకు 7.5 కిలోమీటర్ల వేగంతో యాక్సియం-4 ప్రయాణం చేస్తోందన్నారు శుభాంశు శుక్లా. ఈ యాత్ర ఎంతో అద్భుతంగా ఉందని సందేశమిచ్చారు. ప్రతి భారతీయుడి ఆశీస్సులు తనకు కావాలన్నారు. ISSలో శుభాంశు శుక్లా కీలక ప్రయోగాలు చేయబోతున్నారు. మిషన్‌తో శుభాంశుతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు ఉన్నారు.
వీడియో చూడండి..
Watch Dragon and the Ax-4 astronauts dock with the @Space_Station https://t.co/ObPHodyVlf
— SpaceX (@SpaceX) June 26, 2025
భారతదేశ వ్యోమగామి శుభాంషు శుక్లా అంతరిక్షంలో అడుగు పెట్టారు. ఆయన 14 రోజుల పాటు అంతరిక్షంలో ఉంటారు. అంతకుముందు, ఆయన వీడియో సందేశం బయటకు వచ్చింది. అందులో ఆయన నవ్వుతూ – అంతరిక్షం నుండి హలో! నేను అంతరిక్షంలో నడవడం, పిల్లవాడిలా తినడం, త్రాగడం నేర్చుకుంటున్నాను. నేను చాలా నిద్రపోతున్నాను. ఇది భారతదేశ మానవ అంతరిక్ష కార్యక్రమం వైపు ఒక చిన్న కానీ స్థిరమైన, దృఢమైన అడుగు అని పేర్కొన్నారు.
గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా ఒక చారిత్రాత్మక ప్రయాణాన్ని ప్రారంభించారని భారత వైమానిక దళం తెలిపింది. భూమి వెలుపల త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన స్క్వాడ్రన్ లీడర్ రాకేష్ శర్మ మిషన్ తర్వాత 41 సంవత్సరాల తర్వాత ఈ అద్భుతమైన క్షణం. ఇది ఒక మిషన్ కంటే చాలా ఎక్కువ. భారతదేశంతో సహా 4 దేశాల నుండి వ్యోమగాములను తీసుకెళ్లే అంతరిక్ష యాత్ర ఒక మైలురాయిగా నిలుస్తుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు.
వీడియో చూడండి..
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




